Facebook Pixel అలీ ఖమేనీ మృతి | Praja Jyothi – newspaper – Lesen Sie diese Geschichte auf Magzter.com
Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Erhalten Sie unbegrenzten Zugriff auf über 9.000 Zeitschriften, Zeitungen und Premium-Artikel für nur

$149.99
 
$74.99/Jahr

Versuchen GOLD - Frei

అలీ ఖమేనీ మృతి

Praja Jyothi

|

March 02, 2026

దాడుల్లో ఖమేనీ కుటుంబ సభ్యులు కూడా మరణం

అలీ ఖమేనీ మృతి

ఖమేనీ మృతిని ధ్రువీకరించిన ఇరాన్ మీడియా

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు రణరంగంగా మారిన పశ్చిమాసియా..

imageసైనిక శక్తిని ప్రదర్శిస్తున్న అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ప్రతిదాడులతో అతలాకుతలం

ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ కూడా దాడులు

40 రోజులపాటు సంతాపదినాలు ప్రకటన ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మాజీ అధ్యక్షుడు మృతి

ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా చేసిన దాడుల్లో ఇరాన్కు గట్టి దెబ్బ తగిలింది. ఈ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు.ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. ఆయనతో పాటు కుటుం సభ్యులు ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు మృతి చెందినట్లు ప్రకటించింది. 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి పక్కా సమాచారంతోనే ఖమేనీని హతమార్చినట్లుగా సమాచారం. శనివారం ఖమేనీ తన కార్యాలయంలో సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఇదే అదునుగా భావించి సంయుక్త దాడులకు దిగినట్లు అమెరికా అధికారవర్గాలు పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా ఖమేనీ మృతికి సంబంధించి తమ దేశ సీనియర్ అధికారులకు స్పష్టమైన సమాచారం అందిదని ఇరాన్ ప్రకటనకు ముందు ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. ఆయన మృతదేహాన్ని ఇరాన్ అధికారులు శిథిలాల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన ఫొటోలను ట్రంప్, నెతన్యాహు చూశారని వెల్లడించింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నాసిర్జాదే, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ మహ్మద్ పక్పూర్ కూడా మరణించినట్లు సమాచారం. ఖమేనీని అమరవీరుడిగా ఇరాన్ ప్రభుత్వం అభివర్ణించింది. ఇరాన్ గొప్పనాయకుడు, పండితుడిని కోల్పోయినట్లు పేర్కొంది.ఖమేనీ హత్య, నిరంకుశులపై గొప్ప తిరుగుబాటుకు లాంచ్ ప్యాడ్ అవుతుందని ఇరాన్ జాతీయ భద్రతా మండలి పేర్కొంది.ఈ పెద్ద నేరానికి సమాధానం చెప్పకుండావదలబోమని ఇరాన్ క్యాబినెట్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ను ప్రాంతీయ శక్తిగా మార్చడానికి ఖమేనీ ప్రయత్నించారు. 1989లో ఆయతుల్లా రుహోల్లా ఖమేనీ మరణం తర్వాత పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఖమేనీ ఇస్లామిక్ రిపబ్లికన్ను నాటకీయంగా మార్చేశారు.

WEITERE GESCHICHTEN VON Praja Jyothi

Praja Jyothi

ఖమ్మం భూదాన్ భూములలో భూ దందా

అధికారుల ఉదాసీనతో రోడ్డుపాలైన సామాన్యులు అమాయకులకు కట్టబెట్టిన ప్రభుత్వ భూములు

time to read

1 mins

March 02, 2026

Praja Jyothi

Praja Jyothi

అలీ ఖమేనీ మృతి

దాడుల్లో ఖమేనీ కుటుంబ సభ్యులు కూడా మరణం

time to read

4 mins

March 02, 2026

Praja Jyothi

మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చ!

time to read

1 min

March 02, 2026

Praja Jyothi

అవసరమైతే తప్ప బయటకు రావొద్దు

గల్ఫ్ దేశాల్లోని తెలుగువారికి రేవంత్ రెడ్డి సూచనలు

time to read

1 min

March 02, 2026

Praja Jyothi

దేశవ్యాప్తంగా 350 విమానాలు రద్దు..

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న రాజకీయ ఉ ద్రిక్తతలు ఇప్పుడు భారతీయు ప్రయాణ ప్రణాళికలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి.

time to read

1 min

March 02, 2026

Praja Jyothi

'మీ సేవ' మొబైల్ ఆప్ ప్రారంభం

బస్ టిక్కెట్ పొందే సౌకర్యం ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

time to read

1 min

February 25, 2026

Praja Jyothi

అంబర్పేటలో తీవ్ర విషాదం

కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య హోటల్ నడుపుతూ దర్జాగా బతుకుతున్న కుటుంబం ఆర్థిక సమస్యలే కారణమంటూ సూసైడ్ నోట్ దర్యాప్తు చేపట్టిన పోలీసులు

time to read

1 min

February 25, 2026

Praja Jyothi

కోటి ఎస్ఐ ఎటిఎం కాల్పుల ఘటన

కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను వేటాడి పట్టుకున్న బృందాలు

time to read

1 min

February 25, 2026

Praja Jyothi

భారత్ను అమెరికాకు అమ్మేశారు

అమెరికాకు తలొగ్గిన ప్రధాని మోడీ మరోమారు విమర్శలు గుప్పించిన రాహుల్

time to read

1 min

February 25, 2026

Praja Jyothi

Praja Jyothi

• డెస్క్ జర్నలిస్టుల ఆందోళన

కలెక్టరు వినతిపత్రం అందించిన జర్నలిస్టు నాయకులు

time to read

1 min

February 25, 2026

Listen

Translate

Share

-
+

Change font size