'అవతార్ చిత్రానికి స్ఫూర్తి 'టియాంజీ'
Vaartha-Sunday Magazine|January 14, 2024
చైనా హువాంగ్ ప్రావిన్సీ లోని జంగ్జియాజీ అనే పట్టణం సమీపంలో ఒలింగ్ ఇవాన్ ఈశాన్య ప్రాంతంలో జంగ్జియాజీ పర్వతాలు నెలకొని ఉన్నాయి
షేక్ అబ్దుల్ హకీం జాని
'అవతార్ చిత్రానికి స్ఫూర్తి 'టియాంజీ'

వీటిని టంగ్జియాజీ పర్వతాలు అని కూడా పిలుస్తారు. అన్నింటి కంటే ప్రధాన పర్వతం టియాంజీ పర్వతం. మొత్తం 16 వేల 550 ఎకరాలలో ఇవి విస్తరించి ఉన్నాయి. ఇన్ని వేల ఎకరాలలో కొన్ని వందల పర్వతాలు ఆకాశ హర్మ్యాల్లా పదునైన శిఖర కొనలతో ఎత్తైన స్తంభాల్లా విస్తరించి ఉన్నాయి. ఈ పర్వతాలు పెన్సిల్ను నిలబెట్టినట్లు ఉంటాయి. 1982 నుండి చైనా ప్రభుత్వం దీన్ని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించింది. టియాంజీ అంటే చైనా భాషలో స్వర్గపుత్రుడు అని అర్థం. యునెస్కోవారు దీన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు.

టియాంజీ అనే పేరు ఎందుకు వచ్చింది?

ఈ పర్వతాలకు టియాంజీ పర్వతం అనే పేరు రావడానికి స్థానికులు ఒక కథ చెబుతారు. సాంగ్ వంశం చివరి దశలో టుజియా గిరిజన తెగ ఉండేది. ఆ తెగ నాయకుడి పేరు టియాంజీ. ఈ పర్వతాలకు ఆయన పేరే పెట్టారు.టియాంజీ ఈ పర్వతాల్లోనే చనిపోయినట్లు చెబుతుంటారు.గిరిజన తెగకు చెందిన జియాంగ్ అనే వ్యక్తి 12వ శతాబ్దపు ప్రముఖుడు. ఆ సమయంలోనే స్థానిక రైతులను ఏకం చేసి వ్యవసాయంలో సంస్కరణలు తీసుకుని వచ్చి రైతు తలరాత మార్చాడు. అప్పటి నుండి అతడ్ని టియాంజీ అని జనం పిలుచుకునేవారు. భగవంతుడే అతడ్ని తమకోసం దివి నుండి భువికి పంపాడని అప్పటి స్థానికుల ప్రగాఢ విశ్వాసం.రాజరికం రాజ్యమేలుతున్న ఆ కాలంలో రాజును మించిన గౌరవాన్ని టియాంజీ పొందారు. ఆయన ఈ పర్వతం పైనే కన్ను మూశాడు. ఆయన ఆత్మ ఇక్కడ తిరుగుతుందని నేటికీ గిరిజన తెగలవారు నమ్ముతారు. స్థానికులు ఈ పర్వతాలను టియాన్మన్ మౌంటెన్స్ అని కూడా పిలుస్తారు. పర్వతం పై భాగానికి చేరడానికి లిఫ్ట్ సౌకర్యం ఉంది. అక్కడ నుండి కేబుల్ కార్లలో ఈ ప్రకృతి అందాలను వీక్షించవచ్చు.

అద్భుతాలకు నిలయం

This story is from the January 14, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the January 14, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHA-SUNDAY MAGAZINEView All
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
May 19, 2024
ఈ వారం కార్ట్యూన్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూన్స్

ఈ వారం కార్ట్యూన్స్

time-read
1 min  |
May 19, 2024
19 మే నుండి 25, 2024 వరకు
Vaartha-Sunday Magazine

19 మే నుండి 25, 2024 వరకు

వారఫలం

time-read
2 mins  |
May 19, 2024
సెల్లార్ పైకప్పు ఎంత ఎత్తులో ఉండాలి?
Vaartha-Sunday Magazine

సెల్లార్ పైకప్పు ఎంత ఎత్తులో ఉండాలి?

వాస్తువార్త

time-read
2 mins  |
May 19, 2024
అజ్ఞానం ఎంత అదృష్టమో!
Vaartha-Sunday Magazine

అజ్ఞానం ఎంత అదృష్టమో!

'అడిగేవాడికి చెప్పేవాడు లోకువ\" అన్నారు.'ప్రశ్నలు అడగడంలోని ఆనందం సౌలభ్యం, సమాధానాలు చెప్పడంలో వుండదు.

time-read
2 mins  |
May 19, 2024
ఆంధ్రాలో చూడదగ్గ స్థలాలు
Vaartha-Sunday Magazine

ఆంధ్రాలో చూడదగ్గ స్థలాలు

ఆంద్రప్రదేశ్ పురాతత్వ స్థలంగా ప్రసిద్ధి చెందిన జ్వాలాపురం గ్రామం కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఉంది. జ్వాలాపురం చుట్టుపక్కల సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో పురాతత్వ స్థలాలు విస్తరించి ఉన్నాయి

time-read
3 mins  |
May 19, 2024
సింగిల్ పేజీ కథ
Vaartha-Sunday Magazine

సింగిల్ పేజీ కథ

ఈ రోజు నాన్నగారి శత జయంతి. పొద్దుటే గుడికెళ్లి పూజ చేయించి ఇంటికొచ్చాక కాఫీ తాగుతూ సెల్ ఫోన్లో వాట్సప్ సందేశాలు చూస్తూ కూర్చున్నాను.

time-read
1 min  |
May 19, 2024
ధర్మసంకటం
Vaartha-Sunday Magazine

ధర్మసంకటం

“నా కు వేదిక ఎక్కి మాట్లాడాలంటే ఏమాత్రం ఇష్టం ఉండదు సార్, అయినా ఉన్నట్టుండి ఈయన నాలుగు \" మాటలు మాట్లాడుతారు అని చెప్పేసారండి\" ఓ కార్యక్రమ నిర్వాహకుడు.

time-read
1 min  |
May 19, 2024
కడగండ్ల కడలిలో తెలుగు
Vaartha-Sunday Magazine

కడగండ్ల కడలిలో తెలుగు

ప్రాచీన కాలం నుండి వింధ్య పర్వత శ్రేణికి దక్షిణంగా వ్యాపించిన జాతి తెనుగువారు.

time-read
2 mins  |
May 19, 2024
మోంటానాలోని రో నది ప్రత్యేకత
Vaartha-Sunday Magazine

మోంటానాలోని రో నది ప్రత్యేకత

అమెరికాలోని మోంటానాలో రో నది కేవలం 201 అడుగుల దూరం మాత్రమే ప్రవహిస్తుంది.

time-read
1 min  |
May 19, 2024