Facebook Pixel ఈనెల 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు | Telugu Muthyalasaraalu - culture - Lisez cet article sur Magzter.com

Essayer OR - Gratuit

ఈనెల 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

Telugu Muthyalasaraalu

|

Telugu muthyalasaralu

19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం,. 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం

ఈనెల 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం,. 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం

తిరుమల : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు.ప్రధానంగా అక్టోబరు 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం, అక్టోబరు 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 నుండి 12 గంటల వరకు జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వైశిష్ట్యం ఇలా ఉంది.

అంకురార్పణం(14-10-2023)(రాత్రి 7 నుండి 9 గంటల వరకు) వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాహనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులవారిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు చేపడతారు. ఆ తరువాత అంకురార్పణం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బంగారు తిరుచ్చి ఉత్సవం (15-10-2023) (ఉదయం 9 గంటలకు) శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు.

పెద్దశేషవాహనం(15-10-2023) (రాత్రి 7 గంటలకు) మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహిస్తారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు.రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు, భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశు త్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.

చిన్నశేషవాహనం(16-10-2023)(ఉదయం 8 గంటలకు)

PLUS D'HISTOIRES DE Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

గ్రామాలలో బాల్య వివాహాలు జరగకుండా చూడవలసిన బాధ్యత పొదుపు మహిళా సంఘాల పై ఉన్నది.

time to read

3 mins

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

వడ్డేపల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు - ఘనంగా విరూపాక్షమ్మ తిరునాళ్లు

పూతలపట్టు మండలం వడ్డేపల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు - ఘనంగా విరూపాక్షమ్మ తిరునాళ్లు నిర్వహించగా టీటీడీ ఆధ్వర్యంలో అన్నమయ్య సంగీత విభావరి ఆకట్టుకుంది.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

మీ కోసంకాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి

ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూక్లినిక్ కార్యక్రమం నిర్వహణ రెవెన్యూ పరిధిలోని అన్ని ఫిర్యాదుల పరిష్కార అధికారుల కార్యాలయాలలో \"మీకోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1100” అనే బ్యానర్ ను ఏర్పాటు చేయాలి.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్

వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ మరో ఏడాది (2026-27) పొడిగింపు

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

VB-G RAM- G చట్టం పరిధిలో 125 రోజుల పనిదినాల లక్ష్యంతో.....

(ముత్యాలసరాలు) గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న VB-G RAM G చట్టం పరిధిలో 125 రోజుల పనిదినాల లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను చిత్తూరు జిల్లా కలెక్టర్ ఈరోజు ఆవిష్కరించారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

కవయిత్రి మొల్ల ఆదర్శప్రాయురాలు: జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్.

చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్డీ) బి. మోహన్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కవయిత్రి మొల్ల జయంతి వేడుకల్లో డిఆర్డీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

కోరిన కోర్కేలు తీర్చే కొంగుబంగారం శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం

శ్రీశ్రీశ్రీమూర్తి స్వామి, రేణిగుంట పట్టణంలోని రైల్వేగేటు వద్ద ఉన్న శ్రీరాజరాజేశ్వరి జ్ఞానపీఠం వ్యవస్థాపకులు, పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మూర్తి స్వామి వారిని కురుక్షేత్రం దినపత్రిక ఎడిటర్, దినపత్రిక ప్రతినిధులు కలిశారు. అనంతరం ఆయన కురుక్షేత్రం దినపత్రిక యాజమాన్యానికి, ప్రతినిధులకు అమ్మవారి ప్రత్యేక దర్శనం చేయించి హారతులు సమర్పించారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

ఆడపిల్లల చదువు హక్కు మాత్రమే కాదు, సమాజ అభివృద్ధి దిశగా మేలిపునాది

చిత్తూరులోని సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల 44 వ వార్షికోత్సవము కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పూర్వ ఉపరాష్ట్రపతి కళాశాల ప్రాంగణంలోని నూతన భవనాల ప్రారంభోత్సవం

time to read

3 mins

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

చిత్తూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లు సాధారణంగానే సరఫరా కొనసాగుతుంది ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు :- జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. రాజేంద్రన్

చిత్తూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లు సాధారణంగానే సరఫరా కొనసాగుతుందని ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ రాజేంద్రన్ గురువారం ప్రకటనలో తెలిపారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

మన తెలుగు పండుగ "ఉగాది"

పండుగంటేనే విజయానికి గుర్తు. ధర్మానికి ఆధారం, వారసత్వానికి రూపం. సంస్కృతి సాంప్రదాయలకు నెలవు. అంతేకాక పండుగంటేనే దూరదృష్టి. ఆరోగ్యసౌభాగ్యాలకు సంకేతమై నిలుస్తుంది.

time to read

2 mins

telugu muthyalasaraalu

Translate

Share

-
+

Change font size