استمتع بـUnlimited مع Magzter GOLD

استمتع بـUnlimited مع Magzter GOLD

احصل على وصول غير محدود إلى أكثر من 9000 مجلة وصحيفة وقصة مميزة مقابل

$149.99
 
$74.99/سنة
The Perfect Holiday Gift Gift Now

ఒత్తిడిని అధిగమించడమెలా?

March 16, 2025

|

Vaartha-Sunday Magazine

డిప్రెషన్తో బాధపడుతున్నారంటే, వారు విచారం, నిస్సహాయత, అపరాధ నిరాశావాహ భావనలతో కొట్టిమిట్టాడుతున్నారని అర్థం.

- 'ఆనంద 'మైత్రేయ'మ్

ఒత్తిడిని అధిగమించడమెలా?

డిప్రెషన్ అనేది, మనస్సుకు సంబంధించిన ఒక రకమైన రుగ్మతగా పేర్కొనవచ్చు. డిప్రెషన్తో బాధపడుతున్నారంటే, వారు విచారం, నిస్సహాయత, అపరాధ నిరాశావాహ భావనలతో కొట్టిమిట్టాడుతున్నారని అర్థం. భావోద్వేగాలు సహజంగా మారుతాయి. శారీరక, మానసిక పరిస్థితులలో మార్పులను తీసుకువస్తాయి. ఒక వ్యక్తి బరువు కోల్పోయినా లేదా పెరిగినా, అతడు చుట్టుపక్కల ఉన్న వాటి పైన దృష్టి సారించక, చిరాకులకు గురవుతూ, ఒంటరి భావనకు లోనవుతాడు. బంధువులతో, కుటుంబీకులతో, సహా ఉద్యోగుల వలన ఇలాంటి భావనలకు లోనవుతుంటారు.

ఒత్తిడి ప్రభావాలు తలనొప్పి, కండర ఉద్రిక్తత లేదా నొప్పి, ఛాతీ నొప్పి, అలసట, తరచూ మూత్రవిసర్జన, కడుపునొప్పి, నిద్ర పోవడం. ఇది మీ మానసిక స్థితి, ప్రవర్తనపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది, ఆందోళన, విశ్రాంతి లేకపోవడం, ప్రేరణ లేకపోవడం, చిరాకు, అనవసరమైన కోపం, విచారం, నిరాశ వంటి లక్షణాలు ఏర్పడతాయి. ఒత్తిడి తీవ్రమైన లేదా దీర్ఘకాలికంగా ఉంటుంది. చాలా సమస్యలు అధిక రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు, ఆందోళన, నిరాశకు దోహదపడతాయి, ఇతర సమస్యల మధ్య. ఇది సాధారణంగా ఒక వ్యక్తి జీవిత ఆనందాన్ని కూడా తగ్గిస్తుంది.

డిప్రెషన్ ఒక సాధారణ సమస్య. అంతేకాదు, అందరు తరుచుగా వల్లించే పదం. ప్రతీ రోజు మనం ఎంతో మందిని చూస్తూ వుంటాం. వారు నిరాశ, నిస్పృహలతో వుంటారు. ఆనందమైన జీవితాన్ని ఎన్నో ఇబ్బందులతో గడుపుతూ వుంటారు.

పనులని జాప్యం చేయటం.ఏకాగ్రత లోపించటం. విపరీతంగా దిగులు పడటం. వ్యక్తుల పట్ల, దైనందిన చర్యల పట్ల ఆసక్తి నశించటం. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం. ఆకలి మందగించటం, బరువు పెరగటం మొదలైనవి డిప్రెషన్ లక్షణాలుగా భావించవచ్చు.

సహజంగా డిప్రెషన్కు గురైనవారి భాగస్వామితో సరదాగా గడపలేరు. ప్రతిరోజూ ముభావంగా ఉంటూ, ఒంటరితనాన్ని కోరుకుంటారు. సరదాలు, సంతోషాలకు దూరమవుతుంటారు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నవారిలా ఆలోచిస్తుంటారు. ప్రతికూల ఆలోచనలు, ఆత్మహత్యా భావాలు కలుగుతుంటాయి. నిద్ర, ఆహారం, ఇతర కృత్యాలకు దూరమవుతుంటారు. ఒత్తిళ్ళను తగ్గించుకుని, డిప్రెషన్ను ఢీకొట్టగలిగితే నిత్య యవ్వనంతో వ్యవహరించవచ్చు. డబ్బు, సంపద, కీర్తి, ప్రతిష్ఠ, పేరు, ప్రఖ్యాతిపై వున్నట్టుగానే శృంగారంపై ఆసక్తి పెంచుకోవచ్చు.శృంగారం నిత్య జీవితంలో ఓ తప్పని కార్యంగా గుర్తించాలి.

المزيد من القصص من Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size

Holiday offer front
Holiday offer back