Facebook Pixel పంజా విసిరిన ఉగ్రవాదం విలపించిన కాశ్మీరం | Suryaa Sunday - news - Lisez cet article sur Magzter.com

Essayer OR - Gratuit

పంజా విసిరిన ఉగ్రవాదం విలపించిన కాశ్మీరం

Suryaa Sunday

|

April 27, 2025

రాజ్యాంగంలోని 370వ అధికరణ రద్దు తరవాత జమ్మూకశ్మీర్ క్రమేపీ తెరిపిన పడుతోంది. ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి.

- -సుంకవల్లి సత్తిరాజు.

పంజా విసిరిన ఉగ్రవాదం విలపించిన కాశ్మీరం

రాజ్యాంగంలోని 370వ అధికరణ రద్దు తరవాత జమ్మూకశ్మీర్ క్రమేపీ తెరిపిన పడుతోంది. ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి.

imageకశ్మీర్ లోయలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇంతలోనే పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. పర్యాటకులే లక్ష్యంగా పహల్గాంలో భయానక దాడికి తెగబడ్డారు.అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యాల ఖండనలతో, సానుభూతి వచనాలతో భారత్ లో ఉగ్రవాదుల ఆగడాలు ఆగునా? సుమారు ఏడున్నర దశాబ్దాలుగా భారత్ లో ఉగ్రవాదులు సాగిస్తున్న నరమేథం నిలువరింపబడుతుందా? అమెరికా, రష్యా, ఇజ్రాయిల్ దేశాల మాదిరిగా ఉగ్రవాదులను అంతమొందించే శక్తి సామర్ధ్యాలు భారత్ కు లేవా? అనే ప్రశ్న ప్రస్తుతం దేశ పౌరుల మదిలో అంకురిస్తున్నది.

imageభారత్ ను ఇబ్బందులు పెడుతున్న ఉగ్రవాదుల మదమణిచే చర్యకు భారత్ పూనుకుంటుందా? అందమైన కాశ్మీరం ఆనందంలో మునిగి తేలుతుండగా,ప్రకృతి పారవశ్యంలో పర్యాటకులు ఆనంద డోలికల్లో విహరిస్తుండగా మానవత్వం మచ్చుకైనా కానరాని ముష్కరుల తూటాలకు పలువురు మృత్యువు ఒడికి చేరారు. అమాయకుల రుధిరంతో పచ్చని పహల్గాం ఎరుపెక్కింది. అమర్ నాథ్ యాత్రకు శ్రీకారం పలుకుతున్న కాశ్మీర్లోని పహల్గామ్ పేరొందిన పర్యాటక కేంద్రం.ఇదొక హిల్ స్టేషన్. పహల్గాం బైసరన్ లోయ స్విట్జర్లాండ్ కు ప్రతిరూపంగా పేర్కొంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో మదిని పులకరింప చేసే అందమైన పర్యాటక ప్రాంతం ముష్కరులు నరమేథంతో మూగబోయింది. ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు ఆక్రందనలు మిన్నంటాయి. క్షతగాత్రుల దేహాలు రక్తంతో తడిసిపోయాయి. బైసరన్ లోయలో అందమైన ప్రకృతి అలజడికి లోనై విలపించింది. సైనికుల దుస్తుల మాటున పొంచి ఉన్న మృత్యువును గమనించలేని పర్యాటకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓలలాడుతుండగా ఓర్వలేని ఉగ్రమూక పంజా విసిరి, 28 మంది పర్యాటకులను కర్కశంగా బలితీసుకుంది. దొంగే అన్నట్టుగా... ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ, భారత్ గత 77 సంవత్సరాలుగా అనునిత్యం కయ్యానికి కాలుదువ్వుతున్న పాక్ ప్రేరిత ఉగ్రవాదం పై ప్రపంచం దృష్టి సారించక పోవడమే ఈ నర మేథానికి కారణం.

PLUS D'HISTOIRES DE Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

ప్రొఫిలాక్సిస్ ఉన్నప్పటికీ సరిపోని సందర్భాలు

నియంత్రణలో ఉన్న హీమోఫీలియాలో ఆకస్మిక రక్తస్రావాలను అర్థం చేసుకోవడం

time to read

2 mins

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

నవ్వటం ఓ భొగం

మే మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం, మే 2 న జరుపుకుంటారు.

time to read

4 mins

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

3.5.2026 నుంచి 30.8.2025 వరకు

time to read

4 mins

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ఖాండవ వన దహనం.. మహత్తర

ధర్మాన్ని పాటించేవారికి ప్రతి సందర్భమ వారికి కలిసి వస్తుంది. ఇందుకు మహాభారతంలో పాండవులే ఉదాహరణ.

time to read

2 mins

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ఆదివారం అనుబంధం

చైర్మన్తో ముఖాముఖి

time to read

2 mins

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

Logic puzzles

Insert the appropriate image

time to read

1 min

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

గాయపడ్డ సింహం

రివ్యూ:

time to read

1 mins

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

బాలల కథ

కపటులను నమ్మవద్దు

time to read

2 mins

May 03, 2026

Suryaa Sunday

వేమన శతకం

వేమన శతకం

time to read

1 min

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ఆటలతో ఆరోగ్యం.. ఆనందంతో అభివృద్ధి

పిల్లల బాల్యంలో మళ్లీ నవ్వులు నింపే ప్రయత్నం వేసవి సెలవులు మొదలయ్యాయంటే పిల్లల కళ్లలో మెరిసే వెలుగు వేరేలా ఉ టుంది

time to read

2 mins

May 03, 2026

Listen

Translate

Share

-
+

Change font size