Essayer OR - Gratuit

దేశమంటే....(కథ)

Suryaa Sunday

|

August 31, 2025

దేశమంటే....(కథ)

- డా.డి.వి.జి. శంకరరావు

నాకు డబ్బు కోసం అత్యవసర పరిస్థితి వచ్చింది. ఎవరినీ అడిగే అవకాశం లేదు. అంత పెద్ద మొత్తం లో వెంటనే ఇవ్వగలిగే వాళ్లూ ఎవరూ లేరు. ఇక మిగిలింది ఒకటే.. ఆ పొలం అమ్మడం. అదైనా వెంటనే అమ్ముడవుతుందన్న గ్యారంటీ లేదు. అయినా ఆ | ఆప్షన్ ఒకటే మిగిలింది. అది కొనడానికి పడ్డ కష్టం, వదులుకున్న స్నేహం అన్నీ గుర్తుకు వచ్చాయి. అది ఐదేళ్ల క్రిందటి మాట.

*** ***

మా ఆవిడని ' బంగారం' అని ముద్దుగా పిలుస్తాను కానీ బంగారం లక్షణాలు ఏమీ అంటే సరిపోతుంది. కఠినం. ఆలోచన, మాటల్లో కుండలెన్నో బద్దలవుతుంటాయి.

పోనీ తనకు అందరిలా బంగారం అంటే ఇష్టమా అంటే అదీ కాదు.. తనకి అది మట్టి తర్వాతే. ఎంత ఇష్టమంటే అన్నప్రాసన రోజు నా కొడుకు దగ్గరున్న పుస్తకం, పలక, నగా అన్నీ వదిలి, కొంచెం దూరంలో ఉన్న మట్టి ముద్ద దగ్గరకు పాక్కుంటూ పోయి పట్టుకున్నప్పుడు తను ఎగిరి గంతేసింది. పోనీ లెండి, వీడైనా కొంచెం భూమి సంపాదిస్తాడు. మీలాగా కాదు ' అంటూ.

ఎవరైనా చదువులు చదివి ఉద్యోగం వెలగబెడితే బాగుణ్ణు అనుకుంటారు కానీ ఇలా కూడా అనుకుంటారా అని వచ్చిన వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు.

పెళ్లి అయిన పదేళ్ళూ ఒకటే పోరు.. ' ఒక ఎకరం పొలం ఎక్కడైనా కొనొచ్చు కదా! | చక్కగా కాయగూరలైనా సాగు చేయొచ్చు. ఎప్పుడూ పెళ్ళాం మాట పట్టదు మీకు ' అంటూ.

నాకు మాత్రం ఆ కోరిక తీర్చాలని ఉండదా! కానీ సంపాదన ఆస్తులు కొనేటంత ఎక్కడ? ఎప్పడిది అప్పుడే. మళ్లీ నెల జీతం కోసం ఎదురు చూపే.

PLUS D'HISTOIRES DE Suryaa Sunday

Listen

Translate

Share

-
+

Change font size