ప్రగతి నగరం
Namaste Telangana Hyderabad|September 17, 2020
ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.

  • తెలంగాణలో అత్యంత వేగంగా పట్టణీకరణ

  • విప్లవాత్మక సంస్కరణలతో అభివృద్ధి పరుగులు

  • 24 గంటల కరంటు, ఇంటింటికీ నల్లా నీళ్లు

  • మున్సిపాలిటీలకు ప్రతినెల రూ.178 కోట్లు

  • ఆరేండ్లలో ఆస్తి పన్ను, నీటి బిల్లు పెంచలేదు

  • ప్రపంచం మెచ్చిన గమ్యస్థానం హైదరాబాద్‌

  • పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామారావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా సగటు పట్టణ జనాభా 31.2 శాతంగా ఉంటే తెలంగాణలో 42.6 శాతానికి చేరుకున్నదని తెలిపారు. ప్రపంచం మెచ్చిన గమ్యస్థానంగా హైదరాబాద్‌ మారుతున్నదన్నారు. జీహెచ్‌ఎంసీ, శివారు ప్రాంతాలు, ఇతర మున్సిపాలిటీల్లో వసతులు, మౌలిక సదుపాయాల కల్పనపై బుధవారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా చర్చను ప్రారంభిస్తూ మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. అనంతరం సభ్యులు లేవనెత్తిన అంశాలపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్‌ నేత మల్లు భట్టివిక్రమార్క చేసిన వ్యాఖ్యలపై లెక్కలు, ఫొటోలతో కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్‌ ప్రభుత్వం దార్శనికతతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టి జరిగి పెట్టుబడులు పెరుగుతున్నాయని, ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు వస్తున్నాయని చెప్పారు. ఇవన్నీ పట్టణాల అభివృద్ధికి తోడ్పడుతున్నాయన్నారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థల బలోపేతం, ఉపాధి కల్పన, టీఎస్‌ఐపాస్‌ తదితర కార్యక్రమాల ఫలితంగా తెలంగాణలో పట్టణీకరణ వేగంగా పెరుగుతున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో 74 కొత్త మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఏర్పాటుచేశామన్నారు. ఫలితంగా రాష్ట్రంలో మున్సిపాలిటీల సంఖ్య 142కు పెరిగిందన్నారు.

ఆరేండ్లలో పలు సంస్కరణలు

పౌరులకు నాణ్యమైన సేవలు అందించడం, వారి జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే లక్ష్యంతో గత ఆరేండ్లలో అనేక పాలనా సంస్కరణలను చేపట్టామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. పౌరులను కేంద్రంగా చేసుకొని తెలంగాణ మున్సిపల్‌ యాక్ట్‌-2019తో సంస్కరణలకు తెరలేపామన్నారు. అధికారులను, ప్రజాప్రతినిధులను బాధ్యులను చేస్తూ, పౌరులకు బాధ్యతలను గుర్తుచేస్తూ సులభంగా పౌరసేవలను అందించే దిశగా విధివిధానాలను రూపొందించామని తెలిపారు. భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేస్తూ టీఎస్‌బీపాస్‌ను ఆవిష్కరించామన్నారు. నిర్ణీత గడువులోగా భవన నిర్మాణానికి అధికారులు అనుమతి ఇవ్వకుంటే డీమ్డ్‌ టు అప్రూవల్‌ పొందే విప్లవాత్మక విధానాన్ని తెచ్చామన్నారు.

