Versuchen GOLD - Frei

పరువు అనే భ్రమలో అమాయకులు

Suryaa Sunday

|

August 31, 2025

“పరువు అనే భ్రమలో అమాయకులు

- డా హిప్నో పద్మ కమలాకర్

పరువు అనే భ్రమలో అమాయకులు

గుజరాత్లో 18 ఏళ్ల అమ్మాయి తన ప్రేమ వివాహం కారణంగా తన తల్లిదండ్రుల చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన విని మనసు కలచివేస్తుంది. ఈ రోజుల్లో కూడా పరువు పేరుతో కూతురు, అల్లుడిని, కోడలిని, కొడుకుని హత్య చేయడం సహజం అయిపోయింది.

ఉత్తరప్రదేశ్: ఒక అమ్మాయి పొరుగువాడితో ప్రేమలో పడింది. తల్లిదండ్రులు అంగీకరించలేదు. చివరికి తండ్రే కత్తితో హత్య చేశాడు.

తెలంగాణ: కులం వేరని కారణంతో ఒక జంటను కుటుంబ సభ్యులు గ్రామమంతా చూస్తుండగానే చంపేశారు.

హైదరాబాదు: లవ్ మ్యారేజ్ చేసుకున్న అబ్బాయి, అమ్మాయి పక్కింట్లోనే ఉ ంటే, అమ్మాయి అన్నలు వచ్చి హత్య చేశారు.

ఇది ఒక క్రూరమైన వాస్తవం - ప్రేమలో ఉన్న ఇద్దరిని శిక్షించడం అంటే తల్లిదండ్రులు తమ సొంత పిల్లలను కూడా చంపేయడానికి వెనుకాడడం లేదు. ఈ పరిస్థితికి సైకలాజికల్ కోణంలో కొన్ని కారణాలు స్పష్టంగా కనిపిస్తాయి.

ఈ సంఘటనలు మనసును కలచివేస్తున్నాయి. పిల్లల ప్రాణాల కంటే “పరువు” ముఖ్యమా? అన్న ప్రశ్న మనందరి ముందు నిలుస్తోంది.

1. సామాజిక పరువు (Social Prestige) చాలా తల్లిదండ్రులు ఇప్పటికీ “మన కులం - మన గోత్రం - మన మతం" అనే సంకెళ్లలో ఇరుక్కున్నారు. పిల్లలు వేరే కులం లేదా మతంలో పెళ్లి చేసుకుంటే అది తాము నిర్మించుకున్న సామాజిక గౌరవానికి మచ్చ అని భావిస్తారు. మనసికంగా చాలా మంది తల్లిదండ్రులు తమ పేరు, పరువు, కుల గౌరవం అంటే ప్రాణం కంటే గొప్పగా భావిస్తారు. పిల్లల వ్యక్తిగత నిర్ణయాలు తమ పేరుకు మచ్చ అని ఊహించుకుంటారు.

ఉదాహరణ: ఒక అమ్మాయి ఇంటర్ లవ్ మ్యారేజ్ చేసుకుందంటే "ఎలా మా కులంలో ఇలాంటిది జరిగింది?” అని కోపం అగ్రస్థాయికి చేరుతుంది.

2. ఐడెంటిటీ క్రైసిస్ (Identity Crisis) - గ్రామాలు, చిన్న పట్టణాల్లో “ఇంట్లో జరిగిందే పక్కింటికి తెలిసింది" అనే పరిస్థితి ఉంటుంది.

- ఇతరుల మాటల భయం - "నీ కూతురు వేరే కులం వాళ్లతో పారిపోయిందట" అనే అపవాదు తట్టుకోలేక నేరం చేస్తారు.

WEITERE GESCHICHTEN VON Suryaa Sunday

Listen

Translate

Share

-
+

Change font size