Try GOLD - Free
శబరిమలలో బంగారం అవకతవకలు
Suryaa
|October 11, 2025
క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులకు ఆదేశం 6 వారాల్లో సిట్ నివేదిక సమర్పించాలని ఆదేశాలు
-
శబరిమల : శబరిమల దేవస్థానంలో బంగారం అవకతవకల వ్యవహారంలో క్రిమినల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని కేరళ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. జస్టిస్ వి. రాజా విజయరాఘవన్, జస్టిస్ కేవీ జయకుమార్తో కూడిన ధర్మాసనం సిట్ దర్యాప్తు ఆధారంగా తాజా ఉత్తర్వులు జారీ చేసింది. దేవస్థానం సైడ్ ఫ్రేములకు సంబంధించిన బంగారం లెక్కల్లో అవకతవకలు జరిగినట్లు పేర్కొంది. విజిలెన్స్ నివేదికలో కూడా ఈ విషయం వెల్లడైనట్లు కేరళ హైకోర్టు తెలిపింది. బంగారం సైడ్ ఫ్రేములు వ్యవహారంతోపాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అన్ని అంశాలపై విచారణ జరపాలని సిట్ను ఆదేశించింది. విజిలెన్స్ నివేదికను ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ముందు ఉంచాలని సూచించింది. 6 వారాల్లో నివేదికను సీల్డ్ కవర్లో పెట్టి తమకు సమర్పించాలని సిట్ను ఆదేశించిన కేరళ హైకోర్టు, రెండు వారాలకొకసారి దర్యాప్తు పురోగతిని తెలియజేయాలని సూచించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆ వివరాలు ప్రజలకు గానీ మీడియాకు గానీ వెల్లడించకూడదని ధర్మాసనం ఆదేశించింది.
This story is from the October 11, 2025 edition of Suryaa.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Suryaa
Suryaa
మీ నమ్మకాన్ని వమ్ము చేయడం లేదు
• అభివృద్ధి.. సంక్షేమంలో ఎక్కడా తగ్గడం లేదు • పాలేరు నియోజకవర్గ పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
1 mins
January 11, 2026
Suryaa
పోటీల విజయవంతంలో క్రీడా సంఘాల సహకారం ముఖ్యం
• సీఎం కప్ 2025 లో క్రీడా సంఘాల భాగస్వామ్యం • రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
1 mins
January 11, 2026
Suryaa
సినీ ఇండస్ట్రీని పట్టించుకోవడం మానేశా
టికెట్ ధరల పెంపునకు నేను అనుమతి ఇవ్వలేదు : మంత్రి కోమటిరెడ్డి
1 min
January 11, 2026
Suryaa
ఎరువుల లోటు లేకుండా చూడాలి
• ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధే లక్ష్యం | మంత్రి పొన్నం హుస్నాబాద్లో సుడిగాలి పర్యటన • అధికారులతో సమీక్షా సమావేశాలు, పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన
1 min
January 11, 2026
Suryaa
చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి
• శక్తిమంతమైన భారతను నిర్మించడమే లక్ష్యం • అవమానం, నాశనం, అణచివేత చరిత్రను మర్చిపోవద్దన్న జాతీయ భద్రతా సలహాదారు యువతలో ఆవేశం, తపన అవసరమని సూచించిన అజిత్ ధోబాల్
1 mins
January 11, 2026
Suryaa
మేడారంలో మూడు ఆసుపత్రులు
• 30 మెడికల్ క్యాంపులు..అత్యవసర సేవలకు 35 అంబులెన్సులు భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దు • ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి • మంత్రి దామోదర రాజనర్సింహ
2 mins
January 11, 2026
Suryaa
ఈడీ, బెంగాల్ ప్రభుత్వం మధ్య ముదిరిన వివాదం
సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసిన టీఎంసీ సర్కార్ • ఐప్యాక్ కేసులో సుప్రీంకోర్టును ఈడీ ఆశ్రయించవచ్చనే ఊహాగానాలు • ఈ నేపథ్యంలో ఈడీ కంటే ముందుగానే సుప్రీంకోర్టును ఆశ్రయించిన మమత సర్కార్
1 min
January 11, 2026
Suryaa
తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లో భాగస్వాములు కావాలి
బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థులకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం
1 min
January 11, 2026
Suryaa
హైదరాబాద్లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
రాజభవన్ వేదికగా ప్రారంభమైన మూడవ ఎడిషన్ • భారీగా పాల్గొన్న చలన చిత్రనిర్మాతలు, కళాకారులు, సాంస్కృతిక ప్రముఖులు
1 mins
January 11, 2026
Suryaa
మహిళా ఐఏఎస్ అధికారులపై వచ్చిన అసభ్య, అనుచిత ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
మహిళా ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని కొంతమంది వ్యక్తులు, కొన్ని మీడియా వేదికలు అసభ్యంగా, అనుచితంగా వార్తలు, వ్యాఖ్యలు చేయడం అత్యంత ఆందోళనకరమైన విషయం అని తెలంగాణ పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు.
1 min
January 11, 2026
Listen
Translate
Change font size
