試す 金 - 無料
గురుభక్తి గురుసేవ గురుకార్యం
Sri Ramakrishna Prabha
|July 2025
మన సంస్కృతిలో గురువు స్థానం అత్యున్నతమైనది. అలాంటి గురువును ఆశ్రయించి, సేవించి, విద్యలలోకెల్లా అత్యున్నతమైన బ్రహ్మవిద్యను అభ్యసించమని వేదోపనిషత్తులు ప్రబోధించాయి.
-
మన సంస్కృతిలో గురువు స్థానం అత్యున్నతమైనది. అలాంటి గురువును ఆశ్రయించి, సేవించి, విద్యలలోకెల్లా అత్యున్నతమైన బ్రహ్మవిద్యను అభ్యసించమని వేదోపనిషత్తులు ప్రబోధించాయి. “ఎవరైతే భగవంతునియందు, అదే రీతిలో గురువుయందు పరాభక్తిని కలిగివుంటారో, అలాంటి మహాత్మునికి శాస్త్రాలలో చెప్పబడిన సత్యాలన్నీ ప్రకాశిస్తాయి. అలాంటివారికి మాత్రమే ప్రకాశిస్తాయి” అని గురువు ప్రాముఖ్యాన్ని తెలియజెప్పింది శ్వేతాశ్వతరోపనిషత్తు. ఇక పురాణాలు, తంత్రాలు గురువును త్రిమూర్తుల స్వరూపంగా, సాక్షాత్తూ ఆ పరబ్రహ్మగా కీర్తించాయి. స్కంద పురాణాంతర్గతమైన 'గురుగీత'లో గురుభక్తి, గురుసేవల ప్రస్తుతి అనేక శ్లోకాలలో కనిపిస్తుంది.
శాస్త్రాలు ప్రవచించిన గురుభక్తి, గురుసేవలకు సజీవ సాక్ష్యంగా నిలచిన ఒక మహాత్ముణ్ణి కొద్దికాలం క్రితమే ఈ ప్రపంచం కళ్ళారా చూసింది. గురువు పేరునే తన పేరుగా కలిగిన ఆ మహాత్ముడే... స్వామి రామకృష్ణానంద, శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష సన్న్యాస శిష్యులలో ఒకరు. ఈయన గురుభక్తి, గురుసేవ సాటిలేనివి. అందుకే, స్వామి వివేకానంద తాను స్వీకరించాలనుకున్న 'రామకృష్ణానంద' నామాన్ని ఈయనకు ఇచ్చారు. స్వామి రామకృష్ణానంద పూర్వాశ్రమ నామధేయం శశిభూషణ్ చక్రవర్తి.ఈయన తన తను-మన ప్రాణాలను సంపూర్ణంగా గురువుకే అంకితం చేసి, జీవితాంతం గురుమయంగా గడిపి, రామకృష్ణ సంఘంలో చిరస్మరణీయులయ్యారు.
గురువే జీవన ధ్రువతార!
శశి మహరాజ్ మొదటిసారి దక్షిణేశ్వరం వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన... ఆయన శ్రీరామకృష్ణుల పాదధూళిని స్వీకరించాలని ముందుకు వెళతారు. అయితే, శ్రీరామకృష్ణులు తమ పాదాలను వెనక్కు తీసేసుకుంటారు. శిష్యుణ్ణి స్వీకరించే ముందు గురువు చేసిన మొదటి పరీక్ష అది అహంకారపూరితులైన వ్యక్తులు దానిని అవమానంగా భావిస్తారు. కానీ, తనకు అర్హత లేనందునే గురుదేవులు అలా చేశారని శశి మహరాజ్ భావించారు. ఏమాత్రం కోపగించుకోని ఆయన నైజాన్ని గురుదేవులు గమనించారు. తమ అంతరంగ శిష్యునిగా గుర్తించారు. అలా వారి మధ్య గురు శిష్య భావం చిగురించింది.
ఒకసారి శశి మహరాజ్ ఏదో వెదకుతూ శ్రీరామకృష్ణుల గది ముందునుంచి పరుగు పరుగున పోతున్నారు. శ్రీరామకృష్ణులు ఆయనను ఆపి,
このストーリーは、Sri Ramakrishna Prabha の July 2025 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Sri Ramakrishna Prabha からのその他のストーリー
Sri Ramakrishna Prabha
సూక్తి సౌరభం
అల్పబుద్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పు తినెడి కుక్క చెఱకు తీపెరుగునా? విశ్వదాభిరామ వినుర వేమ!
1 min
November 2025
Sri Ramakrishna Prabha
శ్రీరామకృష్ణులు
శ్రీరామకృష్ణులు
1 min
November 2025
Sri Ramakrishna Prabha
గ్రంథ పరిచయం
వివాహం దివ్యత్వ సాధనం
1 min
July 2025
Sri Ramakrishna Prabha
ఆత్మ ఎగసే అనంతాకాశంలో...
రవీంద్ర గీతాంజలి - చైతన్య
1 mins
July 2025
Sri Ramakrishna Prabha
సుబోధ
సుబోధ
1 min
July 2025
Sri Ramakrishna Prabha
అపూర్వ శిష్యుడు అలౌకిక గురువు
భారతదేశం సనాతన వైభవాన్ని కోల్పోయి పరాయిపాలనలో నిస్సహాయంగా ఆక్రందిస్తున్న కాలమది.
3 mins
July 2025
Sri Ramakrishna Prabha
మతమే మన ఆయువుపట్టు...
ధీరవాణి
1 min
July 2025
Sri Ramakrishna Prabha
గురుభక్తి గురుసేవ గురుకార్యం
మన సంస్కృతిలో గురువు స్థానం అత్యున్నతమైనది. అలాంటి గురువును ఆశ్రయించి, సేవించి, విద్యలలోకెల్లా అత్యున్నతమైన బ్రహ్మవిద్యను అభ్యసించమని వేదోపనిషత్తులు ప్రబోధించాయి.
3 mins
July 2025
Sri Ramakrishna Prabha
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!
1 min
May 2024
Sri Ramakrishna Prabha
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
ఆ౦ధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.
1 min
May 2024
Listen
Translate
Change font size
