మూలాలకు తిరిగి వెళదాం
Heartfulness Magazine Telugu|January 2024
"ప్రాథమికాలకు తిరిగి వెళ్ళడం" అనే భావనను లోతుగా పరిశీలించే క్రమంలో ఈ భూగ్రహంపై ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కులకు ఆలంబన ఇవ్వగల కొన్ని సులభమైన మార్గాలను మనకు అందిస్తారు ఎలిజబెత్ డెన్లీ.
మూలాలకు తిరిగి వెళదాం

ఈ జనవరి మాసమంతా "ప్రాథమికాలకు తిరిగి వెళ్లడమ”నే విషయం నా మనసులో ప్రధానాంశంగా ఉంటోంది. మనం సాధారణంగా మన అలవాట్లలో, మన స్థితిగతుల్లో మార్పును ఆకాంక్షించే తీర్మానాలతో ప్రతీ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తాం.అయితే ఈ సారి యుద్ధాల వల్ల కలుగుతున్న దుష్పరిణామాలు, ప్రపంచం నలుదిక్కులా స్వస్థలాలను కోల్పోయిన అనేకమంది ప్రజలు; కూడు, నీడ, తలదాచుకునేందుకు ఆశ్రయం లేని కుటుంబాల వెతలు; అన్ని ఖండాలలో సమాజాలను ప్రమాదంలో పడేలా చేస్తున్న వాతావరణ సంక్షోభం లాంటి సమస్యలతో ఈ సంవత్సర ప్రారంభం సంతృప్తికరంగా లేదు.

పైన వివరించిన అస్థిరతల నేపథ్యంలో, ప్రామాణిక స్వీయ-పరిశీలనా విధానము, వాటి వెన్నంటి వచ్చే వ్యక్తిగత లక్ష్యాల ఎంపికలు, ఉద్దేశాల నిర్వహణ, నూతన అలవాట్ల సృష్టి వంటివి అరుదైనవిగానే అనిపిస్తుంది."ప్రాథమికాలకు తిరిగి వెళ్ళడమ”నే అంశం చాలామంది విషయంలో తమ ప్రాధమిక అవసరాలను తీర్చుకునే ఆవశ్యకతకు సంబంధించినది గానే పరిగణింపబడుతోంది.

మనలో సురక్షితమైన జీవనం, అవసరమైన ఆహారము, శుద్ధమైన నీరు, నివాసం, మంచి ఆరోగ్యం ఉన్న అదృష్టవంతుల విషయంలో "ప్రాథమికాలు" అంటే వ్యక్తిగత ఆకాంక్షలు మరియు ప్రపంచ పౌరసత్వానికి సంబంధించిన సమిష్టి ఆకాంక్షలతో కూడినవి. ఆ అదృష్టానికి నోచుకొననివారి “ప్రాథమికాలు” వేరుగా ఉంటాయి. రెండూ ఒక్కటి కావు.ఐక్యరాజ్యసమితి యొక్క 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను మన ప్రపంచ ఆకాంక్షలుగా ఉపయోగించుకోగలమా? వీటిని ప్రతిపాదించిన

8 సంవత్సరాల తర్వాత కూడా మనం వాటి లక్ష్య సాధన దరిదాపుల్లో లేని కారణంగా అది సాధ్యమని కూడా కచ్చితంగా చెప్పలేం. ఇప్పటికీ పేదరిక నిర్మూలనం కంటే లాభాపేక్ష; ఐక్యత కంటే వివాదం దారుణమైన రీతిలో ఆకర్షణీయంగా ఉంటోంది. కలిసికట్టుగా ఉన్నమానవ సమాజానికి మనం ఎంతో దూరంలో ఉన్నాం.

అందువలన నేను ఈ సంవత్సరం ఒక భిన్నమైన పద్ధతిని అవలంభిస్తున్నాను. ఈ పద్ధతిలో కూడా మెరుగవ్వడమనే విషయం కలిసే ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నది. వికాసం చెందడానికే కాబట్టి. అంతేకాకుండా, సమిష్టి వికాసం వ్యక్తిగత మార్పుతోనే అంచనా వేయబడుతుంది. అయితే ఇందులో మరింత గొప్ప పాత్ర పోషించవలసిన అంశాలు ఏవో ఇమిడి ఉన్నాయి. అవి: పరస్పర అనుసంధానము మరియు ఒకరి పట్ల మరొకరి కర్తవ్యం.

Bu hikaye Heartfulness Magazine Telugu dergisinin January 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye Heartfulness Magazine Telugu dergisinin January 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.