Versuchen GOLD - Frei

చైర్మన్ తో ముఖాముఖి

Suryaa Sunday

|

July 28, 2024

చైర్మన్ తో ముఖాముఖి

- నూరపు సూర్యప్రకాశరావు చైర్మన్, నేటి దిన పత్రిక సూర్య

చైర్మన్ తో ముఖాముఖి

పారిస్ ఒలింపిక్స్ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచే కొన్ని క్రీడలు ప్రారంభమైనా.. శుక్రవారం అధికారికంగా విశ్వక్రీడలకు తెరలేసింది. ఇందులో మనదేశం తరపున చాలా మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. వాళ్లు మంచి పతకాలు సాదించాలని ఆశిస్తున్నాను. మీరేమంటారు?

- ఎం కళావతి సాహు, విశాఖపట్నం

మీరన్నది నిజమే కళావతిగారూ... 100 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్కు ఆతిథ్యమి స్తుండటంతో పారిస్ వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఒలింపిక్స్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓపెనింగ్ సెర్మనీని బహిరంగంగా నిర్వహించారు. ప్రారంభ వేడుకలకు సెయిన్ నది వేదికైంది. ఆస్టర్లిట్జ్ బ్రిడ్ నుంచి మొదలైన పరేడ్ ట్రోకాడెరో వరకు సాగింది. నదిలో 6 కిలో మీటర్ల మేర ఈ పరేడ్ జరిగింది. పరేడ్ను వీక్షించేందుకు నదికి ఇరువైపుల, బ్రిడ్జ్ప ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. నదికి ఇరువైపుల సంగీత ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయడంతో పరేడ్ ఆద్యంతం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. వర్షం అంతరాయం కలిగించినా అథ్లెట్లలో ఏ మాత్రం జోష్ తగ్గలేదు. ఓ పెద్ద బౌట్ భారత బృందం పరేడ్లో పాల్గొంది. పీవీ సింధు, శరత్ కమల్ పతకధారులుగా వ్యవహరించారు. 78 మంది భారత అథ్లెట్లు, ఇతర అధికార ప్రతినిధులు పాల్గొ న్నారు.శనివారం క్రీడలు ఉన్న నేపథ్యంలో పలువురు ఓపెనింగ్ సెర్మనీకి దూరంగా ఉన్నారు. ప్రారంభ వేడుకలో 85 బోట్లలో 6, 800 అథ్లెట్లు పాల్గొన్నారు. వీరిలో చాలా మంది పతకాలను తీసుకువస్తారన్న ధీమా అందరిలో వ్యక్తమవుతోంది. మరి ఫలితాలు ఎలా ఉ ంటాయో మీతో పాటూ నేనూ వేచి చూస్తున్నాను.

WEITERE GESCHICHTEN VON Suryaa Sunday

Listen

Translate

Share

-
+

Change font size