డల్లాస్ ఖల్లాస్
AADAB HYDERABAD|20-10-2020
డల్లాస్ ఖల్లాస్
ప్రపంచ చిత్రపటంలో మహానగరం మాయం కానుందా..?

మసకబారుతున్న భాగ్యనగర ఘన చరిత్ర..

• ఎటు చూసినా నీళ్లు, కన్నీళ్లు..

• ప్రభుత్వం, అధికారులు నిద్రపోతున్నారా..?

• ఎక్కడ సమస్య ఉందో తెలియదా..?

• నిర్లక్షానికి ఖరీదు లెక్క చెప్పలేము...

• కళ్ళు తెరవకపోతే భవిష్యత్తులో పెను ప్రమాదం

హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : హైదరాబాద్ పేరు చెబితే ప్రపంచం యావత్తు ఒక్కసారి తలెత్తి చూస్తుంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లో అనువుగా వుండే దక్కన్ పీఠభూమి ప్రాంతం హైదరాబాద్ నగరం. నగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర ఓటర్ రింగ్ రోడ్తో శోభాయమానంగా దర్శనమిచ్చే నగరం భాగ్యనగరం. అయితే ఈ మధ్య చోటుచేసుకున్న విపత్కర పరిణామాల వల్ల నగర భవితవ్యం అంధకారం లోకి మారిపోయింది. పాలకుల నిర్లక్షానికి గురైపోయిన విశ్వనగరం చరిత్రపుటల్లో కలిసిపోయే ప్రమాదానికి చేరుకుంది. ప్రభుత్వాలు, ప్రభుత్వాధికారుల నిర్లక్షానికి సామాన్యుడు బలి అవుతున్నాడు. హైదరాబాద్ కు పట్టిన మహమ్మారి ఎదేచ్చ కబాలు. ఈ కబాల పర్వాలు అక్కడా, ఇక్కడా కాకుండా సర్వాంతర్యామిలా చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ రాజకీయ నాయకుల కనుసన్నలలో జరుగుతుండటం విచారకరం. ప్రభుత్వ అధికారులు సైతం తమ ఉద్యోగ భద్రతకోసం, రాజకీయ నాయకుల మెప్పుకోసం విచ్చల విడిగా కట్టాలకు ఊతం ఇస్తుండటం దురదృష్టకరం. చరిత్ర చెబుతున్నట్టు హైదరాబాద్ చుట్టూ 180 కి పైగా గొలుసుకట్టు చెరువులు ! గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2000 పైగా చెరువులు ఉండేవి. కానీ అవన్నీ ఇప్పుడు కాలగర్భం లో కలిసి పోయాయి. ఈ రోజు మనం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులకు ఇదే కారణం.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

20-10-2020