Facebook Pixel ఆదిశంకరుల అద్వైతకళాసృష్టి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమ్ | Sri Ramakrishna Prabha - religious-spiritual - Bu hikayeyi Magzter.com'da okuyun

Denemek ALTIN - Özgür

ఆదిశంకరుల అద్వైతకళాసృష్టి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమ్

Sri Ramakrishna Prabha

|

May 2024

భారతీయ సనాతన సంస్కృతి పునరుద్ధరణలో ఆచార్య శంకరుల పాత్ర అనన్యసామాన్యం, తలనరహితం. 

- - ప్రవ్రాజిక త్యాగనిష్ఠప్రాణ

ఆదిశంకరుల అద్వైతకళాసృష్టి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమ్

భారతీయ సనాతన సంస్కృతి పునరుద్ధరణలో ఆచార్య శంకరుల పాత్ర అనన్యసామాన్యం, తలనరహితం.  అడుగంటిపోతున్న సనాతన శైథిల్యాలను వెలికితీసి, మెరుగులుదిద్ది మహాసౌధాన్నే నిర్మించిన నిర్మాణకర్త ఆయన! ధార్మికంగా స్థానభ్రంశమై, విచ్ఛిన్నమవుతున్న భారతీయ సంస్కృతిని తన నిగూఢ కార్యప్రణాళిక ద్వారా నిశ్శబ్దంగా సమైక్యం చేసిన ఆధ్యాత్మిక విప్లవవీరులు ఆదిశంకరులు.దేశవ్యాప్తంగా ఆయన చేసిన పర్యటనలు, నాలుగు దిక్కులా ఆయన ఏర్పాటు చేసిన మఠాలు ఈ సనాతన పుణ్యభూమి యొక్క సాంస్కృతిక ఏకత్వాన్ని సుస్పష్టం చేశాయి. ఆయన ప్రారంభించిన సన్న్యాస సంప్రదాయాలు మన సంస్కృతిని శాశ్వత ఆదర్శంపై పునఃప్రతిష్ఠించాయి.నేటికీ జాతిని పునరుజ్జీవింపజేస్తూనే ఉన్నాయి.

ఆచార్య శంకరులు చేసిన రచనల ద్వారా వేదోక్తధర్మం వినూత్న ఒరవడిలో, నవనవోన్మేషంతో జిజ్ఞాసువులకు, పామరులకు పండితులకు, అందుబాటులోనికి వచ్చింది. ఆధ్యాత్మిక దిశాదర్శనం చేసింది. ఆయన చేసిన రచనలను మూడు స్తరాలుగా విభజించవచ్చు. ప్రస్థానత్రయ గ్రంథాలపై రాసిన 'భాష్యగ్రంథాలు' మొదటిస్తరానికి చెందినవి. ఇవి విద్వాంసులకొరకు ఉద్దేశించబడినవి. వేదాంతాన్ని సరళంగా వివరించే 'ప్రకరణగ్రంథాలు' రెండవస్తరానికి చెందినవి. ఈ గ్రంథాలు వేదాంతాన్ని విభిన్నకోణాల నుండి పాఠకులకు పరిచయం చేస్తాయి. ఇవి పాండిత్యం లేని జిజ్ఞాసువులకు మార్గదర్శనం చేయగలిగే సరళ గ్రంథాలు. ఇక మూడవస్తరానికి చెందినవి దేవీదేవతలపై, ఆధ్యాత్మికతత్త్వాలపై ఆయన రచించిన స్తోత్రాలు.ఇవి సామాన్య ప్రజానీకం కోసం. ఈ విధంగా శంకరులవారు వైదికధర్మాన్ని అన్ని స్థాయులవారికీ అందుబాటులోకి తీసుకొనిరావడానికి తన అనన్యసామాన్య శైలిలో, సులలిత సంస్కృతభాషలో రచనలు చేశారు.

శంకరులవారి స్తోత్రసాహిత్యంలో అత్యంత ప్రముఖమైన స్తోత్రరాజం 'శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం'. ఈ స్తోత్రానికి గల ప్రత్యేకతలను గమనిద్దాం.

1. ఇది స్తోత్రమైనప్పటికీ వేదాంత తత్త్వాన్ని పూర్తిగా పరిచయం చేయగల 'ప్రకరణ గ్రంథం' యొక్క లక్షణాలను కలిగివున్నది. స్తోత్రరూపంలో ఉన్న ప్రకరణ గ్రంథంగా దీనిని చెప్పుకోవచ్చు.

Sri Ramakrishna Prabha'den DAHA FAZLA HİKAYE

Sri Ramakrishna Prabha

సూక్తి సౌరభం

అల్పబుద్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పు తినెడి కుక్క చెఱకు తీపెరుగునా? విశ్వదాభిరామ వినుర వేమ!

time to read

1 min

November 2025

Sri Ramakrishna Prabha

శ్రీరామకృష్ణులు

శ్రీరామకృష్ణులు

time to read

1 min

November 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

గ్రంథ పరిచయం

వివాహం దివ్యత్వ సాధనం

time to read

1 min

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

ఆత్మ ఎగసే అనంతాకాశంలో...

రవీంద్ర గీతాంజలి - చైతన్య

time to read

1 mins

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

సుబోధ

సుబోధ

time to read

1 min

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

అపూర్వ శిష్యుడు అలౌకిక గురువు

భారతదేశం సనాతన వైభవాన్ని కోల్పోయి పరాయిపాలనలో నిస్సహాయంగా ఆక్రందిస్తున్న కాలమది.

time to read

3 mins

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

మతమే మన ఆయువుపట్టు...

ధీరవాణి

time to read

1 min

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

గురుభక్తి గురుసేవ గురుకార్యం

మన సంస్కృతిలో గురువు స్థానం అత్యున్నతమైనది. అలాంటి గురువును ఆశ్రయించి, సేవించి, విద్యలలోకెల్లా అత్యున్నతమైన బ్రహ్మవిద్యను అభ్యసించమని వేదోపనిషత్తులు ప్రబోధించాయి.

time to read

3 mins

July 2025

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

సింహాద్రి అప్పన్న చందనోత్సవం

వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!

time to read

1 min

May 2024

Sri Ramakrishna Prabha

Sri Ramakrishna Prabha

శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం

ఆ౦ధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్‌ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.

time to read

1 min

May 2024

Listen

Translate

Share

-
+

Change font size