Versuchen GOLD - Frei
త్వరలోనే కేబినెట్ విస్తరణ!
Vaartha
|June 08, 2024
అధిష్టాన పెద్దలతో భేటీకి ఢిల్లీ వెళ్లిన సిఎం రేవంత్ రాహుల్ను కలిసి అభినందించడానికి రాష్ట్ర నేతల క్యూ
-
నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూడా చర్యలు
ప్రభాతవార్త ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్, జూన్ 7: టిపిసిసి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. శనివారం ఢిల్లీలో జరిగే సిడబ్ల్యుసీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అంతేకాకుండా ఇండియా పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గా రాహుల్ గాంధీని ఎన్నుకోవడంతో పాటు, ఆయనను కలిసి అభినందించేందుకు సిఎం రేవంత్ రెడ్డి ముందు రోజే ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పెద్దలతో సిఎం సమావేశ అవకాశం ఉన్నట్లుతెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. తాజాగా లోక్సభ ఎన్నికలు ముగియడంతో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీ, పిసిసి నూతన అధ్యక్షుడి ఎంపిక తదితర విషయాలపై చర్చిస్తారని సమాచారం. సిడబ్ల్యుసి సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్నీ కూడా పాల్గొననున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు వంశీచందర్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ హాజరుకానున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియడంతో రాష్ట్ర సర్కార్ ఇచ్చిన హామీ మేరకు పార్టీ కోసం పని చేసిన నాయకులకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టే పనిలో పడింది. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొ చ్చేందుకు పార్టీ నాయకులు అవిశ్రాంతంగా పని చేశారు. అభ్యర్థుల గెలుపునకు కొంత మంది పని చేస్తే. మరికొందరు నాయకులు పార్టీ కార్యక్ర మాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేశారు. ఇంకొంత మంది శాసనసభ టిక్కెట్లు ఆశించి, నిరాశకు గురైననాయకులు కూడా ఉన్నారు. అందులో భాగంగానే రేవంత్
Diese Geschichte stammt aus der June 08, 2024-Ausgabe von Vaartha.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Vaartha
Vaartha
ప్రపంచ ఛాంపియన్..ఆర్చర్ అదితికి టైటిల్
ప్రపంచ ఛాంపియన్ ఆర్చర్ అదితి స్వామి టైటిల్ గెలుచుకుంది. అలాగే ఈతగాడు శ్రీహరి నటరాజ్ తొమ్మిది స్వర్ణాలతో ముగించాడు
1 min
November 30, 2025
Vaartha
ఆసియా కప్ క్వాలిఫయర్స్లో బ్లూ కోలుక్కు తొలి ఓటమి
లెబనాన్ 2-0 తేడాతో విజయం
1 min
November 30, 2025
Vaartha
మోడీ ఇంటర్నేషనల్ ఫైనల్లోకి ట్రీసా-గాయత్రి జోడీ
ఉన్నతి, తన్వి ఓటమి
1 min
November 30, 2025
Vaartha
మరింత విషమించిన ఖలీదాజియా ఆరోగ్యం
బంగ్లాకు రావాలని ఉన్నా రాలేకపోతున్నా.. జియా కుమారుడు తారిక్ రెహమాన్
1 min
November 30, 2025
Vaartha
మీషో సహా మార్కెట్లకు వస్తున్న 11 ఐపిఒలు!
ప్రైమరీ మార్కెట్లో డిసెంబరు తొలి వారంలోనే భారీ సంఖ్యలో ఐపిఒలు సందడిచేయనున్నాయి.
1 min
November 30, 2025
Vaartha
నింగిని తాకుతున్న పసిడి వెండి ధరలు
బంగారం, వెండి ధరలు పగ్గాలు లేకుండా పెరిగిపోతున్నాయి. ఈరోజు పసిడి, వెండి ధరలు ఊహించని రీతిలో పెరిగిపోయి ఆల్టైమ్ గరిష్ఠాలకు చేరువయ్యాయి.
1 min
November 30, 2025
Vaartha
ఢిల్లీలో తీవ్రమవుతున్న వాయుకాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. వరుసగా 15వ రోజు కూడా గాలి నాణ్యత 'వెరీ 'పూర్' కేటగిరీలోనే నమోదైంది.
1 min
November 30, 2025
Vaartha
గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా రేవంత్రెడ్డి సర్కార్ ఏర్పాట్లు
గ్లోబల్ సమ్మిట్లో 3వేల డ్రోన్లతో భారీ షో
1 min
November 30, 2025
Vaartha
ఐ బొమ్మ రవి చంచల్గూడ జైలుకు తరలింపు
దేశ వ్యాప్తంగా అనేక భాషల సినిమాలు, ఓటిటి కంటెంట్లను పైరసీ చేసి, బెట్టింగ్ యాప్లతో జతకట్టి కోట్ల రూపాయలు సంపాదించిన పైరసీ నేరగాడు ఐ బొమ్మ యజమాని ఇమ్మంది రవి రెండవ దఫా పోలీసు కస్టడీ శనివారం నాడు ముగిసింది.
1 min
November 30, 2025
Vaartha
నాగర్ కర్నూల్ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం
నలుగురు మెడికల్ విద్యార్థుల సస్పెన్షన్ గత ర్యాగింగ్ బాధితుడే నేడు నిందితుడు.. ఆలస్యంగా వెలుగుచూసిన ర్యాగింగ్ ఘటన
1 min
November 30, 2025
Listen
Translate
Change font size
