Essayer OR - Gratuit

విషపూరిత సాపాటు చదువులకే చేటు!

Vaartha-Sunday Magazine

|

December 15, 2024

ఆహారం మన జీవనాధారం. ఆహారం, పానీయం ఈరెండు మనం జీవించేందుకు దోహదపడతాయి.

- వడ్డేపల్లి మల్లేషము

విషపూరిత సాపాటు చదువులకే చేటు!

ఆహారం మన జీవనాధారం. ఆహారం, పానీయం ఈరెండు మనం జీవించేందుకు దోహదపడతాయి. నాలుగురోజులు భోజనం మానేస్తే శరీరం నీరసించిపోతుంది. ఆరోగ్యం కోసం, బతికేందుకు మనం తప్పనిసరిగా ఆహారాన్ని తీసుకోవాల్సిందే. అయితే తినే ఆహారం కలుషితమైనదిగా ఉంటే మన ఆరోగ్యం దెబ్బతిం టుంది. కాబట్టి భోజనం ఎంత అవసరమో పరిశుభ్రమైన పదార్థాలను తినడం కూడా అంతే అవసరం. పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం తప్పనిసరి. ఆధునిక మానవుడు అన్నింట్లోనూ పరుగులు తీస్తున్నాడు. ఈ జీవనపోరాటంలో చదువు, ఉద్యోగం కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు. ఇందులో భాగంగా చదువుకోసం హాస్టళ్లను ఆశ్రయించడం, ఉద్యోగం కూడా వర్కింగ్ మెన్, ఉమెన్స్ హాస్టల్స్ లలో ఉండడం అనేకులకు తప్పనిసరి అయింది. ఇందులో భాగంగా హాస్టల్స్ ఫుడ్ తినాల్సిందే. అయితే హాస్టల్స్ లలో, ఆయా ప్రదే శాలలో వండే విధానం, అక్కడ పాటించే పరిశుభ్రత గురించి అందరికీ తెలిసిందే. దీంతో తరచూ ఫుడ్పాయిజింగ్ సమస్య ఉత్పన్నమవుతున్నది.

ఆహార విషతుల్య సమస్య భారతదేశంలో ఈనాటిది కాదు.దేశంలో ఏదో ఒక మూలన ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవలకాలంలో తెలుగురాష్ట్రాలలో ఈ సమస్య తరుచూ ఉత్పన్నమవుతుండడం విచారకరం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు విద్యార్థులు ధర్నా, నిరసనలు చేయడం సంబంధిత కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామనే హామీలతో సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. అంతేతప్ప ముఖ్యంగా పేద వర్గాల పిల్లలు ఉండే ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహలలో ఇలాంటి అమానవీయ సంఘటనలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి వర్గాల పిల్లల పట్ల పెట్టుబడిదారు సంపన్న వర్గాలకు మాత్రమే కాదు ప్రభుత్వాలకు కూడా ఇంత చిన్న చూపా? తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మాగనూరు ఉన్నత పాఠశాలలో గతనెల నవంబరులో మూడుసార్లు మధ్యాహ్న భోజనం విషపూరితం కావడంతో విద్యార్థులు అనారోగ్యం పాలై, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారు. చావు అంచుల వరకు వెళ్లి, బతికి వచ్చారు.అయినప్పటికీ అధికారుల్లో ఎలాంటి మార్పులు లేవు.నవంబరు 21వ తేదీన యాభైమంది 21వ తేదీన 70 మంది 25వ తేదీన 27 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో ప్రమాదకర పరిస్థితిలో చెరుకోవడంతో ఆసుపత్రుల్లో చేర్పించినప్పటికీ ఆ పాఠశాల మధ్యాహ్నన భోజన విషయంలో ఎలాంటి మార్పు లేకపోవడం అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగించే విషయం.

PLUS D'HISTOIRES DE Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size