కవర్ స్టోరీ
Vaartha-Sunday Magazine|March 31, 2024
నేడు మానవ జీవితం యాంత్రికంగా తయారైం ది. వారి వారి దినచర్యలో జై ప్రతిఒక్కరూ పరుగులు తీస్తున్నారు
షేక్ అబ్దుల్ హకీం జాని
కవర్ స్టోరీ

నేడు మానవ జీవితం యాంత్రికంగా తయారైం ది. వారి వారి దినచర్యలో జై ప్రతిఒక్కరూ పరుగులు తీస్తున్నారు. ఖాళీ దొరికితే సెల్‌ఫోన్లు, టి.వీలకు అతుక్కుపోతు న్నారు. వీటికి దూరంగా ఇంటి నుండి మనసుకు నచ్చిన సుదూర పర్యాటక ప్రాంతానికి వెళ్లి అక్కడి స్థలాలు, నిర్మాణాలు, జల పొతాలు, సరస్సులు, నదులు, రమణీయ మైన ప్రకృతి, నగరాలు, వింతలు, విడ్డూరాలు, ఆయా ప్రాంతాల ఆచారాలు, ఆహార నియమాలు, సంస్కృతీ సంప్రదాయాలు తెలుసుకుంటే మనోల్లాసం కలుగుతుంది.

పర్యాటకం అంటే ఆంగ్లంలో టూరిజం అంటారు. ఇది లాటిన్‌ పదమైన టోరోనస్‌ నుండి ఆవిర్భవించింది. 16వ శతాబ్దంలో ఈ పదానికి అర్ధం చక్రంలాంటిది అని నిర్వచించారు. ఈ పదానికి నేడు ప్రపంచ టూరిజం ఆర్గనైజేషన్‌ సంస్థ వారు జ్ఞానాన్వేషణ కోసం ఒకచోట నుంచి మరొక చోటకి వెళ్లడం అని నిర్వచిస్తున్నారు. అనేకమంది పర్యాటకులు సందర్శిస్తే ఆ ప్రాంతంలో వ్యాపారం పెరుగుతుంది. చాలామందికి జీవనోపాధి లభిస్తుంది. గైడ్‌ల సహాయంతో అక్కడి చరిత్రను ప్రజలు తెలుసుకుంటారు. ఇలా ప్రజలు పర్యటన చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఒకప్పుడు కేవలం సంపన్నవర్గాల వారు మాత్రమే ప్రపంచంలోని సుదూర ప్రాంతాలను పర్యటించేవారు. నేడు మధ్యతరగతి వారు కూడా ఆటవిడుపు కోసం తమకు అందుబాటులో ఉన్న పర్యాటక స్థలాలను సందర్శించి మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నారు. ప్రసిద్ధ భవనాలు, గొప్ప కళాఖండాలు, కొత్త వ్యక్తులను కలవడం, కొత్త సంస్కృతులను అనుభవించడం, విభిన్న ఆహార రుచులను చూడటం, సముద్ర స్నానాలు చేయడం ఇత్యాది వాటి పట్ల ప్రజలకు మక్కువ పెరగడం వల్ల పర్యాటక రంగం దినదినాభివృద్ధి చెందుతుంది. విపరీతమైన జనం రావడం, రద్దీ పెరగడాన్ని మాస్‌ టూరిజం అంటారు. ఆధ్యాత్మిక ప్రదేశాలను తిలకించడాన్ని టెంపుల్‌ టూరిజం అంటారు. తెలుగురాష్ట్రాలతో పాటు మనదేశంలో, ప్రపంచం వ్యాప్తంగా అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఆర్థిక స్థోమతను బట్టి ప్రజలు నచ్చిన ప్రదేశానికి వెళ్లి సేదతీరి కొత్త ఉత్సాహంతో తిరిగి వచ్చి తమ దైనందిన కార్యక్రమాలలో నిమగ్నమౌతుంటారు. ముఖ్యంగా వేసవి వచ్చిందంటే పాఠశాలలో చదువుతున్న పిల్లలకు సెలవులు వస్తాయి. ఆ కారణంగా వేసవిలో పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి అనేకమంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇటువంటి వారు సందర్శించడానికి అనువైన అనేక పర్యాటక ప్రదేశాల వివరాలు తెలుసుకుందాం.

This story is from the March 31, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the March 31, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHA-SUNDAY MAGAZINEView All
కడగండ్ల కడలిలో తెలుగు
Vaartha-Sunday Magazine

కడగండ్ల కడలిలో తెలుగు

ప్రాచీన కాలం నుండి వింధ్య పర్వత శ్రేణికి దక్షిణంగా వ్యాపించిన జాతి తెనుగువారు.

time-read
2 mins  |
May 19, 2024
మోంటానాలోని రో నది ప్రత్యేకత
Vaartha-Sunday Magazine

మోంటానాలోని రో నది ప్రత్యేకత

అమెరికాలోని మోంటానాలో రో నది కేవలం 201 అడుగుల దూరం మాత్రమే ప్రవహిస్తుంది.

time-read
1 min  |
May 19, 2024
ఫోన్ భద్రంగా..
Vaartha-Sunday Magazine

ఫోన్ భద్రంగా..

ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవటానికి అత్యుత్తమైన మార్గం దగ్గరే పెట్టుకోవటం. వోటళ్లకు వెళ్లినప్పుడు పర్సును టేబుల్‌ మీద పెట్టం కదా

time-read
2 mins  |
May 19, 2024
కొరియన్ క్రేజ్..
Vaartha-Sunday Magazine

కొరియన్ క్రేజ్..

కె-పాప్‌, కె-డ్రామా, కె-పుడ్‌, కె-ఫ్యాషన్‌ అంటే అందరికీ అర్థంకాకపోవచ్చు కానీ టీనేజర్లను అడిగి చూడండి... మీకు ఇది కూడా తెలియదా అంటూ వింతగా చూస్తారు.

time-read
2 mins  |
May 19, 2024
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

ఇష్టo

time-read
1 min  |
May 19, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్‌ ఎడిటర్‌ గిరీష్‌ అంకుల్‌ సమాధానాలు

time-read
1 min  |
May 19, 2024
నివృత్తి
Vaartha-Sunday Magazine

నివృత్తి

కథ

time-read
1 min  |
May 19, 2024
డిప్రెషన్తో 'ఢీ'!
Vaartha-Sunday Magazine

డిప్రెషన్తో 'ఢీ'!

డిప్రెషన్ అనేది, మనస్సుకు సంబంధించిన ఒకరకమైన రుగ్మతగా పేర్కొనవచ్చు

time-read
3 mins  |
May 19, 2024
'బి.ఎస్. రాములు జీవనగమనం
Vaartha-Sunday Magazine

'బి.ఎస్. రాములు జీవనగమనం

పుస్తక సమీక్ష

time-read
1 min  |
May 19, 2024
విశ్వాసం, ప్రేమను పెంచే కథలు
Vaartha-Sunday Magazine

విశ్వాసం, ప్రేమను పెంచే కథలు

పుస్తక సమీక్ష

time-read
1 min  |
May 19, 2024