Poging GOUD - Vrij

ఆటతో ఆరోగ్యం, ఆటతో భవితవ్యం : క్రీడల ప్రాముఖ్యత

Suryaa Sunday

|

August 31, 2025

ప్రతి సంవత్సరం ఆగస్టు 29న మనం జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుం టాం.

- కింజరాపు అమరావతి

ఆటతో ఆరోగ్యం, ఆటతో భవితవ్యం : క్రీడల ప్రాముఖ్యత

ప్రతి సంవత్సరం ఆగస్టు 29న మనం జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుం టాం. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఈ దినోత్సవం దేశవ్యాప్తంగా క్రీడా స్ఫూర్తిని ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. అయితే ఈ రోజును కేవలం ఒక వీరుడికి నివాళులర్పించే రోజుగానే కాకుండా క్రీడలు మన జీవితంలో ఎంత ముఖ్యమో విశ్లేషించుకునే రోజుగా భావించాలి. ప్రత్యేకించి, విద్యార్థులకు క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదు, జీవిత పాఠాలు నేర్పే ఒక గొప్ప పాఠశాల. మేజర్ ధ్యాన్ చంద్ అసాధారణమైన ప్రతిభ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. బడి పిల్లల నుండి కళాశాల విద్యా ర్థుల వరకు ప్రతి ఒక్కరూ ఆయన జీవితం నుండి నేర్చుకోవాలి. జీవితం కేవలం బడి పుస్తకాలలోనో, పరీక్షల మార్కులలోనో లేదు. ఒక క్రీడాకారుడు మైదానంలో ఎదుర్కొనే సవాళ్లు, ఆటుపోట్లు, గెలుపు, ఓటమి వంటివి జీవితాన్ని ఎలా ఎదుర్కో వాలో నేర్పుతాయి.

ధ్యాన్ చంద్ వారసత్వాన్ని గౌరవించాలంటే, మనం ఆటకు ఒక గంట సమయాన్ని కేటాయించాలి. క్రీడలు కేవలం శరీరాన్ని దృఢంగా ఉంచడం మాత్రమే కాదు, వాటి వల్ల మానసిక, సామాజిక ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి.

ఆట గెలుపోటములకు మించినది

MEER VERHALEN VAN Suryaa Sunday

Listen

Translate

Share

-
+

Change font size