జజ్జలకరి జనారే!

Namaste Telangana Hyderabad|May 30, 2020

జజ్జలకరి జనారే!
మొత్తంగా లక్ష కోట్ల రూపాయల పంట పండించే బంగారు తెలంగాణ, భాగ్యరాశుల తెలంగాణ, పసిడి పంటల తెలంగాణ అనతికాలంలో తయారుకావడం గర్వకారణం. 'పల్లెపల్లెలో పల్లేర్లు మొలిచె తెలంగాణలోనా' అని కవులు పాటలు పాడుకున్న తెలంగాణ. తలాపున పారుతుంది గోదారి, మన సేను మన సెలక ఏడారి అని సదాశివుడు రాసిన పాటలు. ఒకనాడు ఏడుపు పాటల తెలంగాణ. ఇయ్యాల పసిడి ధాన్యపు రాశుల తెలంగాణ. ఇది నాకు చాలా గర్వంగా, చాలా సంతృప్తిగా ఉన్నది. -సీఎం కేసీఆర్

ప్రపంచమే ఆశ్చర్యపడేలా వారంలో రైతులకు తీపి కబురు ధాన్యపు సిరుల తెలంగాణ.. పల్లేర్లు మొలిచిన చోటే పసిడి పంటలు ఏడాదిలో లక్షకోట్ల పంట.. నీటితీరువా నయా పైస కూడా తీసుకోం ప్రాజెక్టుల కోసం భూములను త్యాగం చేసిన వారికి ధన్యవాదాలు మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు

నెర్రెలిడిన నేల ఎదురు చూస్తుండగా.. హోమ గుండపు అగ్ని ప్రజ్వరిలుతుండగా.. ఉద్విగ్న జీవులు గాలినుగ్గబట్టిండగా.. అటుపైని ఆకాశ మాసక్తి చూపగా.. పంచ భూతాల సాక్షిగా.. దీక్షగా..

నీల వర్ణపు జల ధార జాలువారింది! పోచమ్మసాగరు పొంగిపొర్లింది!

బాహుబలి పంపుల నుంచి పైకి లేచిన జల ఛత్రం నిండు సంతోషాన్ని నింగి నుంచి గుమ్మరించినట్టు. ధవళ వర్ణంలో ధడేలున పైకి లేచి ధప్పున కురిసింది!

పోచమ్మ సాగరంలోకి పెను కెరటమై విరుచుకుపడింది!! తెలంగాణ జనానందానికి ఇది సజీవ జల చిత్రం!! కాళేశ్వరం ప్రాజెక్టులో ఇదొక చరిత్రాత్మక ఘట్టం. ముఖ్యమంత్రి కేసీఆర్, చినజీయర్ స్వామి చేతుల మీదుగా కొండపోచమ్మ సాగర్‌లోకి గోదావరి జలం ప్రవేశించింది.

మెతుకుసీమలో జల సంబురం

• ఘనంగా కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభం

• మర్కూక్ లో మోటర్లు ఆన్ చేసిన సీఎం కేసీఆర్

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 30, 2020