వేదం బెవ్వని వెదకెడిని...
Sri Ramakrishna Prabha|June 2023
వేదాలు ఆయనే... వేదాంగాలూ ఆయనే! వేదాలు వినుతించేదీ ఆయననే... వేదాంగాలు వర్ణించేదీ ఆయననే!
- శ్రీమతి బి. కృష్ణకుమారి
వేదం బెవ్వని వెదకెడిని...

అన్నమయ్య పదామృతం

వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడీ ॥

అలరిన చైతన్యాత్మకుఁ డెవ్వడు కలడెవ్వఁడెచట కలఁడనిన తలతు రెవ్వనిని తను వియోగదశ యిల నాతని భజియించుడీ॥ 

కడగి సకల రక్షకుడిందెవ్వడు వడి నింతయు నెవ్వనిమయము పిడికిట తృప్తులు పితరులెవ్వనిని తడవిన ఘనుడాతని కనుడీ ॥

కదిసి సకల లోకంబుల వారలు యిదివో కొలిచెద రెవ్వనిని త్రిదశ వంద్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడీ॥

వేదాలు ఆయనే... వేదాంగాలూ ఆయనే! వేదాలు వినుతించేదీ ఆయననే... వేదాంగాలు వర్ణించేదీ ఆయననే! ఆ వేదస్వరూపుడు, ఆ వేదవినుతుడు సకల జీవుల్లో చైతన్యాత్మకుడు. సర్వకాలాల్లో సంరక్షించే సర్వేశ్వరుడు. అందుకే ఆ దేవదేవుడిని కొనియాడి, ఆ దినకరతేజుడిని భజించి, ఆ ఘనాఘన సుందరుడిని సేవించి ఆయనలో ఐక్యం కావటమే మన కర్తవ్యం.

ఆ కర్తవ్యాన్ని క్షణం కూడా విస్మరించకుండా భగవదర్పితంగా బ్రతికేవారే భాగవతోత్తములు. వారికి దైవస్మరణ, దైవసేవే దినచర్య. ఆ స్మరణతో, ఆ సేవతో ఆ భక్తశిఖామణులు ఆ భక్తిమార్గంలో వసివాడని పూలదారులు పరుస్తారు. అలా ఆ తోవలో పూలదారులే కాదు పదామృతధారల్ని కూడా.ప్రవహింపజేసిన పదకవితా పితామహుడు అన్నమాచార్య.ఆయన సంకీర్తనలతో ఆ సప్తగిరీశుడి వైభవం వీనులవిందుగా విశ్వమంతా వ్యాపించింది. ఆయన పాటల్లో శ్రీనివాసుడి శోభ పసిడికాంతులతో విరాజిల్లింది. అలాంటి అరుదైన పదామృతమే ఈ 'వేదం బెవ్వని వెదకెడిని...' కీర్తన. ఆ కొండలరాయడిని ఎందుకు కొనియాడాలో, ఆ భక్తవరదుడిని ఎందుకు భజించాలో, ఆ కామితఫలదాతను ఎందుకు కనులారా వీక్షించాలో, ఆ శ్రీముద్రాంకితుడిని వెదకి వెదకి మరీ ఎందుకు సేవించాలో సంకీర్తనాచార్యుడు ఈ పాటలో ప్రస్ఫుటం చేశాడు. ముఖ్యంగా వేంకటాచలపతిని వేదాలకు సైతం అందని పరిపూర్ణ జ్ఞానస్వరూపుడిగా ఈ కీర్తనలో అన్నమయ్య ప్రస్తుతించాడు. వేదాలు అన్వేషించే అనుపమాన రూపంగా అర్చించాడు. అందుకే "భగవంతుడు వేదాలకు అతీతుడు. వేదవేదాంగాలను అధ్యయనం చేసినంత మాత్రాన ఆయనను పొందలేం. అవన్నీ ఆయన వైపు వెళ్ళేందుకు సూచనలు మాత్రమే! ఆ వేదమార్గంలో మనం పయనించినప్పుడే పరమాత్మ అర్థమవుతాడు" అన్నారు భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస.

ఆ దేవుని కొనియాడు....

This story is from the June 2023 edition of Sri Ramakrishna Prabha.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the June 2023 edition of Sri Ramakrishna Prabha.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM SRI RAMAKRISHNA PRABHAView All
అడుగు జాడలు...
Sri Ramakrishna Prabha

అడుగు జాడలు...

దివ్యజనని శ్రీశారదాదేవి ప్రత్యక్ష శిష్యులైన స్వామి శారదేశానందజీ (1892-1988) రామకృష్ణ సంఘంలో ఎంతో గౌరవాన్నీ, ప్రేమాభిమానాలనూ చూరగొన్న గొప్ప సన్న్యాసి.

time-read
3 mins  |
January 2024
ఆ ధరణీవల్లభుఁ డెక్కెను దివ్యరథము...- స్వామి జ్ఞానదానంద
Sri Ramakrishna Prabha

ఆ ధరణీవల్లభుఁ డెక్కెను దివ్యరథము...- స్వామి జ్ఞానదానంద

భారతీయ సంస్కృతిపై శ్రీరాముని ప్రభావం ప్రగాఢమైంది.

time-read
3 mins  |
January 2024
యువతకు ఆదర్శం స్వామి వివేకానంద మిలి - కొవ్వూరి భవానీ
Sri Ramakrishna Prabha

యువతకు ఆదర్శం స్వామి వివేకానంద మిలి - కొవ్వూరి భవానీ

జనవరి 12న 'జాతీయ యువజన దినోత్సవం' (స్వామి వివేకానంద జయంతి - ఆంగ్ల తేదీ ప్రకారం)

time-read
1 min  |
January 2024
మన జీవనక్రాంతి 'సంక్రాంతి'
Sri Ramakrishna Prabha

మన జీవనక్రాంతి 'సంక్రాంతి'

శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి లాంటివి' జన్మదిన పండుగలు. విజయదశమి, దీపావళి లాంటివి రాక్షస సంహారం జరిగిన సందర్భంలో జరుపుకునే పండుగలు.

time-read
2 mins  |
January 2024
అభయ కల్పతరువు
Sri Ramakrishna Prabha

అభయ కల్పతరువు

అభయ కల్పతరువు

time-read
3 mins  |
January 2024
యజుర్వేద శాంతి మంత్రం
Sri Ramakrishna Prabha

యజుర్వేద శాంతి మంత్రం

యజుర్వేద శాంతి మంత్రం

time-read
1 min  |
January 2024
సూక్తి సౌరభం
Sri Ramakrishna Prabha

సూక్తి సౌరభం

సూక్తి సౌరభం

time-read
1 min  |
January 2024
సుబోధ
Sri Ramakrishna Prabha

సుబోధ

సుబోధ

time-read
1 min  |
January 2024
అద్వైతభావమే నేడు కావలసింది!
Sri Ramakrishna Prabha

అద్వైతభావమే నేడు కావలసింది!

మనదేశంలోని సంప్రదాయాలు, తత్త్వశాస్త్రాలు, స్మృతులు వేర్వేరుగా కనిపించినా వీటి అన్నిటికీ మూలాధారమైన సిద్ధాంతమొకటుంది.

time-read
1 min  |
June 2023
ఎందుకీ కష్టాలు?
Sri Ramakrishna Prabha

ఎందుకీ కష్టాలు?

'ఏమిటీ జీవిత ఎందుకీ కష్టాలు?' అన్నది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అడిగే మిలియన్ డాలర్ల ప్రశ్న.

time-read
2 mins  |
June 2023