![అమ్మంటే అమ్మ...!](https://cdn.magzter.com/1640414417/1714642531/articles/BGMDVtrhz1715929451823/1715930257569.jpg)
ఈ అవనిపై అమ్మను మించిన దేవత లేదు.పిల్లల ప్రతీ విజయం వెనుక పరోక్ష ప్రేరణ కన్నతల్లిదే! పుత్రోత్సాహం తండ్రిదైనా, పుత్ర విజయం మాత్రం తల్లిదే!
జగద్గురువులైనా, మహా సామ్రాజ్యాధినేతలైనా, ప్రపంచాన్ని శాసించగల నేతలైనా, వీరాధివీరులైనా తమ తమ శక్తిసామర్థ్యాలు మరచి, పసిపిల్లలై ఒదిగేది అమ్మ చల్లని ఒడిలోనే! జీవితపు బరువు బాధ్యతలతో ఒడిదుడుకుల నడుమ నలిగిపోయే సామాన్యుడికి, వాటన్నిటినీ మరపించి, చేయూతనిచ్చి, 'కన్నా నీకు నేనున్నానంటూ అనుక్షణం నీడై నడిచేది అమ్మతోడు! జననమరణాలు లేని నిరాకార పరబ్రహ్మం సాకారం దాల్చడానికైనా... నవ మాసాలూ మోసి, ప్రసవ వేదన అనుభవించి, జన్మనిచ్చేది అమ్మే!
స్కందశ్చ భగవాన్ దేవః సోమశ్చ స బృహస్పతిః
శైలాః సర్వే సముద్రాశ్చ రాజా వరుణ ఏవ చ I...
త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్ణోరమితతేజసః
యదాసీన్మంగళం రామ | తత్తే భవతు మంగళమ్ ॥
నాయనా! శ్రీరామా! కుమారస్వామి, చంద్రుడు, బృహస్పతి, సప్తర్షులు, నారదులవారు, పర్వతాలు, సముద్రాలు, వరుణుడు, భూమ్యాకాశాలు, సమస్త గ్రహాలు వనవాస కాలమున నిన్ను రక్షించుగాక! మూడడుగులతో ముల్లోకాలనూ ఆక్రమించిన శ్రీమహావిష్ణువును ఆశ్రయించిన మంగళములన్నీ నీకునూ లభించుగాక! అంటూ తనకు ప్రణమిల్లిన శ్రీరాముడిని కౌసల్యామాత ఆశీర్వదించగా, ఆ ఆశీర్వచనములే శ్రీరాముడికి సదా రక్షయై విజయాన్ని చేకూర్చాయి.
శ్రీమద్భాగవతంలో... బిడ్డలైన దేవతలను రాక్షసులు హింసిస్తూంటే, సహింపలేని తల్లి అదితి వారి క్షేమానికై మహావిష్ణువును ప్రార్థింపగా, ఆయన...
...భవదీయ గర్భమునఁ తేజోమూర్తినై జన్మించెదన్
నాకున్ వేడుకపుట్ట నీ సుతుఁడనై నర్తించి వర్తింపఁగాన్ ...
నా రూపము మానసించి నలినీ గర్భాగారంబు వచ్చి చొచ్చెద,
గారామునఁ బెంపవమ్మ కరుణన్ నన్నున్
అమ్మా! తేజోమూర్తినై నీ కడుపున జన్మిస్తాను. నీ ఒడిలో ఆడుకోవాలని ఎంతో మక్కువగా ఉంది. నా రూపాన్ని తలుచుకుంటూ ఉండు. నీ గర్భాన చేరుతాను. అప్పుడు గారాబంతో, కనికరంతో నన్ను కాపాడుమమ్మా..! అన్నాడు.
Bu hikaye Sri Ramakrishna Prabha dergisinin May 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Sri Ramakrishna Prabha dergisinin May 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
![సింహాద్రి అప్పన్న చందనోత్సవం](https://reseuro.magzter.com/100x125/articles/26323/1685764/xfGzlvzaF1716021225018/1716021419208.jpg)
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!
![శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం](https://reseuro.magzter.com/100x125/articles/26323/1685764/LCq1eE_zc1716020995657/1716021188945.jpg)
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
ఆ౦ధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.
![ధర్మపరిరక్షకుడు ఆనందుడు](https://reseuro.magzter.com/100x125/articles/26323/1685764/w3toENXOw1716020307435/1716020998217.jpg)
ధర్మపరిరక్షకుడు ఆనందుడు
చిత్రాలు : ఇలయభారతి అనుసృజన : స్వామి జ్ఞానదానంద
![సమతామూర్తి సందేశం](https://reseuro.magzter.com/100x125/articles/26323/1685764/l6W_6bCYx1716020072114/1716020285203.jpg)
సమతామూర్తి సందేశం
బ్రీరామానుజుల శిష్యుడు ధనుర్దాసుడు. గురుభక్తి, నిరాడదంబరతగల అతడంటే రామానుజులకు ఎంతో ఇష్టం.
![బంధాలు.. బంధుత్వాలు -](https://reseuro.magzter.com/100x125/articles/26323/1685764/fxa391DVo1716019662722/1716020074214.jpg)
బంధాలు.. బంధుత్వాలు -
తనువుతోనే బంధుత్వాలు కలుగుతున్నాయి జీవునికి. అంటే, జీవునికి నిజానికి ఏ బంధుత్వాలూ లేవు.
![బుద్ధుడు ప్రశంసించిన అమూల్య రత్నం](https://reseuro.magzter.com/100x125/articles/26323/1685764/M82oUuTst1716019252995/1716019656174.jpg)
బుద్ధుడు ప్రశంసించిన అమూల్య రత్నం
బుద్ధుని ప్రముఖ శిష్యులలో మహాకాశ్యపుడు ఒకరు. బుద్ధునికి శిష్యుడు కాకముందు నుంచే మహాకాశ్యపునికి ఒక విధమైన మహత్వం ఉండేది.
![అన్ని ఆచారాలు పాటించినా అనారోగ్యాలెందుకు?](https://reseuro.magzter.com/100x125/articles/26323/1685764/YxFKZrEe41716018993363/1716019254161.jpg)
అన్ని ఆచారాలు పాటించినా అనారోగ్యాలెందుకు?
నేటి బేతాళ ప్రశ్నలు
![వీళ్ళ విలువ భగవంతుడికే తెలుస్తుంది!](https://reseuro.magzter.com/100x125/articles/26323/1685764/VxBrias6K1715936550574/1716019251767.jpg)
వీళ్ళ విలువ భగవంతుడికే తెలుస్తుంది!
ఇంజినీరింగ్ చదివిన కొడుకును వెంటబెట్టుకొని ఓ తల్లి ఈమధ్య మఠానికి వచ్చింది.
![.వాళ్ళు నలిగిపోతున్నారు! . .](https://reseuro.magzter.com/100x125/articles/26323/1685764/uLn1hf1IA1715932012286/1715936413402.jpg)
.వాళ్ళు నలిగిపోతున్నారు! . .
పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం గారు 'బిడ్డల శిక్షణ' అన్న పుస్తకం రాశారు.
![వికాసమే జీవనం!](https://reseuro.magzter.com/100x125/articles/26323/1685764/6AcorzzvV1715931681846/1715931985393.jpg)
వికాసమే జీవనం!
ధీరవాణి - స్వామి వివేకానంద