Intentar ORO - Gratis
బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి
AADAB HYDERABAD
|20-11-2025
• “అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు" ఇదే ఆయన నినాదం. • ఆయన అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచాయి
-
• చాలా మంది జీవితాలను సత్యసాయి బాబా సమూలంగా మార్చేశారు
• ఆయన భౌతికంగా లేకున్నా మనతోనే ఉన్నారు
పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడి
• సర్వమానవ సంక్షేమమే బాబా ధ్యేయం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
• ఆధ్యాత్మిక వెలుగునిచ్చిన అరుదైన శక్తి బాబా : డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్
• బాబా సేవలు చిరస్మరణీయం: ఐశ్యర్యా రాయ్
• బాబా బోధనలు నాలో ఎంతో ప్రేరణను ఇచ్చాయి : క్రికెటర్ సచిన్ టెండూల్కర్
పుట్టపర్తి,నవంబర్ 19(ఆదాబ్ హైదరాబాద్): సత్యసాయి జయంత్యుత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంత్యుత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సత్యసాయి మహా సమాధిని దర్శించుకుని నివాళులర్పించారు.. అనంతరం మాట్లాడారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారు. భౌతికంగా బాబా లేకున్నా.. ఆయన ప్రేమ మనతోనే ఉంది. సత్యసాయి బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తోంది. కోట్ల మంది ఆయన భక్తులు మానవ సేవ చేస్తున్నారు. సత్యసాయి ప్రేమ సూత్రాలు ఎందరినో ఆలోచింపజేశాయన్నారు. బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి. 'అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు'.. ఇదే ఆయన నినాదం. చాలా మంది జీవితాలను సత్యసాయి సమూలంగా మార్చేశారు. లక్షల మందిని సేవామార్గంలో నడిపించారు. ప్రజల కోసం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందించారు. పుట్టపర్తి పవిత్ర భూమిలో ఏదో మహత్తు ఉంది. సత్యసాయి సంస్థలన్నీ ఇలాగే ప్రేమను పంచుతూ వర్థిల్లాలని మోదీ అన్నారు. అంతకు ముందు సత్యసాయి జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ. 100 నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, నటి ఐశ్వర్యారాయ్ తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తికి రావడం ఎంతో సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని పేర్కొన్నారు.
Esta historia es de la edición 20-11-2025 de AADAB HYDERABAD.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE AADAB HYDERABAD
AADAB HYDERABAD
ఆగని బంగారం పరుగులు
- రోజురోజుకూ గరిష్ఠ ధరలు నమోదు
1 min
14-01-2026
AADAB HYDERABAD
గ్రామ పంచాయతీలకు తీపి కబురు..
రూ.277 కోట్లు విడుదల చేసిన ఆర్ధిక శాఖ.. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు శుభాకాంక్షలు : భట్టి
1 min
14-01-2026
AADAB HYDERABAD
పండుగ సీజన్ కోసం కొత్త కలెక్షన్లను ప్రవేశపెట్టిన రామాజ్ కాటన్
రామ్రాజ్ కాటన్, భారతదేశం నంబర్ 1 సాంప్రదాయ & ఎత్నిక్ దుస్తుల బ్రాండ్, పొంగల్ మరియు సంక్రాంతి పండుగ సీజన్కు ముందుగా తన కొత్త కల్చర్ క్లబ్ మ్యాచింగ్ ధోతీలు & షర్టుల కొత్త శ్రేణులను ప్రవేశపెట్టింది.
1 min
14-01-2026
AADAB HYDERABAD
పేటలో సీఎం కప్ 2025 ర్యాలీ..-
జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
1 mins
14-01-2026
AADAB HYDERABAD
వందపడకల ఆసుపత్రి ముందు బస్ ఆగదు..!
- ఆసుపత్రి వద్ద బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి - వృద్ధులు, రోగులకు తప్పని ఇబ్బందులు
1 min
14-01-2026
AADAB HYDERABAD
బీఆర్ఎస్ కు గతమే తప్ప భవిష్యత్తు లేదు..రాదు
కేసీఆర్ కుటుంబ అవినీతిపై కవిత వ్యాఖ్యలే నిదర్శనం కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశం లేదు
1 mins
14-01-2026
AADAB HYDERABAD
చరిత్రలో నేడు
జనవరి 14 2026
1 min
14-01-2026
AADAB HYDERABAD
ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా శ్రీ గోదా రంగనాథ స్వాములకు నీరాటోత్సవం..
మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం లో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా దేవస్థానం యందు శ్రీ గోదా రంగనాథులకు నీరాటోత్సవం అనగా కళ్యాణం ముందు చేసే మంగళ స్నానాలు ప్రత్యేక అలంకరణ, అష్టోత్తరం అత్యంత వైభవంగా నిర్వహించమైనది.
1 min
14-01-2026
AADAB HYDERABAD
సారీ సీఎం గారూ..
• రేవంత్పై చేసిన వ్యాఖ్యలపై ఫీల్ అయిన తలసాని.. • తాను కోపంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాట్లు వెల్లడి ఈ నెల 17న శాంతి ర్యాలీ 7 చేపడున్నట్లు ప్రకటన..
1 min
14-01-2026
AADAB HYDERABAD
తుది ఓటర్ల జాబితా విడుదల..
మున్సిపల్ ఎన్నికల సమరానికి సంసిద్ధం..
1 min
14-01-2026
Listen
Translate
Change font size
