Facebook Pixel 'ఘంటం' నుండి ప్రారంభమైన 'పెన్ను' ప్రస్థానం | Suryaa Sunday - news - Bu hikayeyi Magzter.com'da okuyun
Magzter GOLD ile Sınırsız Olun

Magzter GOLD ile Sınırsız Olun

Sadece 9.000'den fazla dergi, gazete ve Premium hikayeye sınırsız erişim elde edin

$149.99
 
$74.99/Yıl

Denemek ALTIN - Özgür

'ఘంటం' నుండి ప్రారంభమైన 'పెన్ను' ప్రస్థానం

Suryaa Sunday

|

November 17, 2024

శతాబ్దాల క్రితం, కాగితం కనిపెట్టక ముందు రాగి, బంగారు రేకులపై, తోలు వస్తువులపై, రాతి స్థంభాలపై, చెట్టు బెరడుపై, తాటి ఆకు మరియు భూర్జపత్రాలపై భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, సంగీత, సాహిత్య, చిత్రలేఖన, విద్య, వైద్య, ఖగోళ సంబంధ విషయాలను లిఖించి రాత ప్రతుల (Manuscripts) రూపంలో పొందుపరచారు మన పూర్వీకులు. ఎండిన తాటి ఆకులపై రాసేందుకు లోహపు లేదా ఎముక 'ఘంటం' (స్టైలస్) ను ఉపయోగించేవారు.

- యేచన్ చంద్ర శేఖర్ 8885050822

'ఘంటం' నుండి ప్రారంభమైన 'పెన్ను' ప్రస్థానం

తాళపత్రాల ఉనికి భారతదేశంలోనే కాదు ఆసియా మరియు ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాలలో కూడా ఉంది. తాళపత్ర గ్రంథాలు నేడు విలువైన కళాఖండాలుగా మాత్రమే కాకుండా భారతదేశ సాహిత్య మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.క్రీ.పూ. 3200లో ఈజిప్షియన్లు మెసొపొటేమియాలో వెదురు లేదా రెల్లుతో కనిపెట్టిన మొదటి పెన్నును “రీడ్ పెన్నులు” అంటారు.వాటిని సిరాలో ముంచి, పాపిరస్ మొక్క యొక్క గుజ్జుతో తయారు చేసిన మందంగా ఉండే కాగితంపై ఉపయోగించారు. 'పెన్' అనే పదం 'పెన్నా' (Penna) అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది.దీనికి అర్థం 'ఈక’. 6వ శతాబ్దంలో స్పెయిన్లోని సెవిల్లెలో కనుగొ న బడిన క్విల్ పెన్ (పక్షి ఈకలతో) వెయ్యి సంవత్సరాలకు పైగా 19వ శతాబ్దం మధ్య వరకు పాశ్చాత్య ప్రపంచంలో ప్రాథమిక రచనా పరికరంగా ఉపయోగించబడింది. బాతులు లేదా హంసల యొక్క ఈకల మొదళ్ళు డోలుగా లేదా ఖాళీగా ఉండడంతో, కేశనాళిక చర్య (Capillary Action) ద్వారా సిరా పాళీ (Nib) లోకి లాగ బడుతుంది. పార్మెంట్ మరియు జంతు చర్మాలపై చిన్న అక్షరాలతో స్పష్టంగా రాసేందుకు రెల్లు పెన్నుల కంటే క్విల్ పెన్నులు అనుకూలంగా ఉండడంతో పాటు త్వరగా పాయింట్ను కోల్పోకపోవడం వాటి ప్రత్యేకత. మొనదేలిన వీటి కొసను సిరా బుడ్డిలో (Ink Pot) ముంచి సిరా ఆరిపోయేలోపల కొన్ని పదాలను రాయవచ్చు. చట్టం వ్యక్తులకంటే ఉన్నతమైనది మరియు అది అందరికీ సమానంగా వర్తిస్తుంది అనే సూత్రం ఆధారంగా మానవ హక్కులలో ఒక గొప్ప మలుపుగా అభివర్ణించదగ్గ “మాగ్నా కార్టా” లేదా “గ్రేట్ చార్టర్” పై 1215లో ఇంగ్లండ్ రాజు జాన్ క్విల్ పెన్నుతోనే సంతకం చేయడం విశేషం. 1800ల ప్రారంభంలో డిప్ లేదా నిబ్ పెన్ లు వాడుకలోకి వచ్చే వరకు పెన్ ప్రపంచంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోలేదు. ఈ పెన్నులు ప్రత్యేకం గా బర్మింగ్హామ్, ఇంగ్లాండ్, మరియు జర్మనీలో భారీగా ఉత్పత్తి చేయబడేవి. లోహపు పాళీ క్విల్ కంటే మరింత అనుకూలమైన ఎంపికగా మారడంతో క్విల్ పెన్స్ వాడకం కాలక్రమేణా బాగా క్షీణించింది.

Suryaa Sunday'den DAHA FAZLA HİKAYE

Suryaa Sunday

Suryaa Sunday

మనసు పలికిన నిశ్శబ్దం

నవకవిత్వం

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

బుడత బాగున్నాడు

చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

సినిమా రివ్యూలు

వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ముఖచిత్ర కథనం

బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

రెక్కలు మొలవని ఆశ..!!

రెక్కలు మొలవని ఆశ..!!

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్

లెజెండ్

time to read

2 mins

May 31, 2026

Suryaa Sunday

చైర్మన్ ముఖాముఖి

చైర్మన్ ముఖాముఖి

time to read

2 mins

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ముఖచిత్ర కథనం

బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.

time to read

1 min

May 24, 2026

Suryaa Sunday

సినిమా రివ్యూలు

వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.

time to read

1 min

May 24, 2026

Suryaa Sunday

Suryaa Sunday

మాళవిక నాయర్

మాళవిక నాయర్

time to read

1 min

May 24, 2026

Listen

Translate

Share

-
+

Change font size