సర్కారు మాటే సాగు బాట
Namaste Telangana (Telangana)|May 13, 2020
నానబోసిన వడ్ల గింజల నుంచి తెల తెల్లటి మొలకలు రావడం... మడిలో ఆ మొలకల్ని చల్లితే నారుగా ఊపిరి పోసుకోవడం... నాటేసిన నారు, పిలకలు వేసి గుత్తులుగా కంకులు కాయడం... ఆ బంగరు కంకుల గింజలు తలెలో మెతుకులుగా, అన్నం ముద్దగా మారడం.. ఇది పరంపరగా జరిగే మార్పుల ఫలితం!!

విత్తనాలుగా పిలుచుకునే కొన్ని వడ్ల గింజలు పెద్ద ధాన్యపు రాసిగా మారడానికి కారణం... మారే తత్వం ఆ గింజల్లో ఉండడమే! మార్పుకు అవి సిద్ధం కావడమే! మారడానికి అనువైన వాతావరణాన్ని రైతు కల్పిస్తే, దాని ఆలంబనగా విత్తనం పెద్ద చేనుగా మారుతున్నది.

వడ్ల గింజ సందేశమే స్ఫూర్తిగా ఇప్పుడు రైతూ మారాలంటున్నారు కేసీ ఆర్. రైతు కష్టం లాభంగా మారే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తుందనీ, మార్పుకు సిద్ధపడాల్సిన బాధ్యత రైతుదనీ సూచిస్తున్నారు!

కాళేశ్వర విజయంతో పుష్కలంగా నీళ్లు, 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రుణ మాఫీలతో వ్యవసాయం మినిమమ్ గ్యారెంటీ వృత్తి అవుతున్నది. ట్రాక్టర్లు, హార్వెస్టర్లతో వరి సాగు సులువుగా మారింది.

అలాగని అందరూ వరి పంటే వేస్తూ పోతే...?

తినేదెందరు? కొనేదెవ్వరు?

దీనికి పరిష్కారం. వంటైనా మారాలి. పంటైనా మారాలి! లేకుంటే ఆరుగాలం పడ్డ కష్టం వృథాయే! ప్రభుత్వం మార్పులు తెస్తున్నప్పుడు, లబ్ధిదారైన రైతు మారకపోతే ఫలితం ఎలా సాధ్యం ?

రైతు పండించిన పంటకు మంచి ధర రావాలంటే ఏం చేయాలి? గతంలో మాదిరిగానే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించి మౌనంగా ఉండాలా? మార్పు కోసం ప్రయత్నించాలా? ఇదీ ముఖ్యమంత్రి ప్రశ్న?

తెలంగాణలో వ్యవసాయ రంగం తలరాతను మార్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు రైతు జీవితాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు భారీ మార్పునకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతులు పంటలు సాగు చేయాలని నిర్దేశించారు. అప్పుడు మాత్రమే ప్రభుత్వం, రైతులు పడుతున్న కష్టానికి తగిన ఫలితం లభిస్తుందన్నారు.

మారుతున్న వాతావరణంలో కొంచం కష్టమే అయినా, అయిష్టమే అయినా మార్పు అనివార్యమైనది. ఎండిన వడ్లగింజే మారినప్పుడు, మార్పులే జీవితంగా బతికే తెలంగాణ రైతు మారడం అసాధ్యమా?

రైతుకు లాభం కోసమే

ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాల్లో వెయ్యి రూపాయలకు కూడా ఎవరూ పంటను కొనడం లేదు. పలుచోట్ల అన్నదాతలకు కనీస ధర లభించడం లేదు. రైతులు ఏ పంట వేస్తే లాభపడుతారో ప్రభుత్వమే పూనుకొని చెప్తున్నది. ఆ పంటలకు మద్దతు ధర ఇస్తామని చెప్తున్నది. ప్రభుత్వం ఇంత చొరవ చూపుతుంటే రైతులకు ఇంకా వేరే ఆలోచన ఎందుకుండాలి? రైతుల ఆలోచనలో నిర్మాణాత్మక మార్పురావాలి. ఇది రైతుల మీద ఆంక్షలు పెట్టడం కాదు. వారికి మరింత లాభం చేయడమే ప్రభుత్వ ఏకైక లక్ష్యం. సీఎం కేసీఆర్

