Prøve GULL - Gratis

ప్రత్యుపకారం నిష్పలం

Vaartha-Sunday Magazine

|

September 15, 2024

ప్రత్యుపకారం నిష్పలం

- కస్తూరి మురళీకృష్ణ

ప్రత్యుపకారం నిష్పలం

అది శాస్త్ర జేతవనంలో విహరిస్తున్న కాలం.

ఆ సమయంలో భిక్షువులతో ప్రసంగిస్తూ, దేవదత్తుడి కృతఘ్నత గురించి చెప్పారు.

"దేవదత్తుడు ఇప్పుడే కాదు, పూర్వం కూడా కృతఘ్నుడే" అన్నారు.

భిక్షువులందరికీ ఆ పూర్వ గాథ వినాలన్న కుతూహలం కలిగింది. వారు కుతూహలాన్ని వ్యక్తం చేశారు.

వారి అభ్యర్థనను మన్నించి శాస్త్ర పూర్వగాథను చెప్పటం ప్రారంభించాడు.

బ్రహ్మదత్తుడు వారణాసిలో రాజ్యం చేస్తున్న కాలం అది.

ఆ సమయంలో బోధిసత్వుడు హిమాలయ ప్రదేశంలో 'చిరతపక్షి' కడుపులో పుట్టాడు. ఒకరోజు ఒక సింహం జంతువును చంపి మాంసం తినేటప్పుడు ఓ ఎముక దాని గొంతులో గుచ్చుకుంది. అక్కడ చిక్కుబడి పోయింది. "ఫలితంగా దాని గొంతు వాచిపోయింది. గొంతు వాచిపోవటంతో అది ఆహారం స్వీకరించలేకపోయింది.

ఆహారం స్వీకరించలేకపోవటంతో బలహీనమైపోయింది. ఓ వైపు గొంతులో బాధ, మరోవైపు బలహీనమైపోవటంతో అల్లల్లాడిపోయింది సింహం.

సింహం బాధను చెట్టుపై నుండి పక్షి గమనించింది. ఉండబట్టలేక అడిగింది.

"ఏమిటీ బాధ?” జరిగింది తెలిపింది.

పక్షి జాలి చూపించింది. "నీ బాధ నుంచి నేను నిన్ను విముక్తం చేయగలను. కానీ నాకు భయం వేస్తోంది".

"ఎందుకు భయం?"

"నేను ఎముకను నీ గొంతులోంచి లాగాలంటే నీ నోట్లోకి ప్రవేశించాలి. కానీ నీ నోట్లో అడుగు పెట్టాలంటే భయంగా ఉంది. నీ నోట్లోకి ప్రవేశించగానే నువ్వు నోరు మూస్తే?"

"భయం లేదు. గొంతులో ఎముక అడ్డు పడి బతకలేక... చావలేక ఏడుస్తున్నాను. అలాంటిది ఎముకను గొంతులోంచి తీయగానే నిన్ను తింటానా? భయపడకు. నా ప్రాణాలు కాపాడు.. నన్ను రక్షించు" అని బతిమిలాడింది సింహం.

పక్షి ఆలోచించింది. సింహం నోరు మూయకుండా దాన్ని పడుకోమని, నోరు తెరిపించి, పై పెదవి, కింది పెదవికి మధ్య ఒక కర్ర నుంచింది. కర్ర వల్ల పక్షి నోట్లో ఉన్నప్పుడు సింహం నోరు మూయలేదు.

పక్షి వేగంగా సింహం నోట్లో దూరి ఎముకను లాగింది. దాని నోట్లోంచి బయటకు పోతూ కర్రను తన్ని ఎగిరిపోయింది.

సింహం ఆరోగ్యం బాగయింది. మళ్లీ అది వేటాడటం ఆరంభించింది. సింహాన్ని పరీక్షించాలని పక్షికి అనిపించింది. సింహం ఓ జంతువును చంపి తింటున్నప్పుడు చెట్టు మీద నుంచి అడిగింది.

"ఓ సింహమా, నాకు బాగా ఆకలేస్తోంది. నువ్వు తిని నాకు కొంచెం మిగల్చవా?" సింహం తలెత్తి కూడా పక్షి వైపు చూడలేదు.

FLERE HISTORIER FRA Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size