Prøve GULL - Gratis

జగమంతా రామమయం

Suryaa Sunday

|

April 06, 2025

చైత్ర శుద్ధ నవమి నాడు కౌసల్య గర్భమున శ్రీరామచంద్రుడుద్భవించినట్లు రామాయణాది ప్రసిద్ధ గ్రంథములు చెప్పుచున్నవి.

- కొలనుపాక కుమారస్వామి, 9963720669

జగమంతా రామమయం

చైత్ర శుద్ధ నవమి నాడు కౌసల్య గర్భమున శ్రీరామచంద్రుడుద్భవించినట్లు రామాయణాది ప్రసిద్ధ గ్రంథములు చెప్పుచున్నవి. శ్రీరామనవమి చైత్ర శుద్ధ నవమికి శ్రీ రామనవమియని ప్రసిద్ధి.భారతీయులకిది యొక పర్వదినము. నవమినాడు మధ్యాహ్న సమయమున పందిళ్ళ క్రింద సీతాకళ్యాణ మహోత్సవములు కూడా జరిపి భక్తులు కృతస్థులయినట్లు భావింతురు. ప్రతి సంవత్సరము సామాన్యము.ముఖ్యంగా సీతాకళ్యాణ మొనర్చుట తెలుగు వారికొక ప్రత్యేకత.

image“యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చమమహీతలే తనద్రామాయణ కథలోకేషు ప్రచరిష్యతిక”

(ఈ లోకంలో కొండలూ, నీళ్లూ ఉన్నంత కాలం రామాయణ కథ వ్యాప్తిలో ఉంటుంది) అన్న మహర్షి వాక్యం నిత్యసత్యం అయింది. వాల్మీకి వల్ల ప్రభావితుడు కాని భారతీయ రచయిత ఉండడు.

వ్యతిరేకించిన వారు సహితం రామాయణ ప్రభావితులే. ఆ మహర్షి సృష్టించిన కావ్యం ఉండబట్టి కద విమర్శించింది.

వాల్మీకి రాముణి మానవ మాత్రునికిగానే సృష్టించాడు. రామునిలో మానవులలోని బలము, బలహీనతలూ అన్నీ కల్పించాడు. ఆదర్శ మానవునికి ఉండే లఓణాలు ఆత్మ విశ్వాసం, దృఢసంకల్పం, నిరంతర యత్నం, ప్రేమాభిమానాలు కొల్లలుగా కల్పించాడు.

రామాయణం మానవగాథ ఒక ఆదర్శ పురుషఉని ఒక ఆదర్శనారీమణి కథ. రామాయణం సీతాయాశ్చరతంమవాత్-అది సీథ కథ. వాల్మీకికి సీత అతి ప్రియం అయిన పాత్ర. సీత యోనిజ కావడం సహితం వాల్మీకికి సహించలేదు. ఆమెను ఆ యోనిజను చేశాడు. ఆమెతోనే అనేక ముత్యాల మాటలు అనిపించాడు. రామాయణం సాకల్యంగా అధ్యయనం చేసిన వారు సీత విషయంలో ఆదరం-అభిమానం-భక్తి పెంచుకుంటారు. వాల్మీకి స్త్రీ పాత్రలను మలిచిన తీరు అపూర్వం.

రామాయణ కథ ఒక మలుపునకు మంథర మరొక మలుపునకు శూర్పణఖ కారకులు. తార తన చాకచక్యంతోనూ శబరి తన భక్తి భావంతోనూ మనసు మురిపిస్తాయి.

అనన్యారాఘవేదహం-భాస్కరేణ ప్రభాయథా" రాముడు నేను సూర్యుడు వెలుగు వలె వేరు కాము అంటుంది సీత. విచ్చిన్నమై మృగ్యంకనున్న కుటుంబ వ్యవస్థ ఉన్న నేటి దశలో రామాయణ సందేశం అమృతప్రాయం.

“దైవసంపాదితో దోషామానుషేణమయా జీవితః" దైవం కల్పించిన దోషాన్ని మనిషిగా నేను జయించాను అంటాడు రాముడు. "ఆత్మావంమానుషం మన్యేరామం దశరథత్మజం" నేను మనిషిని, రాముణ్ణి, దశరథుని కొడుకును అంటాడు.

FLERE HISTORIER FRA Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

KISHKINDHAPURI REVIEW

KISHKINDHAPURI REVIEW

time to read

2 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..

రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..

time to read

1 mins

September 21, 2025

Suryaa Sunday

బుడత

find the way

time to read

1 min

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

నవదుర్గ దేవీ ఆరాధన :

ఆధ్యాత్మిక వృద్ధికి మరియు స్వీయ - ఆవిష్కరణకు మార్గం

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

కొత్త భారతం కోసం ఏఐ పురోగతి శక్తివంతం

భారతదేశం ఎల్లప్పుడూ తన నిర్ణయాత్మక క్షణాలలో - ధైర్యంగా, స్థిరత్వంతో, మరియు 1.4 బిలియన్ కలలను ఒకచోట చేర్చే సమిష్టి ఆత్మతో ఎదిగింది.

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ఆదివారం అనుబంధం

ఆదివారం అనుబంధం

time to read

1 min

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి

బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

చైర్మన్ ముఖాముఖి

చైర్మన్ ముఖాముఖి

time to read

2 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

కోరిన కోర్కెలు తీర్చే కోటదుర్గమ్మ

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వెలసిన వెలసిన ఉ త్తరాంధ్ర కొంగుబంగారమైన శ్రీ శ్రీ కోట దుర్గ అమ్మవారి దేవాలయం చాలా పురాతనమైనది. ఎవరో ప్రతిష్ట చేసింది కాదు..

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

Beauty REVIEW

Beauty REVIEW

time to read

2 mins

September 21, 2025

Listen

Translate

Share

-
+

Change font size