గిల్ట్
Vaartha-Sunday Magazine|March 17, 2024
కధ
మణి వడ్లమాని
గిల్ట్

అన్ని రోజుల్లాగే ఆ రోజు కూడా.....అనుకున్న అతనికి, తన జీవితం ఒక మలుపు తిరగబోతోందని అప్పుడు తెలీదు.

"మా వాడు అసలు చదవటం లేదు సారూ! నేను, మా ఆడమనిషి వాడిని కొట్టినా తిట్టినా కూడా మాట వినటం లేదు. మీరు డ్యూటీ నుంచి వచ్చాక కాస్త శ్రమ తీసుకుని వాడికి చదువు చెప్పండి " అని బతిమాలుతున్నాడు నర్సయ్య..

“నేను ఇంటిదగ్గర ఎవరికీ ప్రైవేట్లు చెప్పను నర్సయ్యా, బడిలో రోజంతా పిల్లల్తో వారి వారి ఇంటికొచ్చాక కూడా అదే పని మళ్లీ చెయ్యాలంటే నా వల్ల కాదు" అంటున్న వేణుమాధవ్ నోటమాట పూర్తయ్యిందో లేదో అన్నంత పనీ చేసేసాడు.

ఒక్క ఉదుటున వచ్చి అతని పాదాలు రెండూ పట్టుకొని బతిమాలసాగాడు.

"అంత మాట అనకండి సార్. చిన్నప్పుడు బడికిపోయి చదువుకోవాలని నాకు చాలా అనిపించేది. మా అయ్య మాత్రం సత్తే ఈల్లేదని చెప్పాడు. మాలా కాకుండా, వీడయినా చదువుకుంటాడని ఆశపడ్డాను. హు... ఆ దేముడు ఇదే రాసాడు కాబోలు.. మా ఆడది ఒకటే ఏడుపు.. అప్పుడే అనుకున్నా.. ఎంత కష్టపడయినా బిడ్డని చదివించాలని. వాడు ఇప్పుడు కనుక దారిలోకి రాకపోతే ఎందుకూ పనికి రాకుండా పోతాడు" అని బతిమాలుతుంటే మధ్యలోనే అందుకున్న సుధ “వాడిని చదివించే బాధ్యత మాది. నువ్వు ధైర్యంగా ఉంటు" అని నర్సయ్యకు చెప్పింది.

చిన్నప్పట్నుండీ పెరిగిన వాతావరణం ప్రభావం వల్లనో, చదివిన సాహిత్య ప్రభావం వల్లనోగానీ ఈ ప్రపంచాన్ని మార్చెయాలన్నంత ఆవేశం, మార్చివేయగలనన్న ఆత్మవిశ్వాసం రెండూ గుండె నిండా నింపుకున్న నిర్ణయంతో

“సరేలే.. ఎలాగోలా వీలు చూసుకొని చదువు చెప్తాను" అని హామీ ఇచ్చాడు వేణు, నర్సయ్యకు.

“మీరు కలకాలం చల్లగా ఉండాలి" అన్నాడు మళ్లీ దండం పెడుతూ.

ఒకలాంటి విషాదం... పైగా అదో రకమైన ముసలివాసన, ఆలనా పాలనా పట్టించుకునేవాళ్లు లేక శరీరం మీద శ్రద్ధ పోయి ఏ పని చేయడానికి కూడా సహకరించని దుర్భలత్వం తాలూకు ముసలి వాసన అది. ఎప్పుడూ ట్రిమా స్టైలిష్గా ఉండే ఆవిడని ఇలా చూస్తూంటే బాధగా వుంది చిరంజీవికి.

అంత ఖరీదయిన సోఫాలో ఉన్న ఆ మనిషి రసికారుతున్న పుండులా అసహ్యంగా, వికారంగా ఉంది.

అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టిన భార్యా, కూతురు ఆ ఆకారాన్ని నమ్మలేనట్టుగా చూసారు. చలికి ముడుచుకుపోయి సోఫాలో ఒక మూల ఒరిగిపోయి ఉంది ఆమె.

هذه القصة مأخوذة من طبعة March 17, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة March 17, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA-SUNDAY MAGAZINE مشاهدة الكل
గుడిగంటలు మోగాయి .
Vaartha-Sunday Magazine

గుడిగంటలు మోగాయి .

కథ

time-read
2 mins  |
May 05, 2024
పంటినొప్పి దేశభక్తి
Vaartha-Sunday Magazine

పంటినొప్పి దేశభక్తి

ఒక మిత్రుడు వచ్చాడు. అతనికి దైవభక్తి కంటే దేశభక్తి ఎంతో ముఖ్యమైనదని తరచూ అంటుంటాడు. ఏదో మాటవరకు చెప్పడం కాదు. అలా ఆచరించిన సందర్భాలు ఉన్నాయి. నిజంగానే దేశభక్తి ఉన్నవాళ్లు ఉన్నారు.

time-read
2 mins  |
May 05, 2024
పూల గ్రామం
Vaartha-Sunday Magazine

పూల గ్రామం

పూ లతోటలు చూడాలనిస్తే మహారాష్ట్రలోని పులాంచా గ్రామానికి వెళ్లాలి.

time-read
1 min  |
May 05, 2024
విస్తరిస్తే తెర
Vaartha-Sunday Magazine

విస్తరిస్తే తెర

ఇప్పటికే మడత ఫోన్లతో అలరిస్తున్న టెక్నో కంపెనీ తాజాగా విస్తరించే తెర ఫోన్ను ఆవిష్కరించింది.

time-read
1 min  |
May 05, 2024
చుక్కలు కలపండి
Vaartha-Sunday Magazine

చుక్కలు కలపండి

చుక్కలు కలపండి

time-read
1 min  |
May 05, 2024
నిజాయితీ
Vaartha-Sunday Magazine

నిజాయితీ

అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు. అతనికి ఒక 'అంతుచిక్కని వ్యాధి ఉంది.

time-read
1 min  |
May 05, 2024
అగరం వసంత్ వికసిస్తున్న హూసూరు కవిత్వం
Vaartha-Sunday Magazine

అగరం వసంత్ వికసిస్తున్న హూసూరు కవిత్వం

పుస్తక సమీక్ష

time-read
1 min  |
May 05, 2024
మరో చిన్నయ్య సూరి
Vaartha-Sunday Magazine

మరో చిన్నయ్య సూరి

పుస్తక సమీక్ష

time-read
1 min  |
May 05, 2024
నేల తల్లి
Vaartha-Sunday Magazine

నేల తల్లి

ఈవారం కవిత్వం

time-read
1 min  |
May 05, 2024
అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా...
Vaartha-Sunday Magazine

అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా...

ఇన్స్టాగ్రామ్ డీఎంలలో ఉండే ఈ ఫీచర్ దానంతటదే నగ్న చిత్రాలను పసిగడుతుంది. నగ్న చిత్రాలను షేర్ చేయటానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించు కునేలా చేస్తుంది.

time-read
1 min  |
May 05, 2024