దక్షిణ భారతదేశంలో శ్రీ నృసింహ ఆరాధన ఎక్కువ. అందుకే శ్రీ నృసింహ ఆలయాలు దక్షిణాదిన అధికం. తమిళనాడు, కర్ణాటక, కేరళలో చాలా విశేష నృసింహ ఆలయాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో కూడా అనేక పురాతన శ్రీలక్ష్మీ నారసింహ ఆలయాలు నెలకొని ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో స్వామి నడయాడిన క్షేత్రాలుగా పేర్కొనే నవ నారసింహ క్షేత్రాలు ఉన్నాయి. అవి అహోబిలం, సింహాచలం, వేదాద్రి, మంగళగిరి, అంతర్వేది, మాలకొండ(మాల్యాద్రి), పెంచలకోన, యాదాద్రి, ధర్మపురి.
శ్రీ వరాహ లక్ష్మీ నారసింహ స్వామి కొలువైన సింహాచలం, స్వామి లోకకంఠకుడైన హిరణ్యకశ్యపుని సంహరించిన ప్రదేశంగా ప్రఖ్యాతి గాంచిన అహోబిలం వీటిలో మొదటి వరసలో ఉంటుంది. ప్రతి ఒక్క క్షేత్రం తమవైన పురాణ గాథలు కలిగి వుండటం విశేషం. నారసింహ అవతారంలో స్వామి చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకొన్న స్థలంగా నెల్లూరు జిల్లాలోని పెంచలకోన (పెనుశిల) ప్రఖ్యాతి గాంచింది.
క్షేత్ర గాథ
చుట్టూ పర్వతాలు, వాటి నుంచి జాలువారే జలపాతాలు..నగర జీవితానికి భిన్నంగా వుండే ప్రశాంత వాతావరణం ఈ ఆలయ ప్రత్యేకత. కొండల మీద ప్రవహించే కండలేరు ఆలయ వెనుక భాగాన పెద్ద జలపాతంగా మారి నేలకు జాలువారుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో చాలా సుందరంగా ఉంటుందా దృశ్యం. గతంలో ఈ ప్రదేశం ఋషివాటిక. శ్రీ కణ్వమహర్షి తపస్సు చేసిన ప్రదేశమిది. ఈయన ప్రస్తావన అనే పురాణాలలో కనిపిస్తుంది... ముఖ్యంగా మహాభారతంలో. మేనకా, విశ్వామిత్రుల పుత్రిక అయిన శకుంతలను పెంచిన తండ్రి కణ్వమహర్షి. శకుంతల కుమారుడైన భరతుని వల్లనే కదా మన దేశానికి భరతభూమి అన్న పేరు వచ్చిన విషయం మనందరికీ తెలుసు. కణ్వమహర్షి శ్రీ నారసింహుని గురించి తపస్సు చేసి స్వామివారి దర్శనాన్ని పొందిన స్థలం ఇదేనని అంటారు.
This story is from the September 01, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 01, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మన ఆహారం శ్రేష్టమైనదేనా?
భారతీయ ఆహారం ప్రపంచంలోనే అతి పురాతనమైన, సాంస్కృతికంగా సమృద్ధిగా ఉన్న వంటకాలలో ఒకటి.భారతీయ వంటకాల వైవిధ్యం, ఆరోగ్యకరమైన పదార్థాల వినియోగం, సాంప్రదాయ పద్ధతులు భారతీయులను మాత్రమేకాక, ఇతర దేశాల ప్రజలను కూడా ఆకర్షిస్తాయి
బాలగేయం
బాల సాహిత్య
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
నేటి మహిషాసురుడు
ఉగ్రసేన్ కాళీ భక్తుడు. కలకత్తా నుండి తెలుగు రాష్ట్రంలో నున్న ఓ పట్టణానికి వచ్చి వ్యాపారస్థుడిగా మంచి పేరు తెచ్చుకొన్నాడు.
రంగులు వేయండి
రంగులు వేయండి
జ్ఞానులకు జ్ఞాని బుద్ధుడు
బుద్ధుడు చెప్పిన విషయాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి, ఎన్నో రకాలుగా స్ఫూర్తినిచ్చాయి.
కృష్ణుడి కథనం- 'బర్బరికం'
లక్షశ్లోకాల మహాభారత కావ్యంలో శ్రీకృష్ణుడి పాత్ర విశిష్ట మైంది. మహాభారతంలో ఎక్కడా ఉల్లేఖించబడని 'బర్బరిక కథ జనపదాలలో వాడుకలో వున్న లెక్కలేనన్ని పాత్రలలో 'బర్బరిక’' పాత్ర ఒకటి. నేటి రాజస్థాన్లోని సికార్ జిల్లాలో ఖాటో అన్న పల్లెలో బర్బరికకు దేవాలయం ఉంది.
'ఘర్షణ' నీహారిణి కథాసంపుటి
డా॥ కొండపల్లి నీహారిణి, తెలుగు కవయిత్రిగా, రచయి త్రిగా సృజనాత్మక ప్రతిభతో వాస్తవ జీవన మానవీయ విలువ లను ప్రతిబింబింపచేయగల చైతన్యశీలి.
శ్రీకృష్ణతత్వానికి దర్పణం 'రాధామాధవం'
బాల్యం నుండి భగవాన్ శ్రీకృష్ణుని యందు తన కు గల భక్తిని ప్రేమగా పెంచుకుని తన జీవన సారధి ఆ కృష్ణుడే అని గాఢంగా నమ్మిన లలిత 'రాధామాధవం' పేరిట ఓ పొత్తం వెలువరించా రు
అనుమాండ్ల సిద్ధాంత గ్రంథాలు
పుస్తక సమీక్ష