చెక్కు చెదరని 'ఉక్కు' సంకల్పం!
Vaartha-Sunday Magazine
|February 02, 2025
'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' అనే నినాదం తెలుగు వారిలో ఏనాడు ఊపిరి పోసుకుందో కానీ దానికి ఈ భూమి ఉన్నంతవరకు చావే ఉండదని తేలిపోయింది.
'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' అనే నినాదం తెలుగు వారిలో ఏనాడు ఊపిరి పోసుకుందో కానీ దానికి ఈ భూమి ఉన్నంతవరకు చావే ఉండదని తేలిపోయింది. భారతీయ ఉక్కు రంగానికే తలమానికంగా నిలబడగల సత్తా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం ఎన్నో ఒడుదొడుకులను తట్టుకొని ఇప్పుడు మళ్లీ తలెత్తుకుని నిలబడే స్థాయికి చేరుకుంది.
నిజానికి ఉక్కు ఫ్యాక్టరీ పుట్టుకే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజక వర్గ దళిత ఎంఎల్ఎ అమృతరావు నిరాహార దీక్షా ఫలం. మరి కొందరి త్యాగ ఫలం. ఉక్కు ఫ్యాక్టరీ సాధన ఉద్యమంలో 17 మంది అసువులు బాసారు. వారి త్యాగం ఈ తెలుగు నేల మరువదు. ఆరు దశాబ్దాల నాడు అక్టోబరు 14న అమృతరావు చేసిన శాంతియుత నిరసన నిరాహార దీక్ష ఉవ్వెత్తున ఎగసి తీవ్ర ఉద్యమం అయింది. పర్యవసానంగా, ఆయన 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' నినాదానికి సార్థకత లభించింది. అదే నినాదం ఇప్పటికే ఆంధ్రా ప్రజానీకంతో మమేకం అయింది.అదే ఆనాడైనా, ఈనాడైనా పెద్ద ఉద్యమానికి దారితీసింది.అప్పటి విశాఖ పట్టణం లోక్సభ సభ్యుడు తెన్నేటి విశ్వనాథం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కమిటీలు ఏర్పడగా, పట్టణాలలో నిరాహార దీక్షా శిబిరాలు ఏర్పాటయ్యాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం నేతృత్వంలో విద్యార్థులంతా తీవ్ర నిరసనల బాటపట్టారు. 1966 నవంబర్ 3న, కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఈ ప్రతిపాదనను అంగీకరించింది. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి చార్టర్డ్ విమానంలో విశాఖపట్నం చేరుకుని, అమృతరావుకు ఒక గ్లాసు నారింజ రసం అందించి, నిరాహార దీక్షను విరమింపచేసారు.
నాటి ప్రధాని ఇందిరా గాంధీ లోక్సభలో దేశంలోని ఐదవ ఉక్కు కర్మాగారాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
విశాఖ ఉక్కు కర్మాగారం గురించి చెప్పుకోవాలంటే
నూటికి నూరు శాతం 100 కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ. సాలీనా 73 లక్షల టన్నుల ద్రవ ఉక్కు తయారీ సామర్థ్యంతో ఉన్న ఈ సంస్థకు రూ.7,686,24 కోట్ల ఆస్తులు, రూ.26,114.92 కోట్ల అప్పులు ఉన్నాయి. 2023 మార్చి 31 నాటికి సంస్థ నెట్వర్త్ మైనస్ రూ.4,538 కోట్లకు పడిపోయింది. బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు కూడా చెల్లించ లేని పరిస్థితి ఉండ టంతో, మూలధన వ్యయం కోసం బ్యాంకులు రుణాలివ్వడం మానేసినందున కొత్తగా అపు పుట్టే పరిస్థితి లేదు.
ప్రైవేటీకరణ 23 దిశగా అడుగులు
यह कहानी Vaartha-Sunday Magazine के February 02, 2025 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Vaartha-Sunday Magazine से और कहानियाँ
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size

