يحاول ذهب - حر
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ కెనియన్ గండికొట
November 24, 2024
|Vaartha-Sunday Magazine
గండికోట అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నానది ఒడ్డున ఉన్న ఒక ప్రాచీన దుర్గం.
గండికోట అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నానది ఒడ్డున ఉన్న ఒక ప్రాచీన దుర్గం. జమ్మలమడుగు నుండి 6 మైళ్ళ దూరంలో గండికోట నెలకొని ఉంది. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నానది కొండల మధ్య గండి ఏర్పడింది. ఆ సమీపాన కోటను నిర్మించడం పల్ల ఈ కోటకు 'గండికోట' అనే పేరు వచ్చింది. దీనినే 'గండి కొండ' అని కూడా పిలుస్తారు. ఇక్కడి ఎర్రమల పర్వత శ్రేణినే గండికోట కొండలు అని కూడా అంటారు. ఈ కోటను పూర్వం గిరిదుర్గం అని కూడా పిలిచేవారు. పెన్నా నదికి ఇరువైపులా ఎత్తైన ఎర్రని కొండలు ఉంటాయి. 'సూర్యరశ్మి' ఈ కొండలపై పడినప్పుడు పరమాద్భుతంగా కనిపిస్తాయి. ఇక్కడ ఇరువైపులా రిజర్వాయర్లు ఉన్నాయి. ఆ కారణంగా నిత్యం నీటితో కళకళలాడుతూ ఈ ప్రదేశం కనువిందు చేస్తుంది. వేలాది బండరాళ్ళు ఇక్కడ కనిపిస్తాయి.పెన్నానదీ లోయ వేలాది సంవత్సరాల క్రితం ఏర్పడిందని ఇక్కడి చరిత్ర చెబుతోంది. చుట్టూ లోతైన లోయలు, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్బేధ్యమైన కొండలు. 300 అడుగుల దిగువలో ప్రవహించే పెన్నానది ఇత్యాదివి ఇక్కడి కోటకు సహజసిద్ధమైన రక్షణ కవచాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే అమెరికా పడమర ప్రాంతపు దక్షిణ భాగంలో అరిజోనా రాష్ట్రంలోని మహాద్భుత ప్రకృతికి నిలయమైన గ్రాండ్ కెనియన్ నేషనల్ పార్క్ గుర్తుకు వస్తుంది. అందుకే దీన్ని ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ కెనియన్ అని పిలుస్తారు.నిశ్చితార్థమైనవారు పెళ్ళి సమయంలో ప్రదర్శించడానికి వెడ్డింగ్ షూట్లు ఇక్కడ చిత్రీకరిస్తుంటారు. కొండలెక్కుతూ సాహసాలు చేయడం, చిన్న పడవలలో ప్రయాణించడం ఇత్యాది సాహస క్రీడలు ఇక్కడ ఉల్లాసాన్ని కలిగిస్తాయి.గండికోట 16వ శతాబ్దం వరకు హిందూ రాజుల పాలనలో ఉంది ఆ తరువాత ముస్లింరాజులు పశమైంది. టిప్పుసుల్తాన్ మరణం తరువాత స్వాతంత్రం వచ్చేవరకు ఇక్కడ ఆంగ్లేయుల పెత్తనం కొనసాగింది. చివరగా బ్రిటిషువారి చేతుల్లోకి వెళ్ళి 1980లో భారత పురావస్తు శాఖ అధీనంలోకి వచ్చింది. గండి కోట రక్షణలో మూడు విభాగాలు ఉన్నాయి. మూడువైపులా నీటి ప్రవాహంతో రక్షణ కలిగి ఉన్న జల దుర్గము, కొండలపై ఈ కోటను నిర్మించడంలో శత్రువుల రాకను అరికట్టే పర్వత దుర్గము, శత్రుదుర్భేద్యంగా కీకారణ్యాన్ని కలిగివున్న వన దుర్గము ఇలా గండికోటను పిలుచుకుంటారు. విజయనగర రాజుల ఏలుబడి తరువాత గండికోటపై పెమ్మసాని పాలకుల అధిపత్యం కొనసాగింది. ఒకప్పుడు ఈ ప్రాంతం వజ్రాల వ్యాపారానికి ప్రస
هذه القصة من طبعة November 24, 2024 من Vaartha-Sunday Magazine.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Vaartha-Sunday Magazine
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size

