ఎల్లప్పుడూ యవ్వనంగా, అందంగా ఉండాలంటే
Grihshobha - Telugu|July 2022
చిన్న వయసులో ఏజింగ్ నుంచి బయట పడడానికి ఈ టిప్స్ మీకు ఎంతో ఉపయోగ పడతాయి.
ఎల్లప్పుడూ యవ్వనంగా, అందంగా ఉండాలంటే

చిన్న వయసులో ఏజింగ్ నుంచి బయట పడడానికి ఈ టిప్స్ మీకు ఎంతో ఉపయోగ పడతాయి.

కరోనా కారణంగా మనం మన చర్మ  సంరక్షణను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాం. ముఖ్యంగా యువత. ‘మనం ఇప్పుడు ఇంట్లోనే ఉండాలి', 'ఎక్కడికీ వెళ్లనవసరం లేదు’, ‘ఎవరూ చూసేవారు లేరు', 'ఎవరినీ కలవనవసరం లేదు'. 'కాబట్టి చర్మాన్ని సంరక్షించుకోకపోతే ఏమవుతుంది' అని వారికి అనిపిస్తుంది. కానీ ఈ ఆలోచన తమ చర్మాన్ని పాడు చేస్తుందని వారికి తెలియదు.

ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేదా ఇంకేదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఫిల్టర్స్ సహాయంతో మిమ్మల్ని మీరు అందంగా చూపించుకుని ఇతరుల ప్రశంసలు పొందవచ్చు. కానీ వాస్తవం దీనికి భిన్నంగా ఉంటుంది.అటువంటి పరిస్థితిలో మీరు ఎప్పుడూ యవ్వనంగా ఉండేలా అందమైన చర్మాన్ని పొందాలని అనుకుంటే ముందుగానే జాగ్రత్త వహించండి. లేకపోతే చిన్న వయసులోనూ మీ చర్మం 60 ఏళ్లలాగా కనిపిస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు యవ్వనంగా ఉంచుకోవడం ఎలాగో తెలుసుకుందాం రండి.

ముడతల సమస్య ఎప్పుడు మొదలవుతుంది

20 ఏళ్ల వయసులో చర్మం నిగనిగలాడుతూ అందంగా ఉంటుంది. ఈ సమయంలో సమస్యలు తక్కువ, ముఖంలో మెరుపు, తేజస్సు, ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ వయసులో చర్మంపై నిర్లక్ష్యం వహిస్తే ముఖంపై ఫైన్ లైన్స్తోపాటు ముడతలు కూడా కనిపించడం మొదలుపెడతాయి.

మన చర్మం పైపొరకు మద్దతు ఇచ్చే కొల్లాజన్, ఇలాస్టిన్ ప్రొటీన్ పొరలో లోపం ఏర్పడటం వల్ల ఇవి కనిపిస్తాయి. దీంతో చర్మం తన మాయిశ్చరైజర్, అందాన్ని కోల్పోవడం మొదలు పెడుతుంది. కాబట్టి మీరు ముడతల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుకోవడానికి చర్మ సంరక్షణతోపాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కూడా అనుసరించడం మరచిపోవద్దు.

టెన్షన్ని దూరంగా ఉంచండి

ప్రస్తుతం ఇంట్లో లేదా బయట ప్రతి చోట ఒత్తిడి వాతావరణం చోటు చేసుకుని ఉంది. ఒకరికి కరోనా మహమ్మారి కారణంగా తమ ప్రియమైన వారిని కొల్పోతామనే భయం ఉంటుంది. ఇంకొకరు తమ కెరీర్ గురించి ఆందోళన చెందుతుంటారు. మరొకరు ఎక్కడ ఉద్యోగం పోతుందేమోనని భయపడుతుంటారు.ముఖ్యంగా యువతీ, యువకులు ఈ విషయంలో చాలా ఒత్తిడిలో ఉన్నారు. ఇది వారి ఆరోగ్యాన్ని చెడగొడుతుంది.

This story is from the July 2022 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the July 2022 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - TELUGUView All
బాలీవుడ్లో
Grihshobha - Telugu

బాలీవుడ్లో

తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం

time-read
1 min  |
April 2024
హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్
Grihshobha - Telugu

హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్

'జెమ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ రాశి సింగ్. ఆ తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది

time-read
2 mins  |
April 2024
హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్
Grihshobha - Telugu

హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్

కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన స్టోరీ ఒక్కటి కూడా లేదట.

time-read
1 min  |
April 2024
పార్ చిరంజీవితో త్రిష...!
Grihshobha - Telugu

పార్ చిరంజీవితో త్రిష...!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.

time-read
1 min  |
April 2024
మహేష్ ఫ్యాన్స్కు పండుగే...
Grihshobha - Telugu

మహేష్ ఫ్యాన్స్కు పండుగే...

'జక్కన్న' సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.

time-read
1 min  |
April 2024
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
Grihshobha - Telugu

ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?

ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.

time-read
2 mins  |
April 2024
నవ వధువుకి 10 కుకింగ్ ఐడియాలు
Grihshobha - Telugu

నవ వధువుకి 10 కుకింగ్ ఐడియాలు

పెళ్లయ్యాక అత్తారింట్లో తొలిసారి అడుగు పెట్టే మహిళలకు వంటగది చిట్కాలు...

time-read
1 min  |
April 2024
ఛలోక్తులు
Grihshobha - Telugu

ఛలోక్తులు

ఛలోక్తులు

time-read
2 mins  |
April 2024
అప్సరసల యువరాణివి నువ్వు!
Grihshobha - Telugu

అప్సరసల యువరాణివి నువ్వు!

వైట్ ఎంబ్రాయిడర్డ్ అండ్ ప్రింటెడ్ లెహంగా సెట్.

time-read
1 min  |
April 2024
అమ్మాయిలకు ఉద్యోగం అవసరమా?
Grihshobha - Telugu

అమ్మాయిలకు ఉద్యోగం అవసరమా?

తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాలు అమ్మాయిలు తప్పకుండా చేయాలి. ఎందుకంటే...

time-read
4 mins  |
April 2024