कोशिश गोल्ड - मुक्त
అడుగు జాడలు...
Sri Ramakrishna Prabha
|January 2024
దివ్యజనని శ్రీశారదాదేవి ప్రత్యక్ష శిష్యులైన స్వామి శారదేశానందజీ (1892-1988) రామకృష్ణ సంఘంలో ఎంతో గౌరవాన్నీ, ప్రేమాభిమానాలనూ చూరగొన్న గొప్ప సన్న్యాసి.
-
దివ్యజనని శ్రీశారదాదేవి ప్రత్యక్ష శిష్యులైన స్వామి శారదేశానందజీ (1892-1988) రామకృష్ణ సంఘంలో ఎంతో గౌరవాన్నీ, ప్రేమాభిమానాలనూ చూరగొన్న గొప్ప సన్న్యాసి.ఆయన తపోమయ జీవితం, సేవాదర్శాలు అనేకమంది సాధువులకూ, భక్తులకూ స్ఫూర్తిమంతంగా నిలిచాయి. ఆధ్యాత్మిక సాధకులకు, ముఖ్యంగా రామకృష్ణ వివేకానంద భావధారలో ఉన్నవారికి ఆ మహనీయుని జీవిత విశేషాలు, ఆయన చేసిన సూచనలు ఉపయుక్తంగా ఉంటాయని తలచి, 2024 జనవరి సంచిక నుంచి వాటిని ధారావాహికగా ప్రచురిస్తున్నాం.
స్వామి శారదేశానంద నిరాడంబరమైన సాధు సన్న్యాసి.మౌనమే ఆయన ఆహార్యం. చెరగని చిరునవ్వు, వదనంలో నిర్మలమైన ప్రశాంతతే ఆయన ఆస్తి. తొంభై ఆరేళ్ళ తన జీవితంలో దాదాపు డెబ్బై సంవత్సరాలు ఆ 'మూర్తిత్రయం' నామస్మరణే తన శ్వాస, జీవిత పరమగమ్యంగా జీవించిన ధన్యజీవి. సహేతుక దృష్టి, వాస్తవిక కోణంలో ఆలోచించే ఈ సాధు పుంగవుడు 'దైనందిన జీవితంలో మానవుడు ఎదుర్కొనే మానసిక సమస్యలన్నింటికీ ఆధ్యాత్మిక జీవన విధానమే పరిష్కారం' అని మార్గం చూపిన మహనీయుడు. అనంతమైన ఆధ్యాత్మిక పయనంలో ముందు పడేది ఒక్క అడుగే! అటువైపు అడుగులు వడివడిగా ముందుకు సాగాలంటే ఇష్టదైవం పట్ల భక్తి, నమ్మకం, అపారమైన విశ్వాసంతోపాటు అందుకు అనుగుణంగా తన
జీవన విధానమూ ఉండాలని ఆచరణాత్మకంగా నిరూపించిన ధన్యజీవి స్వామి శారదేశానంద. వారు అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ ధర్మబద్ధమైన, సత్యవ్రతమైన జీవితాన్ని గడుపుతూ రామకృష్ణులవారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు.యువప్రాయంలోనే ఆయన ఆ మూర్తిత్రయం వైపు వేసిన అడుగులు ఆయనను ఓ మహనీయునిగా తీర్చిదిద్దాయి.
రామకృష్ణ సంఘంలో ఆయన నిరాడంబర జీవన విధానం, ఆచరించిన విధానాలు ఎంతోమంది యువ సన్న్యాసులకే కాదు భక్తులకు సైతం మార్గదర్శనం చేస్తాయి.
రామకృష్ణ సంఘం వైపు పడిన అడుగులు
यह कहानी Sri Ramakrishna Prabha के January 2024 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Sri Ramakrishna Prabha से और कहानियाँ
Sri Ramakrishna Prabha
సూక్తి సౌరభం
అల్పబుద్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పు తినెడి కుక్క చెఱకు తీపెరుగునా? విశ్వదాభిరామ వినుర వేమ!
1 min
November 2025
Sri Ramakrishna Prabha
శ్రీరామకృష్ణులు
శ్రీరామకృష్ణులు
1 min
November 2025
Sri Ramakrishna Prabha
గ్రంథ పరిచయం
వివాహం దివ్యత్వ సాధనం
1 min
July 2025
Sri Ramakrishna Prabha
ఆత్మ ఎగసే అనంతాకాశంలో...
రవీంద్ర గీతాంజలి - చైతన్య
1 mins
July 2025
Sri Ramakrishna Prabha
సుబోధ
సుబోధ
1 min
July 2025
Sri Ramakrishna Prabha
అపూర్వ శిష్యుడు అలౌకిక గురువు
భారతదేశం సనాతన వైభవాన్ని కోల్పోయి పరాయిపాలనలో నిస్సహాయంగా ఆక్రందిస్తున్న కాలమది.
3 mins
July 2025
Sri Ramakrishna Prabha
మతమే మన ఆయువుపట్టు...
ధీరవాణి
1 min
July 2025
Sri Ramakrishna Prabha
గురుభక్తి గురుసేవ గురుకార్యం
మన సంస్కృతిలో గురువు స్థానం అత్యున్నతమైనది. అలాంటి గురువును ఆశ్రయించి, సేవించి, విద్యలలోకెల్లా అత్యున్నతమైన బ్రహ్మవిద్యను అభ్యసించమని వేదోపనిషత్తులు ప్రబోధించాయి.
3 mins
July 2025
Sri Ramakrishna Prabha
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!
1 min
May 2024
Sri Ramakrishna Prabha
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
ఆ౦ధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.
1 min
May 2024
Listen
Translate
Change font size
