ఏపీ తీరు ఏకపక్షం ఎదిరిస్తాం
Namaste Telangana (Telangana)|May 12, 2020
స్నేహహస్తం అందించినా.. సంప్రదించకుండా నిర్ణయమా?

పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలని మేము ఆశిస్తే.. ఏపీ సర్కార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని స్నేహబంధానికి విఘాతం కలిగించింది. గతంలో ఉన్న వివాదాలను, విభేదాలను పక్కనపెట్టి రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా నదీ జలాలను వినియోగించుకుందామని తెలంగాణ ప్రభుత్వం ఏపీకి స్నేహహస్తం అందించింది. బేసిన్లు, భేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని నేనే చొరవ చూపించాను. అయినా ఏపీ సర్కార్ కనీసం మనల్ని సంప్రదించకుండానే శ్రీశైలంలో నీటిని తరలించుకుపోవడానికి ఏకపక్షంగా కొత్త పథకం ప్రకటించడం అత్యంత బాధాకరం. - సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేని ధోరణి అవలంబిస్తాం. - సీఎం కేసీఆర్

ఏపీ ఎత్తిపోతలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం

అపెక్స్ కమిటీ అనుమతి లేకుండా ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరం

పరస్పరం సహకరించుకోవాలన్న స్ఫూర్తికి విఘాతం

కృష్ణా జలాల వాటాపై సుప్రీంకోర్టుకు వెళ్లాలి

ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశాలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ఎత్తిపో తల పథకాన్ని అడ్డుకొని తీరుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖ రావు స్పష్టంచేశారు. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రయోజనాలకు భంగకరమని పేర్కొన్నారు. దీనిపై రాజీలేని ధోరణి అవలంబిస్తామని, ప్రాజెక్టును అడ్డుకోవ డమే లక్ష్యంగా న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తంచేయాలని, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేయాలని, కృష్ణా జలాల వాటాను తేల్చేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

రోజుకు 10 టీ ఎంసీలపైనే తరలింపు!

Continue reading your story on the app

Continue reading your story in the newspaper

MORE STORIES FROM NAMASTE TELANGANA (TELANGANA)View All

గజ్వేల్ కు గంగమ్మ పరుగులు

ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో గంగమ్మ అడుగిడింది.

1 min read
Namaste Telangana (Telangana)
May 13, 2020

సర్కారు మాటే సాగు బాట

నానబోసిన వడ్ల గింజల నుంచి తెల తెల్లటి మొలకలు రావడం... మడిలో ఆ మొలకల్ని చల్లితే నారుగా ఊపిరి పోసుకోవడం... నాటేసిన నారు, పిలకలు వేసి గుత్తులుగా కంకులు కాయడం... ఆ బంగరు కంకుల గింజలు తలెలో మెతుకులుగా, అన్నం ముద్దగా మారడం.. ఇది పరంపరగా జరిగే మార్పుల ఫలితం!!

1 min read
Namaste Telangana (Telangana)
May 13, 2020

కేటాయింపుల మేరకే వాడుకొంటాం

• అదనంగా చుక్క నీటిని కూడా వాడుకోం• నీటి వినియోగంపై ఎప్పటికప్పుడు కృష్ణా బోర్డు పర్యవేక్షణ• జలవనరులశాఖ అధికారుల సమావేశంలో ఏపీ సీఎం జగన్

1 min read
Namaste Telangana (Telangana)
May 13, 2020

కరోనావైరస్ లో మార్పు లేదు

• విదేశాల్లో, భారత్ లో విస్తరిస్తున్నది ఒక్కటే• జన్యుక్రమంలో 99 శాతం ఒకటే పోలిక• భారతీయులపై వైరస్ ప్రభావం తక్కువ• మహిళలకన్నా పురుషులపై అధిక ప్రభావం• ఇందుకు కారణాలను అన్వేషిస్తున్నాం• సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడి

1 min read
Namaste Telangana (Telangana)
May 13, 2020

వరిపంటతోనే మార్పు మొదలు

• 50 లక్షల ఎకరాల్లో వరి.. 50 లక్షల ఎకరాల్లో పత్తి• ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయం

1 min read
Namaste Telangana (Telangana)
May 13, 2020

ఆమె ఓకే చెప్పింది

నచ్చిన నెచ్చెలి పరిణయానికి పచ్చజెండా ఊపితే అంతకుమించిన ఆనందానుభూతి మరొకటి ఉండదు.

1 min read
Namaste Telangana (Telangana)
May 13, 2020

ధూపంతో దూరం

• ఐసొలేషతోనే కరోనా నివారణ• భౌతికదూరం పాటించాల్సిందే• ఆయుర్వేద కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సులోచన అరిగె

1 min read
Namaste Telangana (Telangana)
May 12, 2020

ఏపీ తీరు ఏకపక్షం ఎదిరిస్తాం

స్నేహహస్తం అందించినా.. సంప్రదించకుండా నిర్ణయమా?

1 min read
Namaste Telangana (Telangana)
May 12, 2020

ఉద్యోగాలూ ఊడుతయ్!

కొత్త ఉద్యోగాల ఊసే ఉండదు

1 min read
Namaste Telangana (Telangana)
May 12, 2020

ఇప్పుడే రైళ్లు వద్దు

ప్రధాన నగరాల్లో కరోనా ప్రభావం అధికం ఎవరు ఎక్కడికెళ్లారో.. ఎవరికి వైరస్ ఉన్నదో తెలియదు

1 min read
Namaste Telangana (Telangana)
May 12, 2020