రిటైర్మెంట్ ఇచ్చేసిన క్రీడా దిగ్గజాలు
Suryaa
|December 24, 2025
• టెన్నిస్ కోర్ట్ నుంచి డబ్ల్యూ డబ్ల్యూఈ రింగ్ వరకు వీడ్కోలు
-
• రోకో డెసిషన్ అందరికీ పెద్ద షాక్!
• 2025లో క్రికెట్ పిచ్ నుంచి ఫుట్ బాల్ మైదానం వరకు
2025లో క్రీడా ప్రపంచం పలువురు దిగ్గజ ఆటగాళ్ల వీడ్కోలుకు సాక్షిగా నిలిచింది. క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, డబ్ల్యూడబ్ల్యూఈ వంటి విభిన్న క్రీడల్లో కొన్నేళ్లుగా ప్రేక్షకులను ఉర్రూతలూగించి కోట్లాది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ఆటగాళ్లు తమ కెరీర్కు ముగింపు పలికారు. క్రికెట్లో టీమ్ ఇండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ నుంచి ఫుట్బాల్లో సెర్జియో బుస్కెట్స్, జోర్డీ ఆల్బా, మార్సెలో, హమ్మెల్స్ లాంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు వరకు పలువురు ప్రపంచస్థాయి ప్లేయర్స్ తమ సుదీర్ఘ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. 2025 ఏడాదికి మరికొన్ని రోజుల్లోనే గుడ్బై చెప్పనున్న వేళ, ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ క్రీడాకారులు ఎవరో తెలుసుకుందాం.
టెస్టు క్రికెట్కు విరాట్ కోహ్లి గుడ్బై : భారత క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లి ఓ లెజెండ్. సమకాలిన ప్రపంచ క్రికెట్లో అతడు రారాజు. అలాంటి దిగ్గజ ఆటగాడు 2025 మే 12న టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 36 ఏళ్ల వయసులో ఈ నిర్ణయం తీసుకున్న కోహ్లి, సోషల్ మీడియా ద్వారా 'తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. 14 ఏళ్ల టెస్టు కెరీర్లో కోహ్లి 123 మ్యాచ్లు ఆడి, 9,230 పరుగులు (సగటు 46.85) సాధించాడు. భారత్ తరఫున టెస్టుల్లో సచిన్ తెందుల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గావస్కర్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు.కోహ్లి. అతడి నాయకత్వంలో భారత్ జట్టు అద్భుతమైన విజయాలను అందుకుంది. విదేశీ గడ్డపై చిరస్మరణీయ టెస్టు విజయాలు కోహ్లి సేన సాధించింది. 2024లో టీ20 వరల్డ్ కప్ విజయం అనంతరమే టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన కోహ్లి, ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.
This story is from the December 24, 2025 edition of Suryaa.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Suryaa
Suryaa
టీ20లో 500 వికెట్ల ఎలైట్ క్లబ్
టీ20 ఫార్మాట్కు భారీ అభిమానగణం ఉంది, ఎందుకంటే బ్యాటర్లు పూర్తి స్వేచ్ఛగా ఆడినప్పుడు ఈ ఫార్మాట్లో బౌండరీలు మరియు సిక్సర్ల వర్షం కురుస్తుంది.
2 mins
December 16, 2025
Suryaa
నేడే అబుదాబీ వేదికగా ఐపీఎల్ మినీవేలం
ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న జరగనుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు రూ.237.55 కోట్ల సంయుక్త బడ్జెట్తో 77 ఆటగాళ్ల స్థానాల కోసం పోటీపడనున్నాయి.
1 min
December 16, 2025
Suryaa
మరో వివాదంలో బిహార్ సీఎం..
మహిళ హిజాబ్ను లాగిన నీతీశ్
1 min
December 16, 2025
Suryaa
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైజ్ మిస్సింగ్
నెహ్రూ, ఇందిర చేసిన తప్పువల్లే గంగా నదికి తీవ్ర ముప్పు
2 mins
December 16, 2025
Suryaa
విద్యార్థులు క్రీడలలో పాల్గొనడం చాలా ప్రయోజనకరం
విద్యతోపాటు విద్యార్థులు క్రీడలలో పాల్గొనడం చాలా ప్రయోజనకరం అని, ఇది నాయకత్వ లక్షణాలు, శారీరక దృఢత్వం పట్టుదల స్ఫూర్తిని పెంపొందించడంలో సహాయపడుతుందని, జాతీయ మాజీ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు, జాతీయ కోచ్ కే. విశాల్ కుమార్ అన్నారు.
1 min
December 16, 2025
Suryaa
జీహెచ్ఎంసీలో డివిజన్ల పెంపుపై హైకోర్టులో పిటిషన్
నేడు విచారణ చేపట్టనున్న న్యాయ స్థానం
1 min
December 16, 2025
Suryaa
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ సిన్హా బాధ్యతలు
బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు
1 mins
December 16, 2025
Suryaa
భారత్లో వీసా సర్వీసు ఫీజును పెంచిన న్యూజిలాండ్
వీసా దరఖాస్తు కేంద్రాల్లో వసూలు చేసే సర్వీసు ఫీజును పెంచుతున్నట్లు న్యూజిలాండ్ ప్రకటించింది.
1 min
December 16, 2025
Suryaa
వెట్టింగ్ వేళ మరో పిడుగు..
భారీగా హెచ్-1బి, హెచ్ -4 వీసాలు 'రద్దు
1 min
December 16, 2025
Suryaa
టీమిండియా నంబర్-3 తలనొప్పి
టీ20 ప్రపంచకప్-2024 టైటిల్ గెలిచిన తర్వాత టీమిండియాలో చోటు చేసుకున్న ప్రధాన మార్పు..
1 mins
December 16, 2025
Listen
Translate
Change font size

