कोशिश गोल्ड - मुक्त
వీళ్ళ విలువ భగవంతుడికే తెలుస్తుంది!
Sri Ramakrishna Prabha
|May 2024
ఇంజినీరింగ్ చదివిన కొడుకును వెంటబెట్టుకొని ఓ తల్లి ఈమధ్య మఠానికి వచ్చింది.
ఇంజినీరింగ్ చదివిన కొడుకును వెంటబెట్టుకొని ఓ తల్లి ఈమధ్య మఠానికి వచ్చింది. ఆమె సమస్య ఏమిటంటే ఆ పిల్లవాడు ఇంజినీరింగ్ పూర్తిచేశాడు గానీ, ఏ ఉద్యోగమూ చేయటం లేదు. ఎప్పుడూ ఇంట్లోనే ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఎవరితోనూ మాట్లాడడు. స్నేహితులు ఎవరూ లేరు. తన వయసు వాళ్ళతో కాక, చిన్న పిల్లలతో మాట్లాడటానికి, వారితో ఉండటానికి ఎక్కువ ఇష్టపడతాడు. 'మా అబ్బాయికి స్ఫూర్తినిచ్చి ఉద్యోగం చేసేటట్లు మీరేమన్నా చేయండి' అని ఆమె విన్నపం.
కొద్దిసేపు ఆ అబ్బాయితో మాట్లాడిన తరువాత తెలిసిందేమంటే, అతడికి పెద్ద కోర్కెలు ఏమీ లేవు.తెలివైనవాడు, బాగానే చదివాడు. తన సబ్జెక్టులో కూడా మంచి పట్టు ఉంది. కానీ, ఏ కంపెనీలోనూ మిగతావారితో కలిసి పనిచేయలేడు. ఆ యువకుడు చాలా సున్నిత మనస్కుడు, పైగా మితభాషి. ఎవరినీ బాధపెట్టని స్వభావం కలవాడు, ఒక మనిషిగా ఉత్తముడు. కానీ తన స్వభావంలో, తన వ్యక్తిత్వంలో ఉన్న చాలా లక్షణాలను చంపుకుంటే కానీ నేటి ప్రైవేట్ రంగంలోని ఉపాధులలో ఇమడలేని పరిస్థితి.తన మనస్తత్వానికి నేటి మనుషుల స్వభావం, పని సంస్కృతి సరిపోవటం లేదు. అక్కడ తనకు ఇష్టం లేకపోయినా కొన్ని చేయాలి. నలుగురితో నారాయణ అనాలి. ఇవేవీ ఆ అబ్బాయికి ఇష్టంలేదు. అందుకే తనతో తాను ఉండటానికి ఇష్టపడుతున్నాడు. తల్లితండ్రులు కూడా తనను అర్థం చేసుకోరనీ, సమాజానికి భయపడి తనను బలవంతంగానైనా ఉద్యోగంలోకి పంపించే ప్రయత్నం చేస్తారనీ, వారి ముందు కూడా మనసు విప్పటం ఆ యువకుడికి ఇష్టంలేదు.
यह कहानी Sri Ramakrishna Prabha के May 2024 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Sri Ramakrishna Prabha से और कहानियाँ
Sri Ramakrishna Prabha
సూక్తి సౌరభం
అల్పబుద్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పు తినెడి కుక్క చెఱకు తీపెరుగునా? విశ్వదాభిరామ వినుర వేమ!
1 min
November 2025
Sri Ramakrishna Prabha
శ్రీరామకృష్ణులు
శ్రీరామకృష్ణులు
1 min
November 2025
Sri Ramakrishna Prabha
గ్రంథ పరిచయం
వివాహం దివ్యత్వ సాధనం
1 min
July 2025
Sri Ramakrishna Prabha
ఆత్మ ఎగసే అనంతాకాశంలో...
రవీంద్ర గీతాంజలి - చైతన్య
1 mins
July 2025
Sri Ramakrishna Prabha
సుబోధ
సుబోధ
1 min
July 2025
Sri Ramakrishna Prabha
అపూర్వ శిష్యుడు అలౌకిక గురువు
భారతదేశం సనాతన వైభవాన్ని కోల్పోయి పరాయిపాలనలో నిస్సహాయంగా ఆక్రందిస్తున్న కాలమది.
3 mins
July 2025
Sri Ramakrishna Prabha
మతమే మన ఆయువుపట్టు...
ధీరవాణి
1 min
July 2025
Sri Ramakrishna Prabha
గురుభక్తి గురుసేవ గురుకార్యం
మన సంస్కృతిలో గురువు స్థానం అత్యున్నతమైనది. అలాంటి గురువును ఆశ్రయించి, సేవించి, విద్యలలోకెల్లా అత్యున్నతమైన బ్రహ్మవిద్యను అభ్యసించమని వేదోపనిషత్తులు ప్రబోధించాయి.
3 mins
July 2025
Sri Ramakrishna Prabha
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!
1 min
May 2024
Sri Ramakrishna Prabha
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
ఆ౦ధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.
1 min
May 2024
Listen
Translate
Change font size

