“హే రు య్ జైనాబ్, పార్కు ఈ రోజు ఎంత " రద్దీగా ఉందో చూడు" బెంచీపైన కూర్చుంటూ అంది మరియా.
“మరియా, అలా అనుకుంటే ఏ ప్రదేశం మాత్రం రద్దీగా లేదు?" బదులిచ్చింది జైనాబ్.
“నువ్వు చెప్పింది నిజమే, రహదారులు, వీధులు, పరిసరాలు, పాఠశాలలు, బస్ స్టాండ్లు, స్టేషన్లు ఆసుపత్రులు సైతం రద్దీగా ఉన్నాయి" అంది సిమ్రాన్.
“ఆయుషీ, ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావ్? ఏదైనా చెప్పు” జైనాబ్ ఆయుషీని అడిగింది.
"నేను ఒప్పుకుంటాను జైనాబ్. ప్రతి చోట గుంపులు గుంపులుగా జనాన్ని చూస్తున్నాను.
ఏదేమైనా భారత దేశం ఇప్పుడు చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది” ఆందోళనగా చెప్పింది ఆయుషీ.
నలుగురు అమ్మాయిలు ఢిల్లీలోని ఒక స్కూల్లో చదువుతున్నారు. వారు జూనియర్ స్కూల్ స్టూడెంట్స్ అయినప్పటికీ వర్తమాన అంశాలను చర్చించడానికి ఇష్టపడతారు.
ఈ రోజు ఆదివారం. వ్యాయామం చేయడానికి పార్కుకి వచ్చారు. జాగింగ్ తర్వాత ఒక బెంచీపై విశ్రాంతిగా కూర్చున్నారు.
ఆయుషీ లేవనెత్తిన అంశాన్ని కొనసాగిస్తూ జైనాబ్ “నువ్వు చెప్పింది నిజమే ఆయుషీ, ఇప్పుడు భారతదేశ జనాభా 1.43 బిలియన్లు దాటింది.
ప్రపంచంలో ప్రతి ఆరవ వ్యక్తి భారతీయుడే. ప్రపంచ జనాభాలో 16 శాతం మంది భారతదేశంలో నివసిస్తున్నారు. ప్రపంచ భూభాగంలో భారతదేశ వాటా 2.4 శాతమే" అని చెప్పింది.
“నువ్వు చెప్పింది కరెక్ట్ జైనాబ్, భారత దేశంలో జనాభా ఇంతగా ఎలా పెరిగిందో మనం ఆలోచించాలి" అంది ఆయుషీ.
“ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది" చెప్పింది సిమ్రాన్.
"అది నీకెలా తెలుసు” అడిగింది మరియా.
“మా అన్నయ్య రాజన్ ముంబైలోని ప్రసిద్ధ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్) లో చదువుకుంటున్నాడు. ఈ సబ్జెక్టుపై అతని దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి" అంది సిమ్రాన్.
Bu hikaye Champak - Telugu dergisinin July 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Champak - Telugu dergisinin July 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
మదర్స్ డే
మదర్స్ డే
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
ష్... నవ్వొద్దు...హహహ
హహహ
డమరూ - గోల్గప్పా
డమరూ - గోల్గప్పా
జ్ఞాపకశక్తి ని పెంచుకోండి
జ్ఞాపకశక్తి ని పెంచుకోండి
ఫారెస్ట్ పార్లమెంట్
కుముద్
పరిష్కారం
అది 1901 సంవత్సరం. భారతదేశం బ్రిటీషు పాలనలో ఉన్న కాలం. మహారాష్ట్రలోని సతారాలో తొమ్మిది సంవత్సరాల భీమ్రావ్ తన అన్నయ్య, మేనల్లుడు నానమ్మతో నివసిస్తున్నాడు.
మన - వాటి తేడా
బ్లూ డాషర్ తల పై భాగంలో కళ్లు ఉంటాయి. వాటితో అవి 360 డిగ్రీలు అంటే, చుట్టూ చూసే శక్తి కలిగి ఉంటాయి.
తేడాలు గుర్తించండి
ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో