Poging GOUD - Vrij
పంజా విసిరిన ఉగ్రవాదం విలపించిన కాశ్మీరం
Suryaa Sunday
|April 27, 2025
రాజ్యాంగంలోని 370వ అధికరణ రద్దు తరవాత జమ్మూకశ్మీర్ క్రమేపీ తెరిపిన పడుతోంది. ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి.
రాజ్యాంగంలోని 370వ అధికరణ రద్దు తరవాత జమ్మూకశ్మీర్ క్రమేపీ తెరిపిన పడుతోంది. ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి.
కశ్మీర్ లోయలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇంతలోనే పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. పర్యాటకులే లక్ష్యంగా పహల్గాంలో భయానక దాడికి తెగబడ్డారు.అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యాల ఖండనలతో, సానుభూతి వచనాలతో భారత్ లో ఉగ్రవాదుల ఆగడాలు ఆగునా? సుమారు ఏడున్నర దశాబ్దాలుగా భారత్ లో ఉగ్రవాదులు సాగిస్తున్న నరమేథం నిలువరింపబడుతుందా? అమెరికా, రష్యా, ఇజ్రాయిల్ దేశాల మాదిరిగా ఉగ్రవాదులను అంతమొందించే శక్తి సామర్ధ్యాలు భారత్ కు లేవా? అనే ప్రశ్న ప్రస్తుతం దేశ పౌరుల మదిలో అంకురిస్తున్నది.
భారత్ ను ఇబ్బందులు పెడుతున్న ఉగ్రవాదుల మదమణిచే చర్యకు భారత్ పూనుకుంటుందా? అందమైన కాశ్మీరం ఆనందంలో మునిగి తేలుతుండగా,ప్రకృతి పారవశ్యంలో పర్యాటకులు ఆనంద డోలికల్లో విహరిస్తుండగా మానవత్వం మచ్చుకైనా కానరాని ముష్కరుల తూటాలకు పలువురు మృత్యువు ఒడికి చేరారు. అమాయకుల రుధిరంతో పచ్చని పహల్గాం ఎరుపెక్కింది. అమర్ నాథ్ యాత్రకు శ్రీకారం పలుకుతున్న కాశ్మీర్లోని పహల్గామ్ పేరొందిన పర్యాటక కేంద్రం.ఇదొక హిల్ స్టేషన్. పహల్గాం బైసరన్ లోయ స్విట్జర్లాండ్ కు ప్రతిరూపంగా పేర్కొంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో మదిని పులకరింప చేసే అందమైన పర్యాటక ప్రాంతం ముష్కరులు నరమేథంతో మూగబోయింది. ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు ఆక్రందనలు మిన్నంటాయి. క్షతగాత్రుల దేహాలు రక్తంతో తడిసిపోయాయి. బైసరన్ లోయలో అందమైన ప్రకృతి అలజడికి లోనై విలపించింది. సైనికుల దుస్తుల మాటున పొంచి ఉన్న మృత్యువును గమనించలేని పర్యాటకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓలలాడుతుండగా ఓర్వలేని ఉగ్రమూక పంజా విసిరి, 28 మంది పర్యాటకులను కర్కశంగా బలితీసుకుంది. దొంగే అన్నట్టుగా... ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ, భారత్ గత 77 సంవత్సరాలుగా అనునిత్యం కయ్యానికి కాలుదువ్వుతున్న పాక్ ప్రేరిత ఉగ్రవాదం పై ప్రపంచం దృష్టి సారించక పోవడమే ఈ నర మేథానికి కారణం.Dit verhaal komt uit de April 27, 2025-editie van Suryaa Sunday.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Suryaa Sunday
Suryaa Sunday
ప్రొఫిలాక్సిస్ ఉన్నప్పటికీ సరిపోని సందర్భాలు
నియంత్రణలో ఉన్న హీమోఫీలియాలో ఆకస్మిక రక్తస్రావాలను అర్థం చేసుకోవడం
2 mins
May 03, 2026
Suryaa Sunday
నవ్వటం ఓ భొగం
మే మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం, మే 2 న జరుపుకుంటారు.
4 mins
May 03, 2026
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
3.5.2026 నుంచి 30.8.2025 వరకు
4 mins
May 03, 2026
Suryaa Sunday
ఖాండవ వన దహనం.. మహత్తర
ధర్మాన్ని పాటించేవారికి ప్రతి సందర్భమ వారికి కలిసి వస్తుంది. ఇందుకు మహాభారతంలో పాండవులే ఉదాహరణ.
2 mins
May 03, 2026
Suryaa Sunday
ఆదివారం అనుబంధం
చైర్మన్తో ముఖాముఖి
2 mins
May 03, 2026
Suryaa Sunday
Logic puzzles
Insert the appropriate image
1 min
May 03, 2026
Suryaa Sunday
గాయపడ్డ సింహం
రివ్యూ:
1 mins
May 03, 2026
Suryaa Sunday
బాలల కథ
కపటులను నమ్మవద్దు
2 mins
May 03, 2026
Suryaa Sunday
వేమన శతకం
వేమన శతకం
1 min
May 03, 2026
Suryaa Sunday
ఆటలతో ఆరోగ్యం.. ఆనందంతో అభివృద్ధి
పిల్లల బాల్యంలో మళ్లీ నవ్వులు నింపే ప్రయత్నం వేసవి సెలవులు మొదలయ్యాయంటే పిల్లల కళ్లలో మెరిసే వెలుగు వేరేలా ఉ టుంది
2 mins
May 03, 2026
Listen
Translate
Change font size