ఈవాన కాలానికి పంటలివే

50 లక్షల ఎకరాల్లో వరి సాగు

10 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా

50 లక్షల ఎకరాల్లో పత్తి పంట

10 లక్షల ఎకరాల్లో కంది చేన్లు

ప్రభుత్వం చెప్పిన పంటే వేయాలి

రైతులంతా తప్పక పాటించాల్సిందే

అప్పుడే రైతుబంధు, పంట కొనుగోలు

ఈ వానకాలం పంట నుంచే అమలు

ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం

అంగట్లో సరుకుపోసి ఆగమాగం కావద్దు గిరాకీ ఉన్న పంటలు మాత్రమే సాగుచేయాలి పట్టణాల సమీపంలో కూరగాయలే పండించాలి త్వరలో విత్తనాల నియంత్రణ సంస్థ ఏర్పాటు ఇష్టమొచ్చిన విత్తనాలు అమ్మకుండా కట్టడి వ్యవసాయశాఖ పునర్వ్యవస్థీకరణకు నిర్ణయం 15న జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ మిల్లుల సామర్థ్యం పెంపు.. మిల్లర్లతో సమావేశం

Continue reading your story on the app

Continue reading your story in the newspaper

MORE STORIES FROM NAMASTE TELANGANA (TELANGANA)View All

గజ్వేల్ కు గంగమ్మ పరుగులు

ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో గంగమ్మ అడుగిడింది.

1 min read
Namaste Telangana (Telangana)
May 13, 2020

సర్కారు మాటే సాగు బాట

నానబోసిన వడ్ల గింజల నుంచి తెల తెల్లటి మొలకలు రావడం... మడిలో ఆ మొలకల్ని చల్లితే నారుగా ఊపిరి పోసుకోవడం... నాటేసిన నారు, పిలకలు వేసి గుత్తులుగా కంకులు కాయడం... ఆ బంగరు కంకుల గింజలు తలెలో మెతుకులుగా, అన్నం ముద్దగా మారడం.. ఇది పరంపరగా జరిగే మార్పుల ఫలితం!!

1 min read
Namaste Telangana (Telangana)
May 13, 2020

కేటాయింపుల మేరకే వాడుకొంటాం

• అదనంగా చుక్క నీటిని కూడా వాడుకోం• నీటి వినియోగంపై ఎప్పటికప్పుడు కృష్ణా బోర్డు పర్యవేక్షణ• జలవనరులశాఖ అధికారుల సమావేశంలో ఏపీ సీఎం జగన్

1 min read
Namaste Telangana (Telangana)
May 13, 2020

కరోనావైరస్ లో మార్పు లేదు

• విదేశాల్లో, భారత్ లో విస్తరిస్తున్నది ఒక్కటే• జన్యుక్రమంలో 99 శాతం ఒకటే పోలిక• భారతీయులపై వైరస్ ప్రభావం తక్కువ• మహిళలకన్నా పురుషులపై అధిక ప్రభావం• ఇందుకు కారణాలను అన్వేషిస్తున్నాం• సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడి

1 min read
Namaste Telangana (Telangana)
May 13, 2020

వరిపంటతోనే మార్పు మొదలు

• 50 లక్షల ఎకరాల్లో వరి.. 50 లక్షల ఎకరాల్లో పత్తి• ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయం

1 min read
Namaste Telangana (Telangana)
May 13, 2020

ఆమె ఓకే చెప్పింది

నచ్చిన నెచ్చెలి పరిణయానికి పచ్చజెండా ఊపితే అంతకుమించిన ఆనందానుభూతి మరొకటి ఉండదు.

1 min read
Namaste Telangana (Telangana)
May 13, 2020

ధూపంతో దూరం

• ఐసొలేషతోనే కరోనా నివారణ• భౌతికదూరం పాటించాల్సిందే• ఆయుర్వేద కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సులోచన అరిగె

1 min read
Namaste Telangana (Telangana)
May 12, 2020

ఏపీ తీరు ఏకపక్షం ఎదిరిస్తాం

స్నేహహస్తం అందించినా.. సంప్రదించకుండా నిర్ణయమా?

1 min read
Namaste Telangana (Telangana)
May 12, 2020

ఉద్యోగాలూ ఊడుతయ్!

కొత్త ఉద్యోగాల ఊసే ఉండదు

1 min read
Namaste Telangana (Telangana)
May 12, 2020

ఇప్పుడే రైళ్లు వద్దు

ప్రధాన నగరాల్లో కరోనా ప్రభావం అధికం ఎవరు ఎక్కడికెళ్లారో.. ఎవరికి వైరస్ ఉన్నదో తెలియదు

1 min read
Namaste Telangana (Telangana)
May 12, 2020