Prøve GULL - Gratis

చిన్నారుల వృథా ఖర్చును ఆపేదెలా?

Grihshobha - Telugu

|

August 2023

భవిష్యత్తుకు ఉపయోగపడే ఈ లక్షణాన్ని చిన్నప్పటి నుంచే నేర్పించండి

- - రాజేశ్

చిన్నారుల వృథా ఖర్చును ఆపేదెలా?

డబ్బు పొదుపు చేయడం ఒక మంచి అలవాటు.

భవిష్యత్తుకు ఉపయోగపడే ఈ లక్షణాన్ని చిన్నప్పటి నుంచే నేర్పించండి

మీ పిల్లలకు 'కాకి-దాహం' కథను మీరు చెప్పే ఉంటారు. ఇందులో ఒక కాకికి దాహం వేసి కుండ దగ్గరికి వస్తుంది. అందులో నీళ్లు తక్కువగా ఉండడంతో, గులక రాళ్లు వేసి నీళ్లు పైకి వచ్చేలా చేస్తుంది.తర్వాత తాగుతుంది. ఇదీ 'పొదుపు కథ' లాంటిదే.డబ్బు సంపాదించడం చాలా కష్టమే కానీ పొదుపు ప్రాముఖ్యత తెలుసుకుంటే అది భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. మీరు వేసే చిన్న అడుగు దీర్ఘకాలంలో ఒక పెద్ద విజయంగా మారుతుంది.

మీ పిల్లలు బాల్యంలోనే పొదుపు ప్రాముఖ్య తను అర్థం చేసుకుంటే వారు తమ జీవితంలో అతి పెద్ద సమస్యలను సైతం సులభంగా ఎదుర్కో గల్గుతారు. చిన్నప్పటి నుంచే పొదుపు అలవాటు నేర్పించే తల్లిదండ్రులు వారి భవిష్యత్తును సురక్షి తంగా తీర్చిదిద్దుతారు. పొదుపు ప్రాముఖ్యతను తెలుసుకున్నాకే వారికి డబ్బు విలువ తెలిసి వస్తుంది. ఖర్చు చేసే పద్ధతిలో భారీ మార్పు కని పిస్తుంది. కాబట్టి మీ పిల్లలకు ఈ రోజు నుంచే పొదుపు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం మొదలుపెట్టండి. పెద్ద మొత్తంలో నగదు ఎప్పుడు ఎలా అవసరపడుతుందో ఎవరికీ తెలియదని ఆ సమయంలో ఎవరినీ చేయి చాచి అడగ లేమని, పొదుపు చేసిన డబ్బే ఆదుకుంటుందని చెప్పండి.పెద్ద మొత్తంలో నగదు పొదుపు చేసి ఉంచుకోవడం చాలా అవసరమని వారికి వివరించండి.

డబ్బు విలువ తెలియచెప్పండి

ప్రస్తుత ద్రవ్యోల్బణ యుగంలో పిల్లలకు డబ్బు విలువ తెలవడం చాలా అవసరం. డబ్బు సంపాదించడానికి రోజంతా కష్టపడతామని వారికి తెలియచెప్పాలి. వారు అడిగిన దాని కోసం మీరు రోజుకు ఎన్ని గంటలు పని చేస్తారో అర్థమయ్యేలా చెప్పి అనవసర ఖర్చు అప్పుల ఊబిలోకి తీసుకు వెళ్తుందని వివరించాలి.

అడిగిన ప్రతి కోరికను తీర్చవద్దు

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారు అడిగే ప్రతి కోరిక తీర్చాలనుకుంటారు. కానీ మీ పిల్లలు క్రమశిక్షణతో ఉండాలని, కష్టపడి సంపాదించిన డబ్బు విలువను అర్థం చేసుకోవాలని మీరు కోరుకుంటే, వారు అడిగే ప్రతి చిన్నా పెద్ద కోరికను వెంటనే తీర్చడం వారి భవిష్యత్తుకు మంచిది కాదు.