చట్టాలతోపాటే ప్రత్యేక సంస్థల ఏర్పాటు

మున్సిపాలిటీల అభివృద్ధికి చట్టాలు చేస్తూనే.. వసతుల కల్పనకు పెద్దఎత్తున నిధులు అందించేందుకు తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీయూఎఫ్‌ఐడీసీ), హైదరాబాద్‌ కోసం స్ట్రాటజికల్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఎస్సార్డీపీ), కాంప్రెహెన్సివ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రాం, హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, మూసీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వంటివి ఏర్పాటు చేశామని వివరించారు. కరోనాతో దేశమంతా స్తంభిస్తే, తెలంగాణ మాత్రం దానినొక అవకాశంగా మలుచుకొన్నదని చెప్పారు. జీహెచ్‌ఎంసీ సహా పట్టణాల్లో మౌలిక వసతులు, రోడ్ల నిర్మాణం చేపట్టి దేశం దృష్టిని ఆకర్షించిందని అన్నారు.

ప్రజలపై పైసా భారం మోపలేదు

విధులతోపాటు నిధులు కేటాయించినప్పుడే అభివృద్ధి సాధ్యమని విశ్వసించి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా జీహెచ్‌ఎంసీకి రూ.78 కోట్లు, ఇతర మున్సిపాలిటీలకు రూ.70 కోట్లు.. మొత్తంగా రూ.148 కోట్లు ఠంచనుగా విడుదల చేస్తున్నదని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. పురపాలికలకు ఏటా రూ.1,776 కోట్లు సమయానికి విడుదలచేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణేనన్నారు. దీంతోపాటు పురపాలికల్లో పెద్దఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. అయినా ప్రజలపై ఒక్కపైసా ఆర్థికభారం మోపలేదని గుర్తుచేశారు. ఇప్పటివరకు ఆస్తి పన్ను, నీటి బిల్లులు పెంచలేదని, పైగా రూ.1200కన్నా తక్కువ వార్షిక ఆస్తిపన్ను కలిగిన వారికి రూ.101కి తగ్గించామని వివరించారు. మిషన్‌ భగీరథ నీరు ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్‌ ఇస్తున్నట్టు చెప్పారు.

గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి

భట్టి విక్రమార్క (కాంగ్రెస్‌పక్ష నాయకుడు) తన నియోజకవర్గానికి రావాలన్నా, పోవాలన్నా ఖమ్మం మీదుగా పోతారని, 2014 వరకు ఖమ్మం ఎలా ఉన్నది? ఇప్పుడు మంత్రి అజయ్‌కుమార్‌ నేతృత్వంలో ఎలా అభివృద్ధి చెందిందో గుండెలమీద చేయి వేసుకొని చెప్పాలని మంత్రి కేటీఆర్‌ సవాలు చేశారు. లక్కారం చెరువు అద్భుతంగా ఉన్నదని చెప్పారు. చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ నేతృత్వంలో వరంగల్‌ భద్రకాళి ట్యాంకును గొప్పగా తీర్చిదిద్దామన్నారు. వీటిని భట్టి తప్ప అందరూ ఒప్పుకుంటారని చెప్పారు.

ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం

Continue reading your story on the app

Continue reading your story in the newspaper

MORE STORIES FROM NAMASTE TELANGANA HYDERABADView All

ప్రగతి నగరం

ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.

2 mins read
Namaste Telangana Hyderabad
September 17, 2020

లవ్‌ స్టోరీ @ 1962

అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న కమలా హ్యారిస్‌ గురించి చాలానే విన్నాం. చాలానే చదివాం. కానీ, ఆమె తల్లిదండ్రుల ప్రేమ కథ గురించి మాత్రం కొద్దిమందికే తెలుసు. తల్లి శ్యామల అచ్చమైన మద్రాసీ. నూటికి నూరుపాళ్లు సంప్రదాయ కుటుంబం. తండ్రి డొనాల్డ్‌ హ్యారిస్‌ జమైకా పౌరుడు. ఆ ఇద్దరి పరిచయం, స్నేహం, ప్రేమ, పెళ్లి, విడాకులు.. అంతా, సినిమా కథను తలపిస్తుంది.

