ప్రతిమ పరమాత్ముని ప్రతీక
Sri Ramakrishna Prabha|April 2023
మన భారతీయ అధ్యాత్మవిద్య నిత్యజీవితంతో ముడిపడి ఉంది. దైనందిన జీవితంలో మనం ఆచరించే గృహకృత్యాలతో పాటు విద్య, కళలు, కావ్యశాస్త్రాల అభ్యాసం వంటి ప్రతి పనిలోనూ ఆధ్యాత్మికత అంతర్లీనంగా సాగుతూ ఉంటుంది
- కె.వి. ప్రసాదవర్మ
ప్రతిమ పరమాత్ముని ప్రతీక

మన భారతీయ అధ్యాత్మవిద్య నిత్యజీవితంతో ముడిపడి ఉంది. దైనందిన జీవితంలో మనం ఆచరించే గృహకృత్యాలతో పాటు విద్య, కళలు, కావ్యశాస్త్రాల అభ్యాసం వంటి ప్రతి పనిలోనూ ఆధ్యాత్మికత అంతర్లీనంగా సాగుతూ ఉంటుంది.భగవత్తత్త్వం గురించి అవగాహనా ప్రస్థానంలో మొదటిమెట్టు విగ్రహారాధన. భక్తికి ఏదైనా ఒక అధిష్ఠానం, ఆలంబనం అవసరం. అధిష్ఠాన రహితంగా భక్తి ఉండదు. కాబట్టి సగుణోపాసనతో ప్రారంభం కావలసిందే! లక్ష్యం నిలవడానికి, ఏకాగ్రత సిద్ధించడానికి రూపం అనేక విధాల సహాయపడుతుందనడంలో సందేహం లేదు.భగవంతుడు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అనే అయిదు తత్వాలలో ఉంటాడని ఆగమాలు చెబుతున్నాయి.అందులో అర్చామూర్తే విగ్రహరూపంలో ఉంటాడు. అర్చావతారం ఎప్పుడూ ఉండేది, భక్తులు ఎప్పుడైనా ఉపాసించడానికి వీలున్నది.'ఉపాసకానాం కార్యాదౌ బ్రహ్మణో రూపకల్పనా ఉపాసకుని కార్యసిద్ధి కోసం నిరాకారుడైన పరమేశ్వరునికి రూపం ఏర్పాటు చేశారు.' ఎంతటి మూర్ఖుడైనా తానొక రాతిబొమ్మను ఉపాసిస్తున్నాను అని భావించడు కదా! ఆ మూర్తి యందు ఇష్టదేవతా ధ్యానాన్నే భక్తుడు చేస్తాడు.

నిజానికి పరబ్రహ్మ తత్త్వం ఇంద్రియాలకు అందనిది, నామరూప గుణాతీతమైనది. ఈ అవగాహన ఉన్నవారు, 'హరిమయము విశ్వమంతయు' అని అనుకోగలిగిన విజ్ఞులు నూటికో కోటికో ఒకరుండవచ్చు. మిగిలిన వారందరూ సాధారణ సాధకులే. అలాంటివారికి పరమేశ్వరునిపై ఏకాగ్రత కుదరడానికి సాధనం సాకార దైవోపాసనయే. సాధనలో పురోగమించేకొద్దీ మనసులోనే మహేశ్వరుడున్నాడన్న ఎరుక కలగవచ్చు. మానవులందరూ ఒకే విధమైన మానసిక పరిపక్వత, ధీశక్తి కలవారు కారన్నది సత్యం. అందువల్ల ఆయా స్థాయులలో ఉన్నవారు తరించడానికి ఎన్నో మార్గాలు చూపింది హిందూధర్మం. అదే ఆర్షధర్మ వైశిష్ట్యం. ప్రతిమా స్వల్ప బుద్ధీనాం యోగినాం

This story is from the April 2023 edition of Sri Ramakrishna Prabha.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the April 2023 edition of Sri Ramakrishna Prabha.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM SRI RAMAKRISHNA PRABHAView All
అడుగు జాడలు...
Sri Ramakrishna Prabha

అడుగు జాడలు...

దివ్యజనని శ్రీశారదాదేవి ప్రత్యక్ష శిష్యులైన స్వామి శారదేశానందజీ (1892-1988) రామకృష్ణ సంఘంలో ఎంతో గౌరవాన్నీ, ప్రేమాభిమానాలనూ చూరగొన్న గొప్ప సన్న్యాసి.

time-read
3 mins  |
January 2024
ఆ ధరణీవల్లభుఁ డెక్కెను దివ్యరథము...- స్వామి జ్ఞానదానంద
Sri Ramakrishna Prabha

ఆ ధరణీవల్లభుఁ డెక్కెను దివ్యరథము...- స్వామి జ్ఞానదానంద

భారతీయ సంస్కృతిపై శ్రీరాముని ప్రభావం ప్రగాఢమైంది.

time-read
3 mins  |
January 2024
యువతకు ఆదర్శం స్వామి వివేకానంద మిలి - కొవ్వూరి భవానీ
Sri Ramakrishna Prabha

యువతకు ఆదర్శం స్వామి వివేకానంద మిలి - కొవ్వూరి భవానీ

జనవరి 12న 'జాతీయ యువజన దినోత్సవం' (స్వామి వివేకానంద జయంతి - ఆంగ్ల తేదీ ప్రకారం)

time-read
1 min  |
January 2024
మన జీవనక్రాంతి 'సంక్రాంతి'
Sri Ramakrishna Prabha

మన జీవనక్రాంతి 'సంక్రాంతి'

శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి లాంటివి' జన్మదిన పండుగలు. విజయదశమి, దీపావళి లాంటివి రాక్షస సంహారం జరిగిన సందర్భంలో జరుపుకునే పండుగలు.

time-read
2 mins  |
January 2024
అభయ కల్పతరువు
Sri Ramakrishna Prabha

అభయ కల్పతరువు

అభయ కల్పతరువు

time-read
3 mins  |
January 2024
యజుర్వేద శాంతి మంత్రం
Sri Ramakrishna Prabha

యజుర్వేద శాంతి మంత్రం

యజుర్వేద శాంతి మంత్రం

time-read
1 min  |
January 2024
సూక్తి సౌరభం
Sri Ramakrishna Prabha

సూక్తి సౌరభం

సూక్తి సౌరభం

time-read
1 min  |
January 2024
సుబోధ
Sri Ramakrishna Prabha

సుబోధ

సుబోధ

time-read
1 min  |
January 2024
అద్వైతభావమే నేడు కావలసింది!
Sri Ramakrishna Prabha

అద్వైతభావమే నేడు కావలసింది!

మనదేశంలోని సంప్రదాయాలు, తత్త్వశాస్త్రాలు, స్మృతులు వేర్వేరుగా కనిపించినా వీటి అన్నిటికీ మూలాధారమైన సిద్ధాంతమొకటుంది.

time-read
1 min  |
June 2023
ఎందుకీ కష్టాలు?
Sri Ramakrishna Prabha

ఎందుకీ కష్టాలు?

'ఏమిటీ జీవిత ఎందుకీ కష్టాలు?' అన్నది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అడిగే మిలియన్ డాలర్ల ప్రశ్న.

time-read
2 mins  |
June 2023