يحاول ذهب - حر
భారత రాజ్యాంగం ముసాయిదా కమిటిలో ఎవరెవరున్నారు? తొలి డ్రాఫ్ట్ రాసింది ఎవరు?
August 2023
|Telugu Muthyalasaraalu
జనవరి 26.. డెబ్భై మూడేళ్ల క్రితం భారత రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చిన రోజు. 1947లో దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ, బ్రిటిష్ పాలనలో తయారైన భారత ప్రభుత్వ చట్టమే (1935) అమలులో ఉండేది.
-
జనవరి 26.. డెబ్భై మూడేళ్ల క్రితం భారత రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చిన రోజు. 1947లో దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ, బ్రిటిష్ పాలనలో తయారైన భారత ప్రభుత్వ చట్టమే (1935) అమలులో ఉండేది. దేశ పరిపాలనకు ఇదే ప్రాథమిక ఆధారంగా ఉండేది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు.దేశ పరిపాలనకు సంబంధించి ప్రామాణిక గ్రంథం భారత రాజ్యాంగమే.ప్రభుత్వ నిర్మాణం, అధికారాలు, విధులు, ప్రభుత్వ సంస్థల విధులు, పౌరహక్కులు, విధులను రాజ్యాంగం నిర్దేశిస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాణం ఒక్క రోజులోనో, ఒక నెలలోనో జరిగినది కాదు. దీని వెనుక అపారమైన కృషి ఉంది. రాజ్యాంగ రచన పూర్తి కావడానికి మొత్తం 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. 1946 డిసెంబర్ 6న రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు మొదలుకొని 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందేవరకు ఈ ప్రక్రియ కొనసాగింది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ చివరి సమావేశంలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సహా రాజ్యాంగ సభ సభ్యులందరూ భారత రాజ్యాంగంపై సంతకం చేశారు. జనవరి 26న ఇది పూర్తిగా అమలులోకొచ్చింది. రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో భాగంగా సుమారు మూడేళ్ల కాలంలో పలు కమిటీలు ఏర్పాటయ్యాయి. అనేక సమావేశాలు, చర్చలు జరిగాయి. వీటిలో ప్రముఖమైనది రాజ్యాంగ ముసాయిదా కమిటీ (డ్రాఫ్టింగ్ కమిటీ). బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన ముసాయిదా కమిటీ రాజ్యాంగం తుది ప్రతిని రూపొందించింది.రాజ్యాంగ సభకు రాజ్యాంగ సలహాదారుగా సర్ బెనెగళ్ నర్సింగరావు (1887-1953) నియమితులయ్యారు. అంతకుముందు బ్రిటిష్ పాలనలో వచ్చిన 'భారత ప్రభుత్వ చట్టం 1935' రూపకల్పనలో ఆయన కీలక పాత్రపోషించారు. 1948 ఫిబ్రవరిలో భారత రాజ్యాంగం తొలి ముసాయి దాను బీఎన్ రావు తయారుచేశారు. ఇందుకోసం ఆయన వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. బీఎన్రావు 1909లో బ్రిటిష్ ప్రభుత్వంలో ఇండియన్ సివిల్ సర్వెంట్గా చేరారు. ఆయన తొలి పోస్టింగ్ బెంగాల్లో.తరువాత ఆయన న్యాయవాద వృత్తి వైపు మరలారు. పలు కోర్టులలో జడ్జిగా పనిచేశారు. బ్రిటిష్ ప్రభుత్వంలో పలు కమిటీలలో, పలు ముసాయిదాల తయారీలో ప్రముఖ పాత్ర పోషించారు.బీఎన్ రావు సేవలకు గుర్తింపుగా 1938లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు 'సర్' బిరుదును ఇచ్చింది. అంతకుముందు
هذه القصة من طبعة August 2023 من Telugu Muthyalasaraalu.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Telugu Muthyalasaraalu
Telugu Muthyalasaraalu
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు
గ్రామాలలో బాల్య వివాహాలు జరగకుండా చూడవలసిన బాధ్యత పొదుపు మహిళా సంఘాల పై ఉన్నది.
3 mins
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
వడ్డేపల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు - ఘనంగా విరూపాక్షమ్మ తిరునాళ్లు
పూతలపట్టు మండలం వడ్డేపల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు - ఘనంగా విరూపాక్షమ్మ తిరునాళ్లు నిర్వహించగా టీటీడీ ఆధ్వర్యంలో అన్నమయ్య సంగీత విభావరి ఆకట్టుకుంది.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
మీ కోసంకాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి
ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూక్లినిక్ కార్యక్రమం నిర్వహణ రెవెన్యూ పరిధిలోని అన్ని ఫిర్యాదుల పరిష్కార అధికారుల కార్యాలయాలలో \"మీకోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1100” అనే బ్యానర్ ను ఏర్పాటు చేయాలి.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్
వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ మరో ఏడాది (2026-27) పొడిగింపు
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
VB-G RAM- G చట్టం పరిధిలో 125 రోజుల పనిదినాల లక్ష్యంతో.....
(ముత్యాలసరాలు) గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న VB-G RAM G చట్టం పరిధిలో 125 రోజుల పనిదినాల లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను చిత్తూరు జిల్లా కలెక్టర్ ఈరోజు ఆవిష్కరించారు.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
కవయిత్రి మొల్ల ఆదర్శప్రాయురాలు: జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్.
చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్డీ) బి. మోహన్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కవయిత్రి మొల్ల జయంతి వేడుకల్లో డిఆర్డీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
కోరిన కోర్కేలు తీర్చే కొంగుబంగారం శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం
శ్రీశ్రీశ్రీమూర్తి స్వామి, రేణిగుంట పట్టణంలోని రైల్వేగేటు వద్ద ఉన్న శ్రీరాజరాజేశ్వరి జ్ఞానపీఠం వ్యవస్థాపకులు, పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మూర్తి స్వామి వారిని కురుక్షేత్రం దినపత్రిక ఎడిటర్, దినపత్రిక ప్రతినిధులు కలిశారు. అనంతరం ఆయన కురుక్షేత్రం దినపత్రిక యాజమాన్యానికి, ప్రతినిధులకు అమ్మవారి ప్రత్యేక దర్శనం చేయించి హారతులు సమర్పించారు.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
ఆడపిల్లల చదువు హక్కు మాత్రమే కాదు, సమాజ అభివృద్ధి దిశగా మేలిపునాది
చిత్తూరులోని సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల 44 వ వార్షికోత్సవము కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పూర్వ ఉపరాష్ట్రపతి కళాశాల ప్రాంగణంలోని నూతన భవనాల ప్రారంభోత్సవం
3 mins
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
చిత్తూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లు సాధారణంగానే సరఫరా కొనసాగుతుంది ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు :- జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. రాజేంద్రన్
చిత్తూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లు సాధారణంగానే సరఫరా కొనసాగుతుందని ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ రాజేంద్రన్ గురువారం ప్రకటనలో తెలిపారు.
1 min
telugu muthyalasaraalu
Telugu Muthyalasaraalu
మన తెలుగు పండుగ "ఉగాది"
పండుగంటేనే విజయానికి గుర్తు. ధర్మానికి ఆధారం, వారసత్వానికి రూపం. సంస్కృతి సాంప్రదాయలకు నెలవు. అంతేకాక పండుగంటేనే దూరదృష్టి. ఆరోగ్యసౌభాగ్యాలకు సంకేతమై నిలుస్తుంది.
2 mins
telugu muthyalasaraalu
Translate
Change font size
