Gå ubegrenset med Magzter GOLD

Gå ubegrenset med Magzter GOLD

Få ubegrenset tilgang til over 9000 magasiner, aviser og premiumhistorier for bare

$149.99
 
$74.99/År

Prøve GULL - Gratis

పద్యసుధ

Suryaa Sunday

|

July 07, 2024

పద్యసుధ

-  'మధురవక్త' డా|| పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి

పద్యసుధ

1. అంకెల రామాయణం.

కం॥ అంచిత చతుర్థ జాతుఁడు

పంచమ మార్గమున నేఁగి ప్రథమ తనూజన్

గాంచి తృతీయం బచ్చట

నుంచి ద్వితీయంబు దాఁటి యొప్పుగ వచ్చెన్.

మన కవులు పద్యరచనలో చిత్రవిచిత్రాల్కెన విన్యాసాలు చేశారు. వాటిలో ఇది ఒకటి. నాలుగవ దానికి జన్మించినవాడు ఐదవమార్గం గుండా వెళ్లి, మొదటిదాని కూతురిని చూసి, మూడవదాని నక్కడ ఉంచి, రెండవ దానిని దాటి తిరిగి వచ్చాడు.

పంచభూతాలలో మొదటిది భూమి, రెండవది నీరు, మూడవది అగ్ని, నాల్గవది గాలి, ఐదవది ఆకాశం. ఈ పద్యం వెనుక ఉన్న రహస్య మిదే! వాయునందనుడైన హనుమంతుడు ఆకాశమార్గంగుండా లంకా నగరానికి వెళ్లి భూదేవి కుమార్తెయైన సీతాదేవిని చూసి అగ్నితో లంకా దహనం చేసి సముద్రాన్ని దాటి తిరిగివచ్చాడని దీని వివరణ.పంచభూతాల పేర్లతో కాకుండా వాటి వరుస సంఖ్యలతో రామాయణంలోని సుందరకాండకు సంబంధించిన వృత్తాంతాన్ని వివరిస్తున్న మంచి చాటుపద్య మిది. చాటుపద్య మంటే ఏ కావ్యం లోనిదీ కాని పద్యం. ఏదో సందర్భంగా కవీశ్వరులు అలవోకగానూ, ఆశువుగానూ చెప్పిన పద్యం. రసవత్తరమైన, ప్రచుర ప్రచారంలో ఉ న్న అనేక చాటుపద్యాలకు రచయిత లెవరోకూడా మనకు తెలియరావటం లేదు. అదీ చాటుపద్య మంటే!

2. స్థిరసంకల్పం

అని నివారించే గిరిపత్ని యనుఁగుఁ గూతుఁ బార్వతియుఁ దల్లిమాటఁ జేపట్టదయ్యె| నీప్సితార్థంబునకుఁ బాఱు హృదయరుచియు నిమ్నమున కోడిగిలు నీరు నిలుపరాదు.

'... ఆ విధంగా చెప్పి' అంటూ ఈ పద్యం మొదలవుతున్నది. ఆ విధ మేమిటో తరువాత చూద్దాం! ఇప్పుడు ఈ పద్యం: పరమేశ్వరుడిని గురించి తపస్సు చేసి మెప్పించి అతడిని భర్తగా పొందుదా మనుకొన్నది పార్వతి. తల్లియైన మేనక వద్దకు వెళ్లింది. వెళ్లి ఆ విషయాన్ని చెప్పింది. విన్న మేనక గుండె గుభేలుమన్నది. 'అమ్మా! ఆ తపస్సు నీ వల్ల కాదు. వద్దమ్మా! అన్నది. పార్వతి వినలేదు. తల్లి బుజ్జగిం చింది. అనేక విధాలుగా చెప్పింది. ఐనా వినలేదు పార్వతి ఎందుకు విన లేదో చెప్తున్నాడు కవి.

FLERE HISTORIER FRA Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

లైఫ్ బోరింగ్గా అనిపిస్తుందా?

వయసుకొచ్చాక.. ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు మీద పడతాయి. మనకు తెలియకుండా అవే ప్రపంచమయిపోతాయి.

time to read

1 mins

November 30, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ఆంధ్ర కింగ్

ఆంధ్ర కింగ్

time to read

2 mins

November 30, 2025

Suryaa Sunday

ఆదివారం అనుబంధం అను శ్రీ ఐరా

అను శ్రీ ఐరా

time to read

1 min

November 30, 2025

Suryaa Sunday

Suryaa Sunday

లంగ్ షీల్డ్: ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణలో జీవనశైలి & ఆరోగ్య పరీక్షల కీలక పాత్ర

పెరుగుతున్న సెమీ-అర్బన్ ప్రాంతాల్లో నివసించే వారికి, ఇవి ఒక పెద్ద ఆరోగ్య సమస్య ప్రారంభ సంకేతాలు కావచ్చు.

time to read

2 mins

November 30, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో అత్యవసరంగా అవగాహన మెరుగు

అత్యంత ప్రమాదకరమైన, వేగంగా వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్లలో ఒకటైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ భారతదేశంలో ఆందోళనకరంగా మారుతోంది. ఈ వ్యాధి సాధారణంగా చాలా ఆలస్యంగా గుర్తించబడుతుందని మరియు చికిత్స ఎంపికలు సంవత్సరాలుగా పెద్దగా మెరుగుపడలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

time to read

1 mins

November 30, 2025

Suryaa Sunday

Suryaa Sunday

మిల్లెట్ బిర్యానీ..

బిర్యానీ అంటే లొట్టలు వేసుకొని తినేస్తాం. బాస్మతి బియ్యంతోనూ, చిట్టిముత్యాలతోనూ, దొన్నె బిర్యానీ ఎలా వండినా ఫేమస్సే!

time to read

1 min

November 30, 2025

Suryaa Sunday

Suryaa Sunday

శ్వేత విప్లవం నుండి పోషక విప్లవం వరకు

భారతీయ పాల పరిశ్రమ పరిణామ క్రమ అన్వేషణ

time to read

2 mins

November 30, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

30.11.2025 నుంచి 6.12.2025 వరకు

time to read

5 mins

November 30, 2025

Suryaa Sunday

Suryaa Sunday

66 టీనేజ్ లో హృదయ అంతరంగాన్ని విప్పితే

టీనేజ్ వయసు అంటే... తుఫానులా మారే భావాలు, అన్వేషించే మనసు, తెలియని భయాలు, అపారమైన కలలు.

time to read

2 mins

November 30, 2025

Suryaa Sunday

బుడత-puzzle

బుడత-puzzle

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size