1 min read
Namaste Telangana Hyderabad
September 17, 2020

2 గంటలు.. 11 సెంటీమీటర్లు

అప్పటిదాకా భగభగమండే ఎండ.. వాన ఆనవాళ్లే లేవు.. కానీ, సాయంత్రం 4 గంటలు కాగానే ఒక్కసారిగా కారుమబ్బులు కమ్ముకున్నాయి.. అంతటా చీకటి అలుముకుంది. వర్షం పడుతుందేమో!

1 min read
Namaste Telangana Hyderabad
September 17, 2020

కేంద్ర విద్యుత్‌ బిల్లు డేంజర్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్‌ చట్టం అత్యంత ప్రమాదకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.

3 mins read
Namaste Telangana Hyderabad
September 16, 2020

శ్రీవారి ఆలయంలో శాస్తోక్తంగా కోయిల్ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తీరు మంజనం శాస్తోక్తంగా జరిగింది.

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

జోరు పెంచిన కథానాయకులు

ప్రస్తుతం తెలుగు అగ్ర కథానాయకులు సినిమాల వేగాన్ని పెంచారు. కరోనా సంక్షోభం సృష్టించిన నిర్లిప్త భావన నుంచి తేరుకుంటూ వరుస సినిమాలు అంగీకరిస్తున్నారు. గతంలో అగ్రహీరోల సినిమాలంటే ఏడాదికోసారి వచ్చే పండగలా భావించేవారు అభిమానులు. ఒక్కసారి బొమ్మ పడిపోయిందంటే సదరు హీరో సినిమా మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియని అనిశ్చితిలో కాలం గడిపేవారు. ఇప్పుడు హీరోల ప్రాధామ్యాలు మారిపోయాయి. కరోనా క్రైసిస్‌ నేర్పిన పాఠంతో సినిమాల విషయంలో జాగు చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. భవిష్యత్తు అనుకున్న విధంగా సాఫీగా ఉంటుందనే భరోసా లేకపోవడంతో ఎక్కువ సినిమాలతో అభిమానుల్ని అలరించడం..బాక్సాఫీస్‌ బరిలో తమ సత్తాచాటాలనే ఉద్ధేశ్యంతో వరుస సినిమాలకు ఉపక్రమిస్తున్నారు.

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

జీవ చైతన్య నగరం హైదరాబాద్

ప్రపంచపు మేటి నగరాల్లో మన హైదరాబాద్ ఒక టిగా నిలవడం గర్వకారణం. ఇందుకోసం ముఖ్య మంత్రి కేసీఆర్ కృషి నిరూపమానం.

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

ఆర్‌సీబీ కల తీరేనా!

బంతికే భయం పుట్టేలా బాదగల విరాట్‌.. సిక్సర్లకు కొత్త అర్థం చెప్పిన డివిలియర్స్‌.. విధ్వంసానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ఫించ్‌.. పిట్టకొంచెం కూత ఘనంలా చెలరేగే పార్థివ్‌.. నిఖార్సైన ఆల్‌రౌండర్స్‌ మొయిన్‌ అలీ, మోరిస్‌.. పేస్‌ గన్స్‌ స్టెయిన్‌, ఉమేశ్‌, సిరాజ్‌.. స్పిన్‌ మాంత్రికులు జంపా, చాహల్‌.. ఇలా కాగితం మీద చూసుకుంటే.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)ను మించిన జట్టు మరొకటి కనిపించదు. అయినా పుష్కర కాలంగా ఐపీఎల్‌ టైటిల్‌ కోసం తండ్లాడుతున్న విరాట్‌ సేన.. ఈ సారైనా తమ కల నెరవేర్చుకుంటుందేమో చూడాలి!

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

3.75 కోట్ల హవాలా సొమ్ము

భారీ ఎత్తున నగదును అక్రమంగా తరలిస్తున్న గుజరాత్ హవాలా ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.

1 min read
Namaste Telangana Hyderabad
September 16, 2020

పల్లెలకు ఆర్థిక అండ

రాష్ట్రం లో ప్రతి పల్లెను పరిపుష్టం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.

1 min read
Namaste Telangana Hyderabad
September 14, 2020