కదనరంగంలో మన కమల
Namaste Telangana Hyderabad|August 13, 2020
కదనరంగంలో మన కమల
ఆమె పదునైన విమర్శలకు ఎంతటి ప్రత్యర్థులైనా జడుసుకోవాల్సిందే.. ఆమె ప్రశ్న సంధించారంటే ఎదుటివ్యక్తి సమాధానం కోసం తడుముకోవాలి. అణిచివేత ఎక్కడుంటే ఆమె స్వరం అక్కడ గంభీరంగా వినిపిస్తుంది.. ధిక్కరిస్తుంది.. నిలదీస్తుంది.. ఆమె కమలాహారిస్‌.. అమెరికాలో పరిచయం అక్కరలేని ఉక్కుమహిళ.

న్యాయవాదిగా అనేక రికార్డులు సృష్టించిన ఈ భారత సంతతి ధీరవనితకు.. రాజకీయ నేతగా కూడా ఎదురులేని రికార్డు ఉన్నది. అమెరికా సెనేట్‌కు ఎన్నికైన మొదటి భారత సంతతి, హిందూ మహిళగా నిలిచిన ఆమె.. తాజాగా డెమోక్రటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన తొలి నల్లజాతి మహిళగా, భారత జాతీయురాలిగా.. తొలి హిందూ మహిళగా రికార్డు నెలకొల్పారు. డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఆమెను తన డిఫ్యూటీగా ఎంపికచేసి సంచలనానికి తెరలేపారు.

వాషింగ్టన్‌, ఆగస్టు 12: అమెరికాలో ఉక్కు మహిళగా పేరుగాంచిన భారత మూలాలున్న సెనేటర్‌ కమలాహారిస్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికయ్యారు. పార్టీ అధ్యక్ష అభ్యర్థి జోబిడెన్‌ ఆమెను తన డిప్యూటీగా ఎంపికచేసి అధ్యక్ష ఎన్నికల్లో సంచలనానికి తెరలేపారు. అమెరికా ఎన్నికల చరిత్రలో ఒక ప్రధాన పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా నల్లజాతి మహిళ, అందునా భారత మూలాలున్న మహిళ ఎంపికవటం ఇదే తొలిసారి.

ప్రత్యర్థే డిఫ్యూటీగా..

ఈ ఏడాది నవంబర్‌ 3న జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం జో బిడెన్‌తో మొదట కమల పోటీపడ్డారు. 2019 చివరి వరకు పోటీలో ఉన్న ఆమె, ఆర్థిక వనరుల కొరతతో పోటీనుంచి విరమించుకొని బిడెన్‌కు మద్దతు ప్రకటించారు. దాంతో 77 ఏండ్ల బిడెన్‌ తన డిఫ్యూటీగా కమలను ఎంపిక చేసుకొన్నారు.

నాకు గొప్ప గౌరవం

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

August 13, 2020