कोशिश गोल्ड - मुक्त
పద్యసుధ
Suryaa Sunday
|July 07, 2024
పద్యసుధ
1. అంకెల రామాయణం.
కం॥ అంచిత చతుర్థ జాతుఁడు
పంచమ మార్గమున నేఁగి ప్రథమ తనూజన్
గాంచి తృతీయం బచ్చట
నుంచి ద్వితీయంబు దాఁటి యొప్పుగ వచ్చెన్.
మన కవులు పద్యరచనలో చిత్రవిచిత్రాల్కెన విన్యాసాలు చేశారు. వాటిలో ఇది ఒకటి. నాలుగవ దానికి జన్మించినవాడు ఐదవమార్గం గుండా వెళ్లి, మొదటిదాని కూతురిని చూసి, మూడవదాని నక్కడ ఉంచి, రెండవ దానిని దాటి తిరిగి వచ్చాడు.
పంచభూతాలలో మొదటిది భూమి, రెండవది నీరు, మూడవది అగ్ని, నాల్గవది గాలి, ఐదవది ఆకాశం. ఈ పద్యం వెనుక ఉన్న రహస్య మిదే! వాయునందనుడైన హనుమంతుడు ఆకాశమార్గంగుండా లంకా నగరానికి వెళ్లి భూదేవి కుమార్తెయైన సీతాదేవిని చూసి అగ్నితో లంకా దహనం చేసి సముద్రాన్ని దాటి తిరిగివచ్చాడని దీని వివరణ.పంచభూతాల పేర్లతో కాకుండా వాటి వరుస సంఖ్యలతో రామాయణంలోని సుందరకాండకు సంబంధించిన వృత్తాంతాన్ని వివరిస్తున్న మంచి చాటుపద్య మిది. చాటుపద్య మంటే ఏ కావ్యం లోనిదీ కాని పద్యం. ఏదో సందర్భంగా కవీశ్వరులు అలవోకగానూ, ఆశువుగానూ చెప్పిన పద్యం. రసవత్తరమైన, ప్రచుర ప్రచారంలో ఉ న్న అనేక చాటుపద్యాలకు రచయిత లెవరోకూడా మనకు తెలియరావటం లేదు. అదీ చాటుపద్య మంటే!
2. స్థిరసంకల్పం
అని నివారించే గిరిపత్ని యనుఁగుఁ గూతుఁ బార్వతియుఁ దల్లిమాటఁ జేపట్టదయ్యె| నీప్సితార్థంబునకుఁ బాఱు హృదయరుచియు నిమ్నమున కోడిగిలు నీరు నిలుపరాదు.
'... ఆ విధంగా చెప్పి' అంటూ ఈ పద్యం మొదలవుతున్నది. ఆ విధ మేమిటో తరువాత చూద్దాం! ఇప్పుడు ఈ పద్యం: పరమేశ్వరుడిని గురించి తపస్సు చేసి మెప్పించి అతడిని భర్తగా పొందుదా మనుకొన్నది పార్వతి. తల్లియైన మేనక వద్దకు వెళ్లింది. వెళ్లి ఆ విషయాన్ని చెప్పింది. విన్న మేనక గుండె గుభేలుమన్నది. 'అమ్మా! ఆ తపస్సు నీ వల్ల కాదు. వద్దమ్మా! అన్నది. పార్వతి వినలేదు. తల్లి బుజ్జగిం చింది. అనేక విధాలుగా చెప్పింది. ఐనా వినలేదు పార్వతి ఎందుకు విన లేదో చెప్తున్నాడు కవి.
यह कहानी Suryaa Sunday के July 07, 2024 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Suryaa Sunday से और कहानियाँ
Suryaa Sunday
మనసు పలికిన నిశ్శబ్దం
నవకవిత్వం
1 min
May 31, 2026
Suryaa Sunday
బుడత బాగున్నాడు
చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.
1 min
May 31, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 31, 2026
Suryaa Sunday
రెక్కలు మొలవని ఆశ..!!
రెక్కలు మొలవని ఆశ..!!
1 min
May 31, 2026
Suryaa Sunday
టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్
లెజెండ్
2 mins
May 31, 2026
Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 24, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
మాళవిక నాయర్
మాళవిక నాయర్
1 min
May 24, 2026
Listen
Translate
Change font size

