Try GOLD - Free
బహుళ ప్రయోజనకారి ‘అక్వేరియం'
Vaartha-Sunday Magazine
|January 19, 2025
పెంపుడు జంతువులతో ఆడుకోవడం విశ్రాంతి నిచ్చినట్లుగానే ఆక్వేరియంలో తిరుగాడే రంగుల చేప పిల్లలను చూస్తూ గడిపే క్షణాలు కూడా మనసుకు సాంత్వన కలిగిస్తాయని అంటున్నారు పరిశోధకులు.
పెంపుడు జంతువులతో ఆడుకోవడం విశ్రాంతి నిచ్చినట్లుగానే ఆక్వేరియంలో తిరుగాడే రంగుల చేప పిల్లలను చూస్తూ గడిపే క్షణాలు కూడా మనసుకు సాంత్వన కలిగిస్తాయని అంటున్నారు పరిశోధకులు. అక్వేరియం, చేపలు ఉండే ట్యాంకులు చూస్తూ ఉంటే రక్తపోటు కాస్త తగ్గుతుందట. యూకేలోని నేషనల్ మెరైన్ అక్వేరియం, ప్లేమోత్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్ టర్కి చెందిన పలువురు నిపుణులైన పరిశోధకులు సర్వే ద్వారా వెల్లడించారు. అక్వేరియం చూస్తూ ఉన్నవారిలో రక్తపోటు తగ్గినట్లు తాము గుర్తించినట్లు తెలిపారు. ఈదుతున్న చేప పిల్లలను కాసేపు చూస్తూ కూర్చుంటే అలసిన మనసుకు కాస్త విశ్రాంతి దొరుకుతుందని, దైనందిన వ్యవహారాలతో సొలసిన తరుణంలో స్వేచ్ఛగా తిరుగాడే మీనాలకేసి చూసే ఒక్క క్షణం మన ఆలోచనల్లో మార్పు తెస్తుందని శాస్త్రజ్ఞులు అంటారు.
ఇప్పుడు పిల్లలూ, పెద్దలూ రంగుల చేపల పెంపకంపై ఆసక్తి కనబరుస్తున్నారు. వీటి ధరలు కూడా అందరికీ అందుబాట్లో ఉంటున్నాయి. పాఠశాలల్లో, ఇళ్లల్లో, కార్యాలయాల్లో రంగుచేపలను ఎక్కువగా పెంచుతున్నారు.
అక్వేరియమ్ (గాజుశ కుప్పె)
అక్వేరియం నుంచి ఆర్థిక పరిస్థితిని బట్టి ఎన్ని అడుగుల అక్వేరియంలు కావాలన్నా అతి పెద్ద గాజుపలకలతో, ప్లాస్టిక్ షీట్స్ అతికిస్తూ వ్యాపారులు తయారు చేసి విక్రయిస్తున్నారు. అలంకరణకు రంగు రాళ్లు, వివిధ రకాలైన బొమ్మలు, దానిలోపల చిన్నపాటి ట్యూబ్ లైట్ను కూడా అమరుస్తుండటంతో మీనాలు మరింత ఉత్సాహంగా కదలాడుతున్నాయి. తాబేళ్లను కూడా ఉత్సాహంగా కొనుగోలు చేస్తుండటంతో గార్డెన్స్లో వీటి విక్రయం.పెరుగుతోంది. నీటిలో బ్యాక్టీరియాను నిరోధించేందుకు పచ్చ, నీలి రంగులతో కూడిన లిక్విడ్లను ఉపయోగిస్తున్నారు. ఒత్తిడిలో ఉన్న సమయంలో కాసేపు రంగు చేపలను తదేకంగా చూడడం వల్ల ఉపశమనం కలుగుతుందనేది శాస్త్రీయంగా కూడా రుజువు కావడంతో ఆసుపత్రులు, కార్యాలయాల్లో రంగుచేపల తొట్టెలు ఉంచుతున్నారు.
సాధారణంగానే ప్రకృతిని, సహజసిద్ధమైన అందాలను చూస్తుంటే ఆహ్లాదంగా ఉంటుంది. మంచినీటిలో పెరిగే అందమైన రంగు చేపల పెంపకం ఈనాటిది కాదు. అక్వేరియాలకు 4 వేల ఏళ్ల చరిత్ర. క్రీ.పూ. 2500 సంవత్సరాల్లోనే సుమేరియన్లు రంగు రంగుల చేపలను తెచ్చుకుని ఇళ్లముందు గొయ్యి తవ్వి పెంచుకునేవారట. అయితే వాళ్లు మనలాగా చేపలతో ముచ్చట్లాడేందుకు కాదుగానీ, కావాల్సి నప్పుడల్లా వండుకుని తినేందుకే వాటిని పెంచుకునేవారట.
This story is from the January 19, 2025 edition of Vaartha-Sunday Magazine.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Vaartha-Sunday Magazine
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size
