Intentar ORO - Gratis
పర్యాటకుల స్వర్గధామం 'లడక్'
Vaartha-Sunday Magazine
|October 08, 2023
వరల్డ్ రూఫ్ టాప్ గా పరిగణించే లడక్ సుందరమైన ఒక ప్రదేశం. పర్యాటకులకు స్వర్గధామం.
వరల్డ్ రూఫ్ టాప్ గా పరిగణించే లడక్ సుందరమైన ఒక ప్రదేశం. పర్యాటకులకు స్వర్గధామం. ముఖ్యంగా జూన్, జులై మాసాల్లో లడక్ లోని వివిధ ప్రాంతాలు సందర్శించడానికి చాలా మంది యాత్రికులు ఇక్కడకు వస్తుంటారు. యువతీ యువకులు వారి సైకిల్ మోటార్లపై సాహసోపేతంగా ప్రయాణించడానికి ప్రపంచంలోని అతి ఎత్తయిన ప్రాంతమైన కార్డూంగ్ పాస్ ప్రాంతానికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు.
ఈ ప్రాంతంలో విహరించిన వారం రోజులు ప్రకృతిలో లీనమైనట్టుగా జీవితం సాగిపోతుంది. స్వచ్ఛంగా తెల్లగా మెరిసిపోతున్న మంచుకొండలు, గడ్డకట్టే చలిగాలులు, ఆకాశంలో నక్షత్రాలు, కిలోమీటర్లకొద్దీ కానరాని మనుషులు, కుడివైపు అంతా కారకోరం పాస్ పర్వత శిఖరాలు, పర్వతాలపై పడి కరిగిపోతున్న మంచు తాలూకు నీటితో లోయలోకి ప్రవాహంలా దూసుకుపోతున్న సయోక్ నది, ఎడమ వైపు ఎంతో ఇరుకైన రహదారి పర్యాటకులను ఆనందంలో ముంచెత్తుతాయి.
లడక్లోని లేహ్ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉండే అందమైన ప్రదేశం. దీని పురాతన చరిత్రను పరిశీలిస్తే మొదటి శతాబ్దంలో కుషాన్ చక్రవర్తి కాలంలోనే లడక్ నుండి ఇండియాకు చైనా ద్వారా వ్యాపార సంబంధాలు ఉండేవనీ, దీన్ని సిల్క్ రోడ్ గా వ్యవహరించారని తెలుస్తోంది. ఇండియాలోని చివరి గ్రామమైన తుర్రుక్ అనే గ్రామ ప్రాంతం ద్వారా సిల్క్ రూట్గా ప్రాముఖ్యం వహించిన ప్రాంతం ఇప్పటికీ దర్శనీయ ప్రదేశాల్లో ఒకటిగా ఉంది.
పర్యావరణ మార్పులు, మామూలు వర్షపాతం కంటే అత్యధిక వర్షం పడుతున్న వంద ప్రాంతాల్లో లేహ్ ఒకటి. లడక్ అంటేనే ల్యాండ్ ఆఫ్ హై పాసెస్ గా పరిగణిస్తారు. ఈ మౌంటేన్ రేంజెస్ సముద్ర మట్టానికి 16400 అడుగుల నుండి 22000 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఇవి దాదాపు 45 మిలియన్ సంవత్సరాల క్రితం తయారు అయినట్టుగా పరిగణిస్తున్నారు. ఇదే ప్రాంతంలోని కారకోరం పాస్ శిఖరాలు సముద్ర మట్టానికి 18875 అడుగుల ఎత్తు నుండి 25171 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి.
Esta historia es de la edición October 08, 2023 de Vaartha-Sunday Magazine.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Vaartha-Sunday Magazine
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Translate
Change font size
