Facebook Pixel అమ్మంటే అమ్మ...! | Sri Ramakrishna Prabha - religious-spiritual - Read this story on Magzter.com

Try GOLD - Free

అమ్మంటే అమ్మ...!

Sri Ramakrishna Prabha

|

May 2024

అమ్మంటే ప్రేమ... అమ్మంటే త్యాగం... అమ్మంటే సేవ...అమ్మంటే సహనం! ఇన్ని మహనీయ గుణాలు మూర్తీభవించిన ఆమెకు ఆమే సాటి! అమ్మస్థానం హిమగిరిలా అతి మహోన్నతం!

- శ్రీమతి టి. లక్ష్మి

అమ్మంటే అమ్మ...!

ఈ అవనిపై అమ్మను మించిన దేవత లేదు.పిల్లల ప్రతీ విజయం వెనుక పరోక్ష ప్రేరణ కన్నతల్లిదే! పుత్రోత్సాహం తండ్రిదైనా, పుత్ర విజయం మాత్రం తల్లిదే! 

జగద్గురువులైనా, మహా సామ్రాజ్యాధినేతలైనా, ప్రపంచాన్ని శాసించగల నేతలైనా, వీరాధివీరులైనా తమ తమ శక్తిసామర్థ్యాలు మరచి, పసిపిల్లలై ఒదిగేది అమ్మ చల్లని ఒడిలోనే! జీవితపు బరువు బాధ్యతలతో ఒడిదుడుకుల నడుమ నలిగిపోయే సామాన్యుడికి, వాటన్నిటినీ మరపించి, చేయూతనిచ్చి, 'కన్నా నీకు నేనున్నానంటూ అనుక్షణం నీడై నడిచేది అమ్మతోడు! జననమరణాలు లేని నిరాకార పరబ్రహ్మం సాకారం దాల్చడానికైనా... నవ మాసాలూ మోసి, ప్రసవ వేదన అనుభవించి, జన్మనిచ్చేది అమ్మే!

స్కందశ్చ భగవాన్ దేవః సోమశ్చ స బృహస్పతిః 

శైలాః సర్వే సముద్రాశ్చ రాజా వరుణ ఏవ చ I...

త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్ణోరమితతేజసః

యదాసీన్మంగళం రామ | తత్తే భవతు మంగళమ్ ॥ 

నాయనా! శ్రీరామా! కుమారస్వామి, చంద్రుడు, బృహస్పతి, సప్తర్షులు, నారదులవారు, పర్వతాలు, సముద్రాలు, వరుణుడు, భూమ్యాకాశాలు, సమస్త గ్రహాలు వనవాస కాలమున నిన్ను రక్షించుగాక! మూడడుగులతో ముల్లోకాలనూ ఆక్రమించిన శ్రీమహావిష్ణువును ఆశ్రయించిన మంగళములన్నీ నీకునూ లభించుగాక! అంటూ తనకు ప్రణమిల్లిన శ్రీరాముడిని కౌసల్యామాత ఆశీర్వదించగా, ఆ ఆశీర్వచనములే శ్రీరాముడికి సదా రక్షయై విజయాన్ని చేకూర్చాయి.

శ్రీమద్భాగవతంలో... బిడ్డలైన దేవతలను రాక్షసులు హింసిస్తూంటే, సహింపలేని తల్లి అదితి వారి క్షేమానికై మహావిష్ణువును ప్రార్థింపగా, ఆయన...

...భవదీయ గర్భమునఁ తేజోమూర్తినై జన్మించెదన్

నాకున్ వేడుకపుట్ట నీ సుతుఁడనై నర్తించి వర్తింపఁగాన్ ...

నా రూపము మానసించి నలినీ గర్భాగారంబు వచ్చి చొచ్చెద,

గారామునఁ బెంపవమ్మ కరుణన్ నన్నున్

MORE STORIES FROM Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

సూక్తి సౌరభం

అల్పబుద్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పు తినెడి కుక్క చెఱకు తీపెరుగునా? విశ్వదాభిరామ వినుర వేమ!

time to read

1 min

November 2025

Sri Ramakrishna Prabha

శ్రీరామకృష్ణులు

శ్రీరామకృష్ణులు

time to read

1 min

November 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

గ్రంథ పరిచయం

వివాహం దివ్యత్వ సాధనం

time to read

1 min

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

ఆత్మ ఎగసే అనంతాకాశంలో...

రవీంద్ర గీతాంజలి - చైతన్య

time to read

1 mins

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

సుబోధ

సుబోధ

time to read

1 min

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

అపూర్వ శిష్యుడు అలౌకిక గురువు

భారతదేశం సనాతన వైభవాన్ని కోల్పోయి పరాయిపాలనలో నిస్సహాయంగా ఆక్రందిస్తున్న కాలమది.

time to read

3 mins

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

మతమే మన ఆయువుపట్టు...

ధీరవాణి

time to read

1 min

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

గురుభక్తి గురుసేవ గురుకార్యం

మన సంస్కృతిలో గురువు స్థానం అత్యున్నతమైనది. అలాంటి గురువును ఆశ్రయించి, సేవించి, విద్యలలోకెల్లా అత్యున్నతమైన బ్రహ్మవిద్యను అభ్యసించమని వేదోపనిషత్తులు ప్రబోధించాయి.

time to read

3 mins

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

సింహాద్రి అప్పన్న చందనోత్సవం

వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!

time to read

1 min

May 2024

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం

ఆ౦ధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్‌ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.

time to read

1 min

May 2024

Listen

Translate

Share

-
+

Change font size