FLERE HISTORIER FRA Grihshobha - Telugu

Grihshobha - Telugu

Grihshobha - Telugu

రహస్యంగా నిశ్చితార్థం

'గీతగోవిందం' సినిమాలో రష్మిక మందన్న ఏ ముహూర్తాన హీరో విజయ్ దేవరకొండతో చూపులు కలిపిందో కానీ అప్పట్నుండీ ఇద్దరూ స్వచ్ఛమైన ప్రేమికులుగా నిలిచారు.

time to read

1 min

November 2025

Grihshobha - Telugu

Grihshobha - Telugu

చిరంజీవికి నయనతార ప్లస్ అవుతుందా?

అర్చన సమర్పణలో సాహు గారపాటి, సు స్మిత కొణిదెల నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు'లో హీరోకి శశిరేఖ పాత్రలో నయనతారను పరిచయం చేస్తూ ఫస్ట్లుక్ పోస్టర్ వదిలారు.

time to read

1 min

November 2025

Grihshobha - Telugu

Grihshobha - Telugu

బాలీవుడ్లో

మెరిసే తారలు !

time to read

1 min

November 2025

Grihshobha - Telugu

Grihshobha - Telugu

'రాజాసాబ్'

ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ కామెడీ సినిమా 'రాజాసాబ్'.

time to read

1 min

November 2025

Grihshobha - Telugu

Grihshobha - Telugu

మరాఠీ చిత్రం: “బిన్ లగ్నోచీ గోష్ట్"

ఆదిత్య ఇంగలే దర్శకత్వం వహించిన 'బిన్ లగ్నాచీ గోష్ట్' (ఎ స్టోరీ వితౌట్ ఎ వెడ్డింగ్) ప్రేమ, సంబంధాలపై నేటి తరం ఆధునిక దృక్పథాన్ని ప్రదర్శిస్తుంది.

time to read

1 min

November 2025

Grihshobha - Telugu

Grihshobha - Telugu

సినీ ఇంటర్వ్యూ

తెరపై హీరో, హీరోయిన్లను చూపించడంలోనీరజ అందె వేసిన చేయి. నీరజ అమెరికాలో ఫ్యాషన్ కోర్సులు, అభినయంలో శిక్షణ నేర్చుకుని తిరిగి వచ్చి సోదరుడు కోన వెంకట్ తో 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాలో తొలిసారి నితిన్ కు స్టైలిస్ట్లగా పని చేసింది.

time to read

2 mins

November 2025

Grihshobha - Telugu

Grihshobha - Telugu

మలయాళ చిత్రం: “పాతి రాత్రి”

ఇటీవల విడుదలైన 'పాతి రాత్రి' మలయాళ చిత్రం ఒక క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమాలో నవ్య నాయర్, సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

time to read

1 min

November 2025

Grihshobha - Telugu

Grihshobha - Telugu

ఆహారపు అలవాట్లు

పొట్టా...? అది చెత్త బుట్టా?

time to read

3 mins

November 2025

Grihshobha - Telugu

Grihshobha - Telugu

తమిళ చిత్రం: "డ్యూడ్”

రెండు రోజుల్లో 45 కోట్లు వసూలు చేసిన సినిమా. అక్టోబర్లో విడుద లైన తమిళ చిత్రాల్లో ఒకటి 'డ్యూడ్'. కోలీవుడ్ నటుడు ప్రదీప్ రంగనాధన్ ఈ దీపావళి బరిలో 'డ్యూడ్ తో ముందుకు వచ్చాడు.

time to read

1 min

November 2025

Grihshobha - Telugu

Grihshobha - Telugu

టాలీవుడికి రుక్మిణి వసంత్

బెంగళూరుకు చెందిన రుక్మిణి తండ్రి అశోక చక్ర అవార్డు అందుకున్న మొదటి కల్నల్ వసంత్ వేణుగోపాల్ 2007లో ఉరిలో మార్టిన్ అయ్యారు.

time to read

1 min

November 2025

Translate

Share

-
+

Change font size