Poging GOUD - Vrij
మహా నగరాలకు ఏమైంది..!?
Jyothi
|Jyothi 26-07-2023
ఎటు చూసినా కాలువలు, వాటి మీదుగా పడవల్లో సాగే వ్యాపారం..చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా అనిపించే వాతావ రణం ఇటలీలోని వెనీస్ నగరానికి సొంతం.
-
ఎటు చూసినా కాలువలు, వాటి మీదుగా పడవల్లో సాగే వ్యాపారం..చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా అనిపించే వాతావ రణం ఇటలీలోని వెనీస్ నగరానికి సొంతం. భారత్లోని అనేక నగరాలు ఇప్పుడు వెనీస్తో పోటీపడుతున్నాయి. చిన్న పాటి వర్షానికే రహదారులు కాలువల్లా మారిపోతున్నాయి. కాకపోతే వెనీస్ లో కాలువలే మార్గాలుగా ఉంటాయి కాబట్టి నీటిలో నడిచే పడవలు, మరబోట్లను వినియోగిస్తుంటారు. భారత నగరాల్లో వర్షం పడ్డప్పుడు మాత్రమే కాలువల్లా మారతాయి కాబట్టి పడవల వినియోగం లేదు. కార్లు, ఇతర వాహనాలే పడవల మాదిరిగా మారిపోయి వర్షపు నీటి వరద ప్రవాహంలో కొట్టుకుపోతుంటాయి. ఇన్నాళ్లూ సరైన పట్టణ ప్రణాళిక (అర్బన్ ప్లానింగ్) లేని మెట్రో నగరాల్లో మాత్రమే ఈ పరిస్థితి ఉందనుకుంటే.. తాజాగా గుజరాత్ జునాగఢ్ సంభవించిన వరద బీభత్సం దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాలు కూడా ఇందుకు మినహాయింపు కాదని చెబుతోంది. అసలు వర్షం నగరాల పాలిట శాపంగా ఎందుకు మారుతోంది? గతంలో ఎప్పుడూ లేని రీతిలో అతి తక్కువ వ్యవధిలో అత్యధిక వర్షపాతాన్ని అందజేస్తున్న వాతావరణ పరిస్థితులే కారణమంటూ ప్రకృతిపైకే నింద నెట్టేస్తే సరిపోతుందా? ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు.. చివరకు వర్షాలు అంతగా ఉండని దేశ రాజధాని న్యూఢిల్లీ సైతం వరదలో మునిగి తేలుతోంది. గత రెండున్నర దశాబ్దాల్లో ముంబై (2020), చెన్నై (2018), హైదరాబాద్ (2000 మరియు 2020), బెంగళూరు (2017), సూరత్ (2006), కోల్కతా (2007), పూణే (2019) మొదలైన అన్ని మెట్రో నగరాలు భారీ వర్షాల కారణంగా నీట మునిగాయి. కేవలం మెట్రో నగరాలే కాదు, దేశంలోని పట్టణ ప్రాంతాలన్నీ గట్టి వర్షం పడితే నీట ముంపునకు గురవుతున్నాయి. పట్టణ వరదలు పూర్తిగా మానవ తప్పిదాలని, సమర్ధ వంతమైన వర్షపు నీటి నిర్వహణ, ప్రణాళికతో వరదలను నివారించ వచ్చని మనం మర్చిపోయినట్టు కనిపిస్తోంది. దేశ రాజధాని నగరంలో ప్రవహించే యుమునా నది ఇప్పటికీ ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. అందులో కలిసే హిండన్ ఉపనది కూడా వరదతో ఉరకలెత్తుతోంది. యమునా నది చరిత్రలోనే ఎప్పుడూ లేనంత గరిష్ట ఎత్తుకు వరద ప్రవాహం చేరుకుంది. ఇప్పటి
Dit verhaal komt uit de Jyothi 26-07-2023-editie van Jyothi.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Jyothi
Jyothi
ఉత్తమ ‘సేవలు అందించాలి'
• సచివాలయంలో యూబిఐ శాఖ • ప్రారంభించిన సీఎస్ శాంతికుమారి
1 min
Jyothi 07-09-2023
Jyothi
మూసీకి ‘కొనసాగుతున్న వరద'
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే.దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది
1 min
Jyothi 07-09-2023
Jyothi
మార్పు 'మీ నుంచే కావాలి'
మార్పు మీ నుంచే మొదలు కావాలి మీరే గాంధీజీ ఆదర్శాలను పాటించండి మహిళా రిజర్వేషన్లపై కవితకు షర్మిల లేఖ
1 mins
Jyothi 07-09-2023
Jyothi
యూరప్ 'టూర్కు రాహుల్'
వారం పాటు పర్యటించనున్న కాంగ్రెస్ నేతలు
3 mins
Jyothi 07-09-2023
Jyothi
మహిళా 'బిల్లు ప్రస్తావన ఏదీ'
• సోనియా లేఖలో మహిళా బిల్లు ప్రస్తావన ఏదీ • సోనియాకు ఎమ్మెల్సీ కవిత ప్రశ్న
1 min
Jyothi 07-09-2023
Jyothi
తలకిందులైన టమాటా రైతులు!
టామాటా పేరు ఎత్తితేనే ప్రజలు వణికిపోయారు. కొండెక్కిన ధరతో సామాన్యుడి ఇంట టమాటా కాస్ట్లీ కూరగాయ అయ్యింది.
1 mins
Jyothi 01-09-2023
Jyothi
భయపెడుతున్న మరో వైరస్!
దేశంలో మరో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య పెరుగుతోంది.
2 mins
Jyothi 01-09-2023
Jyothi
రాబోయే 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్కు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సెప్టెంబర్ 4వ తేదీ వరకు వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం వైపు దిగువస్థాయిలో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది
1 min
Jyothi 01-09-2023
Jyothi
బ్రహ్మండనాయకుడి 'బ్రహ్మోత్సవాలు'
• సెప్టెంబర్, అక్టోబర్లలో రెండు బ్రహ్మోత్సవాలు • 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు
2 mins
Jyothi 01-09-2023
Jyothi
తెలంగాణ ‘రాజకీయాల్లోనే ఉంటా'..
• కేసీఆర్కు కౌంట్ డౌన్ మొదలయ్యింది • సోనియాతో భేటీ అనంతరం వైఎస్ షర్మిల వ్యాఖ్య
2 mins
Jyothi 01-09-2023
Translate
Change font size

