మొగావో గుహల పేరుతో అద్భుతమైన బౌద్ధ గుహలు చైనాలోని గన్సు ప్రాంతంలో గోబీ ఎడారి అంచున ఉన్న ఒయాసిస్ పట్టణం డున్హువాంగు ఆగ్నేయంగా 25 కి.మీ. దూరంలో సిల్క్ రోడ్ ప్రాంతంలో ఉన్నాయి.
మింగ్షా పర్వతాల తూర్పులో ఒక కొండలో ఈ గుహలను చెక్కారు. ఇవి ఒక మైలు కంటే ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. చువాన్ నదికి ఎగువన ఉన్న కొండలపై ఈ గుహలను చెక్కారు. వీటినే వెయ్యి బుద్ధుల గుహలు (థౌజండ్ బుద్ధ గ్రోటోస్), డున్హువాంగ్ గుహలు, అసలు గుహలు ఇత్యాది పేర్లతో పిలుస్తారు. రెండు వేల సంవత్సరాల బౌద్ధ కళ ఇక్కడ సాక్షాత్కరిస్తుంది. వందలాది బౌద్ధ ఆలయాలు, శిల్పకళ, చిత్రకళతో తొమ్మిది అంతస్తులలో విరాజిల్లుతున్నాయి. పురావస్తు శాఖవారు ఇక్కడ 492 బౌద్ధ మందిరాలను కనుగొన్నారు. నిజానికి అయిదు ప్రదేశాలలో 750లకు పైగా గుహలు ఇక్కడ ఉన్నట్లు అంచనా. వీటిలో 6 వేలకు పైగా బౌద్ధ విగ్రహాలు, 2,415 చిత్రాలు ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. అడుగు ఎత్తులో ఉన్న చిన్న గుహలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. అయితే పలు కారణాల వల్ల అనేక గుహలు ధ్వంసమైనాయి.కాలగతిలో కొన్ని శిథిలమైతే; నిధి నిక్షేపాల వేటకై వచ్చిన అన్వేషకులు, బందిపోట్లు కొన్నింటిని ధ్వంసం చేశారు.1908లో మొగావో గుహలు ఉన్న విధంగా 2008లో లేవు. అంటే కాలగతిన ఏ విధంగా దెబ్బతింటున్నాయనేది అవగతమౌతుంది. చైనీయుల సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచివున్న ఈ గుహలను కాపాడుకోవడానికి చర్యలు చేపట్టారు. మొగావో గుహలు చైనీస్ బౌద్ధ గుహలలో బాగా ప్రసిద్ధి చెందాయి. లాంగ్మెన్ గ్రోటోస్, యుంగాంగ్ పాటు చైనాలోని మూడు ప్రసిద్ధ పురాతన బౌద్ధ శిల్పకళా స్థలాలలో ఒకటిగా మొగావో విరాజిల్లుతోంది. ప్రపంచంలో ఎక్కడా.కానరాని బుద్ధుని విగ్రహాలు, చిత్రాలను ఇక్కడ చూడవచ్చు. అయితే కొన్ని నిర్మాణ తీరులో టిబెట్‌లోని కట్టడాల శైలిని పోలి ఉంటాయని చెబుతుంటారు.మొగావో గుహలను 1987లో యునెస్కోవారు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు.
This story is from the April 14, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 14, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
'సంఘ్' భావం
ప్రతి ఏటా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తూ రికార్డులను సృష్టిస్తున్నాయి.
ప్లవర్ క్లిప్పులు
తులిప్, బ్లూ బెల్స్ లాంటి ప్రత్యేక మైన పువ్వులు నచ్చేవారు కొందరుం టారు.
తాజా వార్తలు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్వరలో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంల
విభిన్నమైన కథాంశంతో ఎస్ఎస్ఎమ్ బి 29
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్వరలో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా ఎస్ఎస్ఎమ్బి 29 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే
తారాతీరం
రాజ్ హుడ్ ' లో రాశి ఖన్నా!
ఫొటో ఫీచర్
ఫొటో ఫీచర్
ఈ వారం కార్త్యూన్స్
ఈ వారం కార్త్యూన్స్
వారఫలం
21 ఏప్రిల్ నుండి 27, 2024 వరకు
వాస్తుగోళాలు అంటే?
వాస్తుగోళాలు అంటే?
ప్రేమ ఉన్మాదం కాకూడదు
నేను ప్రేమించాను. నన్ను ప్రేమించటం లేదని ఆగ్రహించటం, ప్రేమించమని పోరు పెట్టటం, ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించటం, చివరికి ప్రేమ ఉన్మాదంగా మారి దారుణంగా చంపేయటం లాంటి సంఘటనలు చాలా చోట్ల చాలా జరుగుతున్నాయి