Prøve GULL - Gratis
బొబ్బిలి వీణ విశిష్టత
Vaartha-Sunday Magazine
|October 29, 2023
శ్రీసరస్వతీదేవికి అలంకార భూషితం... ఆ మహాజ్ఞాన ప్రసాదినికి విశ్వపరిపాలకుడు ఇచ్చిన పేటెంట్ హక్కు... సదరు వీణల తయారీలో విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రసిద్ధి గాంచడం బ్బి విశేషం.
శ్రీసరస్వతీదేవికి అలంకార భూషితం... ఆ మహాజ్ఞాన ప్రసాదినికి విశ్వపరిపాలకుడు ఇచ్చిన పేటెంట్ హక్కు... సదరు వీణల తయారీలో విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రసిద్ధి గాంచడం బ్బి విశేషం. వీరబొబ్బిలికి చరిత్రలో ఓ ప్రత్యేకపుట ఉన్నట్లే బొబ్బిలి వీణకు ఆ చరిత్రతో పెనవేసుకునే బంధమూ ఉంది.
సంగీత ప్రియుల హృదయ తంత్రులను మీటడంలో బొబ్బిలి వీణకు సాటి మరిలేదనడంలో అతిశయోక్తి లేదు. ప్రముఖ వీణావా(నా)దకులు వాసా కృష్ణమూర్తి, ఈమని శంకరశాస్త్రి, చిట్టిబాబు, జోగులాంబ, పద్మిని, శ్రీవాణి ఇలా ఎంతో మంది వీణానాద కళాకారులు తమ ప్రతిభకు పదును పెట్టి పలువురు మన్ననలు అందుకున్నది కేవలం బొబ్బిలి వీణ మహత్మ్యంగా చెప్పుకుంటారు. రెండు శతాబ్దాల క్రితం నాటి బొబ్బిలి వీణల తయారీని 1959లో ప్రభుత్వం గుర్తించింది.
అనేకమంది ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవతో బొబ్బిలిలో 1994లో దివంగత రాజా ఆర్విజికె రంగారావు సౌజన్యంతో తాత్కాలికంగా వీణల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. 2002లో మున్సిపల్ పరిధిలోని గొల్లపల్లిలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ పరిధిలో హస్తకళలఅభివృద్ధి కేంద్రాన్ని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటుచేసారు. బొబ్బిలి, గొల్లపల్లి, వాడాడ గ్రామాలకు చెందిన సుమారు 50 కుటుంబాలకు చెందిన 200 మంది హస్త కళాకారులు బొబ్బిలి వీణలను తయారు చేయడంతో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.వడ్రంగం, కమ్మరం, దంతపు మెట్లు కట్టడం, సప్తస్వరాలను వీనులవిందుగా అందించే విధంగా తీగలను బిగించడం వంటి జాగ్రత్తలతో బొబ్బిలిలో వీణలను తయారు చేస్తారు.ఇలా తయారుచేయగలగడం ఇక్కడి వారి ప్రత్యేకత. పనస చెట్టునుంచి సేకరించిన కలపతో అతుకులు లేకుండా ఏకండి కర్రతో తయారు కావడమే బొబ్బిలి వీణ ప్రత్యేకత. ఇత్తడి లేక కంచుతో మెట్టు తయారుచేసి ఇత్తడి కర్రతో కుటీలు అమర్చి సుస్వరాలు పలికించడానికి కళాకారులకు కాస్త రాగ జ్ఞానం కూడా అవసరమని చెప్పవచ్చు. బొబ్బిలి వీణంటే వాయిద్యకారులకు ఎంతో మక్కువ. నూజివీడు, పిఠాపురం, తంజావూరు, మైసూరులలో వీణలు తయారవుతున్నప్పటికీ, బొబ్బిలి వీణ ప్రత్యేకత చెక్కుచెదరకపోవడం గమనార్హం.
Denne historien er fra October 29, 2023-utgaven av Vaartha-Sunday Magazine.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Vaartha-Sunday Magazine
Vaartha-Sunday Magazine
వారఫలం
వారఫలం
2 mins
October 19, 2025
Vaartha-Sunday Magazine
వింత కొలను
వింత కొలను
1 min
October 19, 2025
Vaartha-Sunday Magazine
జీవితం మధురంగా ఉండాలంటే?
జీవితంలో పలు సమస్యలను ఎదుర్కొన్న ఒక పారిశ్రామికవేత్త తానెంతగానో గొప్పగా భావించే ఆధ్యాత్మిక గురువు వద్దకు వెళ్ళి తన గోడు చెప్పుకోసాగాడు..
1 min
October 19, 2025
Vaartha-Sunday Magazine
గృహావరణలో ఎలాంటి చెట్లు ఉండాలి?
వాస్తువార్త వాస్తు విద్వాన్ సాయిశ్రీ డా॥ దంతూరి పండరినాథ్ : 9885446501/9885449458
1 min
October 19, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
1 min
October 19, 2025
Vaartha-Sunday Magazine
మంచి మాట
మంచి మాట
1 min
October 19, 2025
Vaartha-Sunday Magazine
కళలకు కాణాచి కర్ణాటక
అద్భుతమైన దేవాలయాలు, కళ్ళు చెదిరే శిల్పకళా సోయగాలు, పేరెన్నిక కలిగిన చారిత్రక ప్రదేశాలు.. కర్ణాటక రాష్ట్రంలో పర్యటించే పర్యాటకులు జీవిత పర్యంతం నెమరు వేసుకునేలా ఇటువంటి ప్రదేశాలను పర్యటించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని స్వంతం చేసుకుంటారు.
3 mins
October 19, 2025
Vaartha-Sunday Magazine
ఆంగ్ల మాధ్యమం-ప్రభుత్వాల ప్రలోభం
వేగంగా అంతరించబోతున్న 200 భాషలను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. అందులో తెలుగు, మరిన్ని స్థానిక భాషలు ఉన్నాయి.
2 mins
October 19, 2025
Vaartha-Sunday Magazine
అద్భుత బాలల కథలు
అద్భుత బాలల కథలు
1 min
October 19, 2025
Vaartha-Sunday Magazine
పుస్తక సమీక్ష
గొప్ప అనువాద నవల
1 min
October 19, 2025
Translate
Change font size

