దీక్షకు తుది రూపు - దక్షతకు మారు పేరు
SAHARI Monthly
|December 2025
పాడుతూ జీవించారు. జీవించి నంత కాలము పాడుతూనే వున్నారు. ఆ కంఠరవంలో హాయి, రాగలహరిలో స్థాయి. ప్రసన్న మధుర భావార్ద్ర మూర్తి.
చరవాణి 9948345013
పాడుతూ జీవించారు. జీవించి నంత కాలము పాడుతూనే వున్నారు. ఆ కంఠరవంలో హాయి, రాగలహరిలో స్థాయి. ప్రసన్న మధుర భావార్ద్ర మూర్తి.
కరుణశ్రీ పలికినట్లు కలికి ముత్యాల శాల. ఆయన ఘంటశాల.గంధర్వ శిశువుగా పుట్టింది డిసెంబర్ నాలుగున. భారత స్వతంత్ర సాధనకు సరిగ్గా పాతికేళ్ళ ముందు. మాట ఎలా వుండాలో, పాటను ఏ విధంగా పాడాలో, మాటలు పాటలు కలగలిస్తే జీవితం కళాశాలగా ఎంత మారుతుందో ఆయనను వింటేనే తెలుస్తుంది. పద్యానికి పరమ వైభవం తెచ్చిన పుంభావ గాన సరస్వతి. లలిత సంగీత సంప్రదాయ వైతాళికుడంటే ఆయనే. స్వాదువర్తనం అంటే ఆయనదే.
పతి అనే మాటకు పదం అ చెపుతుంది శబ్దరత్నాకరం. ఆలాపన అని పర్యాయపదంగా చూపుతుంది సంబంధిత నిఘంటువు. పాట అనే పదానికి క్రమం, అర్థాలూ వున్నాయి. తనదైన రీతిన రాగాలాపనే ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టారి జీవన గాన విధానం. ఆ రీత్యా ఆయన ఆసాంత పదయోగి. తెల్లగా మెరిసే ఖద్దరు పంచె, పొడవుగా వుండే తెల్లని చొక్కా, భుజం మీద కండువా ఆయన వేషధారణ.చెదరని చిరునవ్వు, లోతైన లోతైన చూపు, ఆత్మీయతా భావన ఆయనకి సహజ అలంకరణ.
తెలుగు తీయదనమంతా గొంతులోనే. ఏ రసానుభూతి కలిగించాలన్నా ఆయన ఉచ్చారణే. ఒక్క తెలుగులోనే కాదు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విదేశీ భాష సింహళంలోనూ గాన రసాల సాల.మృదంగ ధ్వనిలో పేరొందిన తండ్రి, గీత తన్మయతను అలవరచిన తల్లి అయన తొలి గురువులు. కాలక్రమంలో నాటక సమాజాన్ని స్థాపించి, అనేక చోట్ల ప్రదర్శనలిచ్చినపుడు, వీక్షకుల కరతాళ ధ్వనులే ఆయన వీనులకు నవామృత విందులు. ఒక సందర్భంలో కొంత మంది గ్రామీణ యువకులకు నట శిక్షణ ఇచ్చిన విశేష అనుభవమూ వుంది.మరింత విశిష్టత ఏమిటంటే - ఇరవై ఏళ్ళ నవయౌవనంలో వందేమాతరం అ నినదించడం.
దరిదాపు రెండు సంవత్సరాలు కారాగార జీవితం. అక్కడా మాటలు ఆపలేదు. పాటలు ఆగలేదు.బందీగా వుంటూనే సహ ఖైదీలకు సంగీత పాఠాలు. అప్పట్లోనే పొట్టి శ్రీరాములు గారితో అనుబంధం. జాతీయ భావాలు ఎంతగానో విస్తరించాయి. తెలుగు వారికి రాష్ట్రం కోసం ఆహుతి అయిన ఆమరజీవిని తలచుకుంటే మనకు ఇదే డిసెంబరు 15 స్మృతిపథలోకి వస్తుంది. ఆత్మ బలిదానం రోజు అదే.అందుకే - సమైక్య తెలుగు దినోత్సవం పేరిట ప్రత్యేక ప్రక్రియలు మద్రాసులో, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, సమైక్య భారతి నెల్లూరులో ఏర్పాటవుతున్నాయి.
Bu hikaye SAHARI Monthly dergisinin December 2025 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Listen
Translate
Change font